breaking news
Union Railway Budget
-
మళ్లీ అత్తెసరు నిధులే
రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు అరకొర కేటాయింపులు తిరుపతిలో విశ్రాంతి గదికి రూ.7 కోట్లు తిరుచానూరు స్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు తిరుపతి : ఊహించిందే జరిగింది. కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ అత్తెసరు నిధులే లభించాయి. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిన మేజరు ప్రతిపాదనలకు ఆశిం చిన మేర నిధులు మంజూరు కాలేదు. కేవలం తిరుపతి, తిరుచానూరు రైల్వేస్టేషన్లకు మాత్రమే రూ.13 కోట్లు విదిలించారు. జిల్లా రైల్వే ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం రూ. 80 కోట్లు అవసరమన్న రైల్వే ఇంజినీరింగ్ అధికారుల తాజా ప్రతిపాదనలను కేంద్రంగా పెద్దగా పట్టించుకోలేదు. రైల్వేమంత్రి మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈసారి తిరుపతికి ఎక్కువ నిధులు దక్కుతాయని ఆశించిన రాజకీయ, ఉద్యోగ వర్గాలకు నిరాశే ఎదురైంది. జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు విశేషముంది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్య లో ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. ఈ రెండు స్టేషన్లకు రోజువారీ ఆదాయం కూడా ఎక్కువ. తిరుపతి రోజువారీ ఆదాయం రూ.40 లక్షలకు పైనే ఉంటుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనికితోడు బాలాజీ రైల్వే డివిజన్‌గా తిరుపతిని ప్రకటించాలన్న ప్రతిపాదనలు 1992 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై స్పందించని కేంద్రం 2017–18 రైల్వే బడ్జెట్లో కేవలం రూ.13 కోట్లతో మమ అనిపించారు. తిరుపతికి రూ.7 కోట్లు.... ప్రస్తుతం తిరుపతి స్టేషన్లో రెండు జనరల్ వెయిటింగ్ హాళ్లు, రెండు ఏసీ వెయిటింగ్ హాళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రమూ చాలడం లేదు. దీన్ని గుర్తించిన కేంద్రం మరో విశ్రాంతి హాలు కోసం తాజా బడ్జెట్లో రూ.7 కోట్లు కేటాయించింది. అదేవిధంగా తిరుచానూరు స్టేషన్ అభివృద్ధి కోసం రూ.6 కోట్లు కేటాయించింది. ఇదే స్టేషన్‌కు కిందటి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయి రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు తాజాగా రూ.25 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపారు. అయితే కేవలం రూ.6 కోట్లు మాత్రమే దక్కాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైనుకు రూ.340 కోట్లు ఈసారి మాత్రం నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను పనులకు కాస్త కేటాయింపులు పెంచారు. రూ.340 కోట్లు కేటాయించారు. 309 కిలోమీటర్ల నిడివి గల నూతన రైల్వే మార్గం నిర్మాణానికి మొత్తం రూ.1313 కోట్లు అవసరమని 2011–12లో అంచనా వేశారు. కాగా కిందటి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. -
డబుల్ డెక్కర్ పట్టాలెక్కేనా
రైల్వే బడ్జెట్‌పైనే అన్ని ఆశలు పరిశీలనలో రెండు కీలక ప్రతిపాదనలు పలాస నుంచి విజయవాడకు డబుల్ డెక్కర్ నడిపే ప్రతిపాదనపై సర్వత్రా హర్షం రైల్వేస్టేషన్ : ఈసారి కేంద్ర రైల్వే బడ్జెట్లో అరుునా విజయవాడ డబుల్ డెక్కర్ రైలు ప్రతిపాదన పట్టాలెక్కనుందా.. ప్రాజెక్టుల కేటారుుంపులో నవ్యాంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తారా? అంటే.. తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దీనిపై ప్రజాప్రతినిధులతో పాటు రైల్వే అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవతో రాష్ట్ర ఎంపీలు సమావేశమై అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలపై జీఎం కొంతవరకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు పలు ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పలువురు ఎంపీలు ఇండియన్ రైల్వే టైమ్‌టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ)కి కొన్ని ప్రతిపాదనలు అందజేశారు. దీనిపై ఆ కమిటీ స్పందించి దక్షిణ మధ్య రైల్వేజోన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్లలో రాష్ట్రానికి కావాల్సిన ప్రతిపాదనలు తయూరుచేసింది. డబుల్ డెక్కర్పైనే అన్ని ఆశలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వయా నడికుడి, గుంటూరు మీదుగా వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలును విజయవాడ మీదుగా నడపాలనేది ప్రయూణికుల కోరిక. దీనిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి విజయవాడ మీదుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అలాగే, పలాస నుంచి విజయనగరం, విశాఖపట్నం మీదుగా విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు నడపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై పరిశీలనలు జరుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ విష్ణోయ్ విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు లేఖ కూడా రాశారు. దీంతో రెండు జోన్ల జీఎంల చొరవతో విజయవాడ మీదుగా రెండు డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తాయని నగర ప్రజలు ఆశిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అన్యాయమే.. రెండు దశాబ్దాలుగా రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్లోనూ వందలకొద్దీ ప్రతిపాదనలు వెళ్తున్నా.. ఫలితం మాత్రం దక్కట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పార్లమెంట్లో రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇస్తారని అంతా భావిస్తున్నారు. అలాగే, పార్లమెంట్లో మన ప్రజాప్రతినిధులు గళం విప్పాల్సిన అవసరం కూడా ఉంది.