సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశం | provide assistance to flood victims, ys jaganmohan reddy asked party leaders | Sakshi
Sakshi News home page

సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశం

Oct 24 2013 1:34 PM | Updated on Apr 4 2018 9:25 PM

సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశం - Sakshi

సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశం

రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముంపు ప్రాంతాల్లో వరద నష్టంపై ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముంపు ప్రాంతాల్లో వరద నష్టంపై ఆరా తీస్తున్నారు. భారీ వర్షాల బారిన పడిన జిల్లాల నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏయే జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లిందో తెలుసుకుంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాసం గురించి అడుగుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. పలు జిల్లాల్లో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉన్న ఒంగోలులో సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  జలదిగ్బంధంలో చిక్కుకున్న బాధితులను ఆయన దగ్గరరుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా సంబంధిత అధికారులను బాలినేని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement