పండుగలకు ప్రత్యేక రైళ్లు | special trains in festival season | Sakshi
Sakshi News home page

పండుగలకు ప్రత్యేక రైళ్లు

Sep 20 2013 11:32 PM | Updated on Jul 29 2019 6:03 PM

దసరా,దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్-మచిలీపట్నం, హైదరాబాద్-రేణిగుంట

సాక్షి, హైదరాబాద్:
 దసరా,దీపావళి పండుగల సందర్భంగా  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని  సికింద్రాబాద్-మచిలీపట్నం, హైదరాబాద్-రేణిగుంట,  సికింద్రాబాద్ -విశాఖ  మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో  తెలిపారు.సికింద్రాబాద్-మచిలీపట్నం (07050) ప్రత్యేక రైలు అక్టోబర్ 6,13,20,27 తేదీల్లో  ఉదయం 10.30 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 7.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో మచిలీపట్నం-సికింద్రాబాద్ (07049) రాత్రి 8.30 కు మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాజీపేట్,వరంగల్,మహబూబ్‌బాద్,ఖమ్మం,విజయవాడ,గుడివాడ,గుడ్లవల్లేరు,కౌతారం,పెడన,చిలకలపూడి స్టేషన్‌లలో ఇవి ఆగుతాయి.
 
     హైదరాబాద్-రేణిగుంట (07145) ఏసీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్  అక్టోబర్ 4,11,18,25 తేదీల్లో రాత్రి  11.15 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంట-హైదరాబాద్ (07146) అక్టోబర్ 5,12,19,26 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు  నాంపల్లి చేరుకుంటుంది. కాజీపేట్, వరంగల్,ఖమ్మం,విజయవాడ,న్యూ గుంటూరు,తెనాలి,చీరాల,ఒంగోలు,నెల్లూరు,గూడూరు స్టేషన్‌లలో ఆగుతాయి.
 
     సికింద్రాబాద్-విశాఖ (02728) ఏసీ సూపర్‌ఫాస్ట్ అక్టోబర్ 4,11,18,25 తేదీల్లో రాత్రి 10.10 గంటలకు  సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు  విశాఖకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-సికింద్రాబాద్ (02727) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 5,12,19,26 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు  సికింద్రాబాద్ చేరుకుంటుంది.ఈ  ట్రైన్‌లు కాజీపేట్, వరంగల్,విజయవాడ,ఏలూరు,తాడేపల్లిగూడెం,రాజమండ్రి,సామర్లకోట,అన్నవరం,తుని,అనకాపల్లి,దువ్వాడ స్టేషన్‌లలో ఆగుతాయి.
 
 ఉర్సు ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు
 హజ్రత్ ఖాజా బందనవాజ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్లే  ప్రయాణికుల కోసం   హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు ప్రత్యేక రైళ్లు  బయలుదేరనున్నాయి. హైదరాబాద్-గుల్బర్గా (07178) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ రాత్రి  10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు గుల్బర్గా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుల్బర్గా-హైదరాబాద్ (07177) ఈ నెల 22వ తేదీ ఉదయం 5.25 గంటలకు బయలుదేరి  అదే రోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.మరో ట్రైన్ హైద రాబాద్-గుల్బరా (07180) ఈ నెల  25వ తేదీ  ఉదయం 5.30 కు  నాంపల్లి నుంచి బయలుదేరి ఉదయం 11.20 కి గుల్బర్గా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుల్బర్గా-హైదరాబాద్ (07179) 25వ తేదీ మధ్యాహ్నం 12.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.35 కు నాంపల్లికి చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement