ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ తరలింపు

Styrene Gas returned to South Korea says Collector Vinay chand - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్‌ను జిల్లా యంత్రాంగం  గుర్తించింది. మంగళవారం రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా స్టైరిన్‌ అధికారులు తరలిస్తున్నారు. 13వేల టన్నుల స్టైరిన్‌ దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. (విశాఖలో నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్)

ఎల్జీ పాలిపర్స్ వద్ద ఉన్న యమ్‌ 5,111ఏ, 111బీ ట్యాంకులలోని 3209 స్టెరైన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నరాత్రి నుంచి 20 టన్నుల చొప్పున ఫ్యాక్టరీ నుంచి స్టెరైన్‌ని రోడ్డు మార్గంలో అధికారులు తరలించారు. పోర్టు ప్రాంతంలో టీ2, టీ3 ట్యాంకులలో ఉన్న 9869 టన్నుల స్టెరైన్‌ని వెనక్కి పంపించేందుకు పోర్టు అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడారు. టీ2, టీ3 ట్యాంకుల నుంచి 7919 టన్నుల స్టెరైన్‌ని వెజల్ అర్హన్‌లోకి‌ లోడింగ్ పూర్తి చేశారు. మిగిలిన స్టెరైన్‌ని వెజల్ నార్డ్ మేజిక్ ద్వారా మే 17 లోపు దక్షిణకొరియా తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. (స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top