డబుల్ డెక్కర్ పట్టాలెక్కేనా | Double-decker | Sakshi
Sakshi News home page

డబుల్ డెక్కర్ పట్టాలెక్కేనా

Jan 20 2015 1:57 AM | Updated on Sep 2 2017 7:55 PM

డబుల్ డెక్కర్  పట్టాలెక్కేనా

డబుల్ డెక్కర్ పట్టాలెక్కేనా

ఈసారి కేంద్ర రైల్వే బడ్జెట్‌లో అరుునా విజయవాడ డబుల్ డెక్కర్ రైలు ప్రతిపాదన పట్టాలెక్కనుందా.. ప్రాజెక్టుల కేటారుుంపులో నవ్యాంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తారా?

రైల్వే బడ్జెట్‌పైనే అన్ని ఆశలు
పరిశీలనలో రెండు కీలక ప్రతిపాదనలు
పలాస నుంచి విజయవాడకు డబుల్ డెక్కర్ నడిపే ప్రతిపాదనపై  సర్వత్రా హర్షం

 
రైల్వేస్టేషన్ : ఈసారి కేంద్ర రైల్వే బడ్జెట్‌లో అరుునా విజయవాడ డబుల్ డెక్కర్ రైలు ప్రతిపాదన పట్టాలెక్కనుందా.. ప్రాజెక్టుల కేటారుుంపులో నవ్యాంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తారా? అంటే.. తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దీనిపై ప్రజాప్రతినిధులతో పాటు రైల్వే అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల దక్షిణ  మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవతో రాష్ట్ర ఎంపీలు సమావేశమై అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలపై జీఎం కొంతవరకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు పలు ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పలువురు ఎంపీలు ఇండియన్ రైల్వే టైమ్‌టేబుల్ కమిటీ (ఐఆర్‌టీటీసీ)కి కొన్ని ప్రతిపాదనలు అందజేశారు. దీనిపై ఆ కమిటీ స్పందించి దక్షిణ మధ్య రైల్వేజోన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్లలో రాష్ట్రానికి కావాల్సిన ప్రతిపాదనలు తయూరుచేసింది.

డబుల్ డెక్కర్‌పైనే అన్ని ఆశలు

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వయా నడికుడి, గుంటూరు మీదుగా వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలును విజయవాడ మీదుగా నడపాలనేది ప్రయూణికుల కోరిక. దీనిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి విజయవాడ మీదుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అలాగే, పలాస నుంచి విజయనగరం, విశాఖపట్నం మీదుగా విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు నడపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై పరిశీలనలు జరుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ విష్ణోయ్ విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు లేఖ కూడా రాశారు. దీంతో రెండు జోన్ల జీఎంల చొరవతో విజయవాడ మీదుగా రెండు డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తాయని నగర ప్రజలు ఆశిస్తున్నారు.
 
రెండు దశాబ్దాలుగా అన్యాయమే..

రెండు దశాబ్దాలుగా రైల్వే బడ్జెట్‌లో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్‌లోనూ వందలకొద్దీ ప్రతిపాదనలు వెళ్తున్నా.. ఫలితం మాత్రం దక్కట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పార్లమెంట్‌లో రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇస్తారని అంతా భావిస్తున్నారు. అలాగే, పార్లమెంట్‌లో మన ప్రజాప్రతినిధులు గళం విప్పాల్సిన అవసరం కూడా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement