బాధితుల‌కు సహాయం చేస్తాం: ఎల్జీ పాలిమ‌ర్స్‌

South Korea Expert Team Visit LG Polymers In Visakhapatnam - Sakshi

ప్రమాదంపై సుదీర్ఘంగా చర్చించిన దక్షిణ కొరియా ప్రతినిధులు

నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేస్తామని ప్రకట‌న‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ‌‌ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై విచారణ జరిపేందుకు దక్షిణ కొరియా నుంచి యాజమాన్యం తరఫున 8మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం బుధవారం విశాఖ చేరుకుంది. వీరంతా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక విమానంలో ఉదయం 11.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ వారికి కోవిడ్‌-19 స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ బృందం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌కు చేరుకుంది. (ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ తరలింపు)

ఎల్జీ కెమికల్స్ ప్రెసిడెంట్ నోహ్ కుగ్ లే ఆధ్వర్యంలో ఎనిమిది మంది ప్రతినిధుల బృందం కంపెనీని సంద‌ర్శించింది. అనంత‌రం ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై మూడు గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపింది. బాధిత కుటుంబాలను పరామర్శించిన త‌ర్వాతే వారికి ఎలాంటి సహయ సహకారం అందిస్తారనే విష‌యాల‌ను స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వనుంది. స్థానిక అధికార యంత్రాంగం ద్వారా నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేస్తామని ఎల్‌జీ యాజమాన్యం ప్ర‌క‌టించింది. (విశాఖలో సాధారణ పరిస్థితులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top