రాష్ట్రానికి విశాఖే బెస్ట్‌ : టి. సుబ్బిరామిరెడ్డి | Visakhapatnam is the Best for AP: T. Subbarami Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి విశాఖే బెస్ట్‌ : టి. సుబ్బిరామిరెడ్డి

Dec 27 2019 11:14 AM | Updated on Dec 27 2019 1:04 PM

Visakhapatnam is the Best for AP: T. Subbarami Reddy - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంచుకోవడంపై రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి స్పందించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన జీఎన్‌ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్నా. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడం ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. విభజనకు ముందు హైద్రాబాద్‌ తర్వాత పెద్ద సిటీ విశాఖే. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు విస్తారమైన భూములున్నాయి. పరిశ్రమలున్నాయి. పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారు. విస్తరణకు మంచి అవకాశముంది. ఆర్థిక సమస్యలున్న దృష్ట్యా ప్రస్తుతానికి రెడీమేడ్‌ సిటీ విశాఖయే మంచి ఆప్షన్‌. మరింత అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అద్భుతమైన రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement