కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్ని ప్రమాదం | Fire accident in Coconut Coir Industry in Tetali Village , Tanuku Mandal , West Godavari District | Sakshi
Sakshi News home page

కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్ని ప్రమాదం

Jun 10 2014 10:28 AM | Updated on Sep 5 2018 9:45 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని కొబ్బరి పీచు పరిశ్రమలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని కొబ్బరి పీచు పరిశ్రమలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది శకటాలతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కొబ్బరి పీచు పరిశ్రమలోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement