
వాషింగ్టన్: దీర్ఘకాలికంగా ఎకానమీ వృద్ధి మెరుగుపడేందుకు సేవల రంగంలో సంస్కరణలు తోడ్పడతాయనడానికి భారత్ నిదర్శనమని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నాయి.
1990లలో భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మరింత స్వేచ్ఛా వాణిజ్యానికి, మెరుగైన నియంత్రణ విధానాలు, భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడ్డాయని నివేదిక వివరించింది. దేశ, విదేశీ సంస్థల నుంచి భారత తయారీ సంస్థలు సర్వీసులు పొందేందుకు, పోటీ సంస్థలకు దీటుగా ఎదిగేందుకు ఇవి తోడ్పడ్డాయని పేర్కొంది. బ్యాంకింగ్, బీమా, టెలికమ్యూనికేషన్స్, రవాణా వంటి రంగాల్లో పోటీతత్వాన్ని పెంచేలా ప్రవేశపెట్టిన సంస్కరణలు.. తయారీ సంస్థల ఉత్పాదకత పెరిగేందుకు ఉపయోగపడ్డాయని వివరించింది.