అందరూ అద్భుతంగా పని చేశారు: సీఎం జగన్‌

District Collectors And SPs Are My Strength Says CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి : ‘‘ నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం. ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్‌ –19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ( స్టీల్‌ప్లాంట్‌ స్థలాన్ని సిద్ధం చేయండి )


ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలి
‘‘ ఎకానమీ పూర్తిగా ఓపెన్‌కావాలి. కలెక్టర్లు, ఎస్పీలు అందులో  భాగస్వామ్యం కావాలి. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉంది. చిన్న చిన్న దుకాణాల దగ్గరినుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలి.  రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజా రవాణా ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ.. అన్నీ ఓపెన్‌ కావాలి. మనం కోవిడ్‌–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కోవిడ్‌ –19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో?. అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలి. ( మీ బిడ్డే ముఖ్యమంత్రి.. అన్యాయం జరగనివ్వను )


ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
‘‘ ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలి. వారు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలి. దీన్ని మనం ప్రోత్సహించాలి. పరీక్షలకోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలన్నది ఎడ్యుకేట్‌చేయాలి?. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నాం. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి. అనుమానం ఉన్నవారు అక్కడకువెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలి. ప్రజలకు అందుబాటులో టెస్టింగ్‌ సదుపాయాలను తీసుకు వెళ్లాలి.  ప్రజల్లో పూర్తిగా భయాందోళనలను తొలగించాలి. కంటైన్‌ మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలి’’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-07-2020
Jul 07, 2020, 13:55 IST
సాక్షి, విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మంగ‌ళ‌వారం కోవిడ్ బాధితులు ఉన్న ఆసుప‌త్రుల‌తో విజ‌య‌వాడ‌లో వీడియో కాన్ఫ‌రెన్స్...
07-07-2020
Jul 07, 2020, 12:15 IST
ఒక వ్యక్తి ద్వారా 104 మందికి క‌రోనా సోక‌డం సంచ‌ల‌నంగా మారింది.
07-07-2020
Jul 07, 2020, 11:56 IST
బనశంకరి: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలతో కూడిన జబ్బు సుమారు వంద సంవత్సరాల కిందటే బెంగళూరు నగరాన్ని...
07-07-2020
Jul 07, 2020, 10:19 IST
కరోనా విజృంభణ మన దేశంలో ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు.
07-07-2020
Jul 07, 2020, 08:46 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్‌ డ్యూటీల గడువును పొడిగించారు.  కరో...
07-07-2020
Jul 07, 2020, 08:41 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కోరల్లో చిక్కి బతుకుజీవుడా అంటూ స్వదేశానికి తిరుగుముఖం పట్టి న ప్రవాసీలను హోం క్వారంటైన్‌ ఆర్థికంగా...
07-07-2020
Jul 07, 2020, 08:11 IST
కోవిడ్ కేసుల‌కు నగరాలు నిల‌యంగా మారాయి.
07-07-2020
Jul 07, 2020, 07:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే కొన్ని వర్గాలకు మాత్రమేనని, ఆ...
07-07-2020
Jul 07, 2020, 07:47 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతించిన ప్రైవేటు లేబొరేటరీ లు, వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని...
07-07-2020
Jul 07, 2020, 07:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతున్న క్రమంలో శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు కరోనా వైరస్‌కు సహకరిస్తున్నాయని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌...
07-07-2020
Jul 07, 2020, 07:06 IST
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కరోనా విభేదాలు సృష్టించింది. కోవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్యం తీరుతెన్నులపై చర్చించేందుకు...
07-07-2020
Jul 07, 2020, 05:35 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడం వంటి...
07-07-2020
Jul 07, 2020, 03:56 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ...
07-07-2020
Jul 07, 2020, 03:40 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విసిరిన పంజాకు గ్రేటర్‌లో కార్యకలా పాలు సాగిస్తున్న పలు ఐటీ, బీపీఓ కంపెనీలు లక్షలాది మంది...
07-07-2020
Jul 07, 2020, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పాలన వ్యవహారాల్లో భౌతికంగా మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు రాష్ట్ర...
07-07-2020
Jul 07, 2020, 02:47 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో రష్యాను దాటేసి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది....
07-07-2020
Jul 07, 2020, 02:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ 1,800 వరకు కేసులు రికార్డు అవుతున్నాయి. ఈ...
07-07-2020
Jul 07, 2020, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడగా.. మొత్తం...
07-07-2020
Jul 07, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: పీజీ, డిగ్రీలు చేసి చిన్నాచితకా ఉద్యో గాలతో నెట్టుకొస్తున్న లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాల యువతను...
06-07-2020
Jul 06, 2020, 19:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top