నెల్లూరు: సార్వత్రిక బరిలో 132 మంది

 Lok Sabha, Assembly Candidates List In Nellore - Sakshi

ముగిసిన నామినేషన్ల ఘట్టం

నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌లకు రంగంలో 25 మంది 

10 అసెంబ్లీ స్థానాలకు 107 మంది పోటీ

ఉదయగిరి అసెంబ్లీకి అత్యధికంగా 13 మంది  

సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 132 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 182 మంది నామినేషన్లు వేశారు. 39 మందివి తిరస్కరించారు. 11 మంది విత్‌డ్రా చేసుకున్నారు.

 • నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో 21 మంది నామినేషను వేయగా ఏడు తిరస్కరించారు. ఒకరు విత్‌డ్రా చేసుకున్నారు. 13 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 
 • తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి 17 మంది నామినేషన్లు వేశారు. ఐదుగురివి తిరస్కరించారు. 12 మంది పోటీలో ఉన్నారు. 
 • కావలి అసెంబ్లీకి 14 మంది నామినేషన్లు వేయగా అందులో ఐదు తిరస్కరించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి విత్‌డ్రా చేసుకున్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. 
 • ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఒకరిది తిరస్కరించారు. 13 మంది రంగంలో ఉన్నారు. 
 • కోవూరు అసెంబ్లీకి 11 మంది నామినేషన్లు వేయగా, మూడు తిరస్కరించారు. ఒకరు విత్‌డ్రా చేసుకున్నారు. ఏడుగురు అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. 
 • నెల్లూరు సిటీకి సంబంధించి 20 మంది నామినేషన్లు వేయగా ఆరు తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకోగా 12 మంది రంగంలో ఉన్నారు.
 • నెల్లూరు రూరల్‌ అసెంబ్లీకి 15 మంది నామినేషన్లు వేయగా ఒకరిది తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. 12 మంది పోటీలో ఉన్నారు.
 • సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 12 మంది నామినేషన్లు వేయగా, రెండు తిరస్కరించారు. పదిమంది బరిలో నిలిచారు. 
 • గూడూరు అసెంబ్లీకి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరివి తిరస్కరించారు. 12 మంది రంగంలో ఉన్నారు. 
 • సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబం ధించి 13 మంది నామినేషన్లు వేయగా ఇద్దరివి తిరస్కరించారు. ఇద్దరు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిపోరులో 9 మంది నిలిచారు. 
 • వెంకటగిరిలో 14 మంది నామినేషన్లు వేయగా ముగ్గురివి తిరస్కరించారు. 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 
 • ఉదయగిరి నియోజకవర్గానికి 17 మంది నామినేషన్లు వేశారు. వాటిలో నాలుగు తిరస్కరించారు. 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top