సీఎం పులివెందుల పర్యటన ఇలా.... | YS Jagan Mohan Reddy Visits Pulivendula Thursday | Sakshi
Sakshi News home page

సీఎం పులివెందుల పర్యటన ఇలా....

Aug 7 2019 6:07 AM | Updated on Aug 7 2019 7:32 AM

YS Jagan Mohan Reddy Visits Pulivendula Today - Sakshi

సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందుల పర్యటనకు వస్తున్నారు. ఆరోజు ఉదయం 9.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని 9.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంట లకు పులివెందుల గాయత్రి కాలనీలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 10.30 గంటలకు భాకరాపురం చేరుకుంటారు. 10.35 నుంచి 10.55 గంటల వరకు మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి విహ్రావిష్కరణ కార్యక్రమంలో పాల్గొం టారు. 11.00 గంటలకు భాకరాపురం నుంచి బయలుదేరి  11.10 గంటలకు పులి వెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు వస్తారు. 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు పులివెందుల అభివృద్దిపై అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 12.15 నుంచి 12.45 గంటల వరకు రిజర్వుడు. 12.50 గంటలకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి గాయత్రి కాలనీ వద్దగల హెలిప్యాడ్‌కు 12.55 గంటలకు చేరుకుం టారు. మధ్యాహ్నం 1.00 గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుగొండకు వెళతారు.  

Advertisement
 
Advertisement
Advertisement