కొనుగోళ్ల జోరుతో లాభాల్లో ముగిసిన నిన్నటి మార్కెట్లు, శుక్రవారం ట్రేడింగ్లోనూ మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి.
లాభాల్లో నడుస్తున్న మార్కెట్లు
Apr 21 2017 9:40 AM | Updated on Sep 5 2017 9:20 AM
ముంబై:
కొనుగోళ్ల జోరుతో లాభాల్లో ముగిసిన నిన్నటి మార్కెట్లు, శుక్రవారం ట్రేడింగ్లోనూ మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. పాజిటివ్గా వస్తున్న ఆసియా సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి.100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 58.57 పాయింట్ల లాభంలో 29,480 వద్ద ట్రేడవుతోంది. 20.20 పాయింట్ల లాభంలో నిఫ్టీ 9156 వద్ద కొనసాగుతోంది.
ఆసియా నుంచి పాజిటివ్ సంకేతాలతో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఎఫ్ఎమ్సీజీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 8 పైసలు పడిపోయి 64.64 వద్ద ప్రారంభమైంది.బంగారం ధరలు స్వల్పంగా 3 రూపాయల నష్టంలో 29,302 వద్ద నమోదవుతున్నాయి.
Advertisement
Advertisement