patient
-
Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అయితే జనవరి 29న మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.బాధితులు చికిత్స పొందుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రి(Swaroop Rani Nehru Hospital)కి చేరుకున్న ఆదిత్యనాథ్ బాధితులను పరామర్శించడంతో పాటు, వారి ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తుందని, వారికి అవసరమైన ఇతర ఏర్పాట్లలో ఎటువంటి లోటు ఉండదని సీఎం యోగి హామీనిచ్చారు. ఒక బాధితురాలితో సీఎం మాట్లాడుతూ దేనికీ ఆందోళన చెందవద్దని, వైద్యులు అంతా చూసుకుంటారని తెలిపారు. మరో బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్(Discharge) అవుతుండటాన్ని గమనించిన యోగి ఇలాంటివారిని వారిని ఇళ్లకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది సీఎంతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న ఏ బాధితుని పరిస్థితి విషమంగా లేదని, కొందరు బాధితులు కోలుకునేందుకు నాలుగువారాల సమయం పడుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు.. చౌకలో ప్రయాణం -
14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్‌కు రూ. 10 లక్షల జరిమానా
మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం అని అంటారు. దీనికి వైద్యులేమీ మినహాయింపు కాదనిపించే పలు ఘటనలను మనం చూసే ఉంటాం. తాజాగా అటువంటి ఉదాహరణ మన ముందు నిలిచింది. ఒక వైద్యుడు తాను 14 ఏళ్లుగా వైద్యం అందించిన బాధితునికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ బాధితునికి 14 ఏళ్లుగా వైద్యం అందించడం ఆ వైద్యునికి తలకుమించిన భారంలా మారింది. సదరు వైద్యుడు అందించిన ఔషధాలు ఆ బాధితునికి వికటించాయి. ఫలితంగా అతను ఇకముందు తండ్రి కాలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ ఉదంతం కోర్టు వరకూ చేరింది. వాదనల అనంతరం కోర్టు ఆ వైద్యునికి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితునికి 30 రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.యూపీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ప్రిసైడింగ్ అధికారి తన తీర్పులో డాక్టర్ అరవింద్ గుప్తాకు ఈ జరిమానాను విధించారు. జరిమానా మొత్తంతో పాటు కేసు ఖర్చుల నిమిత్తం బాధితునికి రూ.25 వేలు చెల్లించాలని కూడా ఆదేశించారు. 30 రోజుల్లోగా బాధితునికి తొమ్మిది శాతం వడ్డీతో సహా మొత్తం సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. జౌన్‌పూర్‌కు చెందిన ఓ బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఈ ఉదంతంపై పిటిషన్ దాఖలు చేశాడు. తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలను కనేందుకు 14 ఏళ్లుగా ప్రముఖ వైద్యుని దగ్గర చికిత్స చేయించుకున్నట్లు యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు.ఆయనకు ఫీనిక్స్ హాస్పిటల్లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స అందించారు. డాక్టర్ అరవింద్ గుప్తా ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన చికిత్స సమయంలో, బాధితుడికి పలుమార్లు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా బాధితునికి ఉపశమనం లభించకపోవడంతో ఆయన మరో వైద్యుడిని సంప్రదించారు ఆ రెండో వైద్యుడు నిర్వహించిన పరీక్షలో డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స కారణంగా బాధితునికి మరో అనారోగ్యం వాటిల్లిందని తేలింది. డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్సలో దుష్ప్రభావాల కారణంగా బాధితునికి ఇక తండ్రి అయ్యే అవకాశాలు లేకుండా పోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
బెంగాల్లో పేషెంట్‌పై డాక్టర్ అఘాయిత్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్‌లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్‌కతా పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్‌పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్‌హాట్ ప్రాంతంలోని డాక్టర్ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్‌ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు బరున్‌హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. -
మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) అనేది తీవ్రమైన కేన్సర్ దశ. ప్రారంభ దశలో గుర్తిస్తే..చికిత్స చేయడం సులభం. పైగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు కూడా. అదే స్టేజ్4 దశలో నయం కావడం కష్టం. జీవితాంత ఆ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంటే ఈ దశలో బతుకున్నంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఈ దశలో కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇక్కడ రోగికి కావాల్సింది మానసిక బలం. ఏ వ్యాధినైనా ఎదుర్కోవాలంటే మానసిక స్థైర్యం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్. అందులోనూ కేన్సర్‌కి స్టేజ్ 4 దశకు ఇది మరింత అవసరం అని అన్నారు. అలాంటి పేషెంట్లు మానసిక ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ ఆటను కట్టించి..మీ ఆయువుని పెంచుకోగలుగుతారని చెప్పారు. అవేంటంటే..45 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలైన నీతా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ప్రారంచికిత్సలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవి ఆమె ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్నితీవ్రంగా ప్రభావితం చేశాయి. తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన ఎక్కువై కుంగిపోతుండేది. అప్పుడే ఆమె కేన్సర సపోర్ట్ గ్రూప్‌లో చేరి మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లతో ఆ వ్యాధితో బతకటం నేర్చుకుంది. ధైర్యంగా జీవించడం అంటే ఏంటో తెలుసుకోగలిగిందని తన పేషంట్ల అనుభవాలను గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ పాటిల్ అలాంటి రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా ఆవ్యాధిని నిర్వహించగలరో చెప్పారు . అందుకోసం ఏం చేయాలో కూడా సవివరంగా తెలిపారు. అందుకోసం ఏం చేయాలంటే..ఎలాంటి చికిత్స అయితే మంచిదో వైద్యునితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న చికిత్సకు అనుగుణంగా ఎదరుయ్యే పరిణామక్రమాలను తట్టుకునేందుకు మానసికంగా సిద్ధం కావాలి. ఈ స్థితిలో మానసికంగా ఎదురవ్వుతున్న కల్లోలాన్ని తట్టుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ల తీసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి చేయాలి. అలాగే మీలాంటి స్థితిలో ఉన్నవాళ్లతో మీ బాధను పంచుకోవడం వంటివి చేయాలి. ఇది ఎంతో స్టైర్యాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదు, మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. మానసిక ధైర్యం కూడగట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసుకునేలా యోగ, మెడిటేషన్ వంటి వాటిలో నిమగ్నం కావాలి. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఈ వ్యాధితో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించడంలో సహయపడుతుంది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి ఇవి మనసును ఉత్సాహపరుస్తాయి. అలాగే చికిత్సకు సంబంధించి ప్రతీది తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీ చికిత్సకు సంబంధించిన దాని గురించి వైద్యులతో మాట్లాడి, భరోసా తీసుకోండి తప్ప ఆందోళన చెందేలా ప్రశ్నలతో వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్.(చదవండి: ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!) -
డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు
కామారెడ్డి టౌన్: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. -
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్
భావ్‌నగర్: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్‌పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
రోగికి కావల్సిన అసలైన మందు అదే..!
ఇంట్లో ఒక్కరు అనారోగ్యం బారిన పడినవారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతుంటారు. జబ్బున పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా.. సమస్యను నివారించే ఉపాయాలు.. సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు.. ఎదుర్కొనే విధానాలు... వీటన్నింటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండచ్చు. ఈ ఏడాది పేషెంట్ సేఫ్టీ డే థీమ్ ‘రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేయడం.’ ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ‘రోగనిర్ధారణ అవకాశాలు మెరుగుపరచడం, పరిష్కరించడం’లో ఆగ్నేయాసియా వెనకంజలో ఉందని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ సైమా వాజెద్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021–2030 అమలును అంచనా వేయడానికి గ్లోబల్ మెంబర్ స్టేట్ సర్వేలో కేవలం 47 శాతం దేశాలు మాత్రమే రోగనిర్ధారణ బాధ్యతలను తీసుకుంటున్నాయని తెలిసింది.నిర్ధారణ ముఖ్యం..ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో నిర్వహించిన సమావేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచ పేషెంట్స్సేఫ్టీ డేని ప్రారంభించింది. రోగి భద్రత ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే గుర్తు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోగి భద్రత ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడమే ఈ సేఫ్టీ డే లక్ష్యం. ఇందులో రోగులతోపాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎన్జీవోల నుంచి నిపుణులు, రోగులు లేదా వారి కుటుంబీకులు, ప్రతినిధులను ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో ‘రోగనిర్ధారణ ప్రాముఖ్యత’ను చర్చించాలని సూచించింది.అత్యవసర సేవలుఅత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచు వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50 శాతానికి పైగా మరణాలు, 40 శాతానికి పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమష్టి బాధ్యత అని తెలియజేసింది. ‘‘మేం ఇప్పుడు 600 మంది మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్‌కు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాం. కొంతమంది హాస్పిస్‌లో ఉండి సేవలు పొందుతున్నారు. రోగులకు ఇచ్చే సేవ, సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగానూ ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళనను తగ్గించుకోవడంతో బాటు రోగికి కావాల్సిన ప్రశాంత వాతావరణం, వాడాల్సిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. చెప్పిన సూచనలను పాటిస్తూ ఉండటం వల్ల ఆ పేషెంట్స్ కూడా భద్రతను పీలవుతారు. అది వారి ఆయుష్షునూ పెంచుతుంది.అవగాహనతో ..వీటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబసభ్యులకు చెబుతున్నాం. కౌన్సెలింగ్స్ ఇస్తున్నాం. రొమ్ము కేన్సర్‌తో ఇటీవల ఒకామె చనిపోయింది. ఆమె కూతురుకు 22 ఏళ్లు. పెళ్లయ్యింది. కానీ, ఆమె భర్త ఈ అమ్మాయికి కూడా తల్లికి మాదిరే కేన్సర్ వస్తుందేమో అనే అనుమానంతో ఆమెను వదిలేశాడు. దీంతో ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశాం. కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పాం. ఇప్పుడా అమ్మాయి ఆరోగ్యంగా, భరోసాతో కూడిన జీవనం గడుపుతోంది.మొదటి దశలోనే గుర్తిస్తే..వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది ఆ పేషెంట్‌నే కాదు వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలూ ఉన్నాయి. ముందస్తుగా చేయించుకోవాల్సిన వాక్సినేషన్లు, వాడాల్సిన మందులు, జాగ్రత్తల గురించీ వివరిస్తున్నాం. దీర్ఘకాలిక జబ్బులు, పేషెంట్స్‌ను చూసుకోవాల్సి విధానం గురించి తెలుసుకోవాలనుకునే వారికి తగిన అవగాహన కల్పించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని వివరించారు శారద లింగరాజు.మరణం అంచుల్లో ఉన్న రోగులకు తమ స్పర్శ ద్వారా భరోసాను కల్పిస్తోంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ కేంద్రం. ప్రధానంగా కేన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తున్నారు ఇక్కడి నిపుణులు, స్వచ్ఛంద సేవకులు. వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే సందర్భంగా వీరిని సంప్రదించినప్పుడు శారదా లింగరాజు చెప్పిన వివరాలు ఎంతో మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగిస్తాయి. (చదవండి: గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!) -
రూ. 5 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం.. పదేళ్లలో రాని ఒక్క రోగి.. కారణమిదే!
ఎక్కడైనా ఆసుపత్రులను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. నిధుల సేకరణ, బిల్డింగ్‌ను కట్టడం, వైద్య పరికరాలు అమర్చడం, వైద్యులను నియమించడం, వసతులు కల్పించడం ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. కానీ అదే ఆసుపత్రిని కట్టడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనేక జబ్బులను నయం చేయవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ గత పదేళ్లుగా అక్కడ ఒక్క రోగి కూడా వైద్యం అందలేదు. ఇందుకు ఇంకా ఆ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయకపోవడమే కారణం. అవును నిజమే..చాంద్ పురా ప్రాంతంలో ఆరు ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రిని 2015లో రూ.5 కోట్లతో నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. కానీ ప్రారంభోత్సవం చేయకుండానే వదిలేయడంతో పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు, మందుబాబులుగా అడ్డాగా మారింది. అక్కడ ఒక్క రోగికి కూడా వైద్యం అందకపోవడంతో వైద్య పరికరాలు పాడైపోయాయి. ఆసుపత్రిని నిర్మించి పదేళ్లు కావస్తున్నా దీనినివైద్యారోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకోలేదని, ఈ సౌకర్యాల గురించి అసలు తమకు తెలియదని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఈలోపు దొంగలు ఆసుపత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్బోర్డ్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆసుపత్రి ఓ అస్థిపంజరంలా మిగిలిపోయింది. ఆసుపత్రి క్యాంపస్‌లో మూడు భవనాలు ఉండగా.. ఆరోగ్య కార్యకర్తల నివాసం, పరీక్షా కేంద్రం, ప్రధాన భవనాలుగా నిర్మించారు.#Bihar Hospital Abandoned for 10yrs Becomes Haven for Thieves Government hospital in #Muzaffarpur Bihar built in 2015 at cost of ₹5 Crs, has never been inaugurated or opened for patients. The 30-bed hospital, equipped with modern facilities, has been left to deteriorate, with… pic.twitter.com/In9CAFQZW3— Nabila Jamal (@nabilajamal_) September 6, 2024ఆసుపత్రి నానాటికీ క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నగరవాసులు నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష జనాభా నివాసం ఉంటుంది. ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు, దాని గొప్పతనాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇకపై నగరానికి 50 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు నగరానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ షెరియాను ఆరా తీయగా.. ఆసుపత్రి గురించి తనకు తెలియదని, పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సివిల్ సర్జన్, సర్కిల్ అధికారి వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. -
మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. కేర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. -
నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు సంబంధించి వెలువడిన తాజా నివేదిక మరింత దడ పుట్టిస్తోంది. 2023లో ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్ఐవి వైరస్‌ను ప్రపంచంలోని సుమారు నాలుగు కోట్ల మందిలో గుర్తించారు. వీరిలో 90 లక్షల మంది వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్స పొందలేకపోయారు. ఫలితంగా ప్రతి నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతిచెందాడని వెల్లడయ్యింది.ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే దిశగా పురోగతి సాధిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరంగా పరిణమించింది. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలలో ఎయిడ్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాది ఎయిడ్స్ కారణంగా ఆరు లక్షల మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు2023లో దాదాపు 6,30,000 మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మృతిచెందారు. యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా మాట్లాడుతూ 2030 నాటికి ఎయిడ్స్‌ను అంతం చేస్తామని ప్రపంచ నాయకులు ప్రతిజ్ఞ చేశారని, అయితే 2023లో కొత్తగా13 లక్షలకు పైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని అన్నారు. -
నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. ఇంజక్షన్ వికటించి..
అనకాపల్లి, సాక్షి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. వివిధ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు మంగళవారం రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.ఆ ఇంజక్షన్లు తీసుకున్న 17 మంది కొద్ది సేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం. -
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్‌ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్‌బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్‌తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్‌కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్‌ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్‌ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్‌లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్‌తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్‌ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్‌లా చుట్టి స్టెతస్కోప్‌లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్‌లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్‌ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్‌తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్‌గా స్టెతస్కోప్‌తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్‌తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు. ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!) -
కేరళలో పెరుగుతున్న గవదబిళ్లల కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
కేరళలో గవద బిళ్లల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 190 కేసులు నమోదయ్యాయి. దీంతో నేషనల్సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. గత నెలలో దాదాపు 2,500 కేసులు దాక నమోదయ్యినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాల రాష్ట్రాల పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గవద బిళ్లలు ఎందుకొస్తాయి? నివారణ ఏంటీ? తెలుసుకుందామా!. ఈ గవద బిళ్లలు ముఖ్యంగా పిల్లలు, యువకులను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రుబులవైరస్ కుటుంబానికి చెందిన పారామిక్సోవైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్‌కి మానవులు మాత్రమే అతిధేయులు. ఇది బాధితుడి నోటి నుంచి వచ్చే నీటి తుంపరల ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడు నోటి తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా చెవులు చుట్టూ ఉన్న రెండు ప్రాంతాల్లో బాధకరమైన వాపుతో కూడిన జ్వరం వస్తుంది. లక్షణాలు.. గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి. ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపుకు గురవుతాయి దీనివల్ల ఏమీ తినలేరు తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇలా ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ గవదబిళ్లలు తేలికపాటివి, దానంతట అవే వెళ్లిపోతాయి. ఒక్కోసారి యువకులలో ఎన్సెఫాలిటిస్, చెవుడు లేదా ఆర్కిటిస్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నివారణ.. డీ హైడ్రేట్ అవ్వకుండా ద్రవాల రూపంలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఆహారం మెత్తగా తీసుకోవాలి. తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం. వాపును తగ్గించడానికి స్క్రోటల్ సపోర్ట్, ఐస్ ప్యాక్‌లను ఉపయోగించాలి అలాగే వృషణాల వాపుతో కూడిన సందర్భాల్లో వాపును తగ్గించడానికి పరోటిడ్ గ్రంధులపై కోల్డ్ కంప్రెస్లను ఉపయోగించడం వంటివి చేయాలి. నొప్పి, వాపును తగ్గేందుకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే స్టెరాయిడ్స్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గవదబిళ్ళకు చికిత్స.. ప్రస్తుతం, గవదబిళ్ళకు నిర్దిష్ట చికిత్స లేదు. చాలా చికిత్సా ఎంపికలు ద్రవాలు ఎక్కువగా తాగడం, కోల్డ్ కంప్రెస్ చేయడం, సులభంగా జీర్ణమయ్యే మెత్తని ఆహారాలు తీసుకోవడం. ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక దీని బారిన గర్భిణీ స్త్రీలు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. (చదవండి: ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు..ఆ ఇద్దరు మహిళలు!) -
కొద్ది స్పేస్‌లోనే హ్యాపీగా చేసుకునే 'హోమ్ జిమ్ మెషిన్'!
‘తిండి కలిగితే కండగలదోయ్’ వాక్యానికే పరిమితం కాలేదు ఈ నలుగురు మిత్రులు. ‘కండకు జిమ్ కూడా కావాలోయి’ అంటున్నారు. ‘రోజూ జిమ్‌కు వెళ్లడానికి తిరిగి అక్కడి నుంచి రావడానికి బోలెడు సమయం తీసుకుంటుంది. అలా అని ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకుందామా అంటే స్పేస్ ప్రాబ్లం’ అనుకునేవాళ్లకు ‘అరోలీప్ ఎక్స్’ రూపంలో పరిష్కారం చూపారు దిల్లీ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అమన్రాయ్, అనురాగ్ డానీ, రోహిత్ పటేల్, అమల్జార్జ్. చిన్న స్థలాలలోనే ఏర్పాటు చేసుకునే స్మార్ట్ హోమ్ జిమ్‌ను తయారుచేసి, ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందారు. ‘అరోలీప్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టి విజయం సాధించారు. అంతర్జాతీయ విపణిలోకి అడుగు పెట్టనున్నారు... కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(ఐఐటీ, దిల్లీ) అయిన అమన్ రాయ్ అల్ట్రా మారథాన్లు నిర్వహించడంలో దిట్ట. అయితే కెరీర్ ప్రారంభించిన తరువాత ఉద్యోగ బాధ్యతలు, జిమ్‌కు వెళ్లడం మధ్య సమన్వయం కుదరడానికి కష్టపడాల్సి వచ్చేది. బెంగుళూరులోని అద్దె ఇంట్లో స్థల సమస్య వల్ల ఎక్సర్సైజ్కు సంబంధించి లిమిటెడ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉండేది. ఇక అనురాగ్ డానీకి ఆఫీసు పనిభారం వల్ల జిమ్‌కు వెళ్లడం అనేది కుదిరేది కాదు. రోబోటిక్ గ్రాడ్యుయెట్స్ అయిన రోహిత్ పటేల్, అమల్ జార్జ్ల పరిస్థితి కూడా అంతే. రకరకాల సమస్యలకు పరిష్కారాలు వెదకడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన అమన్, అనురాగ్, రోహిత్, అమల్లు జిమ్‌కు వెళ్లడానికి తాము ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. హోమ్ జిమ్ ఎక్విప్మెంట్లు పెద్దవిగా ఉంటాయి. ఖరీదైనవి. తగినంత స్థలం కావాలి. ‘ఇంట్లో వ్యాయామాలు చేయడానికి వేర్వేరు బరువులు ఉన్న ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అద్దె ఇండ్లలో, చిన్న అపార్ట్మెంట్లలో ఇది కష్టం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాం’ అంటారు నలుగురు మిత్రులు. కొత్తగా డిజిటల్–వెయిట్స్ టెక్నాలజీ ఊపందుకుంటున్న టైమ్ అది. ఫిజికల్ వెయిట్స్‌ను రిప్లేస్ చేసే డిజిటల్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. రకరకాల ప్రోటోటైప్‌లు బిల్డ్ చేయడం కోసం పాతిక లక్షల వరకు వెచ్చించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ నలుగురు మిత్రులు లిమిటెడ్ స్పేస్‌లో ఉపయోగించుకోగలిగే రూపొందించారు. పదిహేను ప్రోటోటైప్‌ల తరువాత వారి కృషి ఫలించింది, ఈ స్మార్ట్, వాల్–మౌంటెడ్ జిమ్ ఎక్విప్మెంట్ ‘అరోలీప్ ఎక్స్’లో వందగంటల ఫిట్నెస్ కంటెంట్ ఉంటుంది. మూమెంట్స్‌ను ట్రాక్ చేస్తుంది. సంబంధిత డాటాను మ్యాపింగ్ చేస్తుంది. డాటా–డ్రైవెన్ వర్కవుట్స్ కోసం ఈ స్మార్ట్ ఎక్సర్సైజ్ మెషిన్ మోటర్–పవర్డ్ ఎలక్ట్రోమాగ్నటిక్ రెసిస్టెన్స్‌ను ఉపయోగిస్తుంది. జిమ్‌లో చేసే ప్రతి వర్కవుట్కు ఈ మెషిన్‌ను ఉపయోగించవచ్చు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ డిజైన్ చేసిన గోల్–బేస్డ్ వర్కవుట్ ప్రోగ్రామ్స్‌ను ఈ మెషిన్ అందిస్తుంది. ‘అరోలీప్ ఫిట్నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్‌ను ఆహ్వానించి ట్రయల్స్ మొదలుపెట్టారు. తమ ప్రాడక్ట్ తాలూకు వీడియోలను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వ్యాయామ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని మంత్లీ సబ్స్క్రిప్షన్లు మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత ఫస్ట్ కస్టమర్స్ తమ ఫీడ్‌బ్యాక్‌ను కంపెనీ ఫౌండర్లకు ఇచ్చారు. తమ ప్రాడక్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి, మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఫీడ్‌బ్యాక్ వారికి ఉపయోగపడింది.ప్రాడక్ట్‌కు పాజిటివ్ టాక్ రావడం మాట ఎలా ఉన్నా ఇన్వెస్టర్లు దొరకడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ ‘జెరోదా’ సీయివో నిఖిల్ కామత్‌కు మెసేజ్ పెట్టాడు. వీరు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి ప్రోటోటైప్లను పరిశీలించి ఇంప్రెస్ అయ్యాడు నిఖిల్ కామత్. ఫస్ట్ ఏంజెల్ ఇన్వెస్టర్ అయ్యాడు. ఆ తరువాత మరో ముగ్గురు ఇన్వెస్టర్లు వచ్చారు. మాన్యుఫాక్చరింగ్ కోసం బెంగుళూలో చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని ‘అరోలీప్ ఎక్స్’లను అమ్మడం మొదలుపెట్టారు. దేశీయంగా విజయం సాధించిన ‘అరోలీప్ ఎక్స్’ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. ‘ఫిట్నెస్ సింపుల్ అండ్ యాక్సెసబుల్ అనేది మా నినాదం. లక్ష్యం’ అంటున్నారు నలుగురు మిత్రులు. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
‘పోకిరి’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసేశారు..
గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు. -
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 760 కరోనా కేసులు!
కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారతదేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారితమయ్యింది. జేఎన్-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కు చేరింది. కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) తెలిపింది. -
సర్జరీ చేస్తున్న టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్
ఓ వైద్యుడు విచక్షణ మరిచి సర్జరీ చేసే సమయంలో పేషెంట్‌పై దాడికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. అతను అలా దాడి చేయడంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని సదరు ఆస్పత్రి బాధితుడికి నష్ట పరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..2019లో జరిగిన ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లు చైనా పేర్కొంది. దీనిపై ఇప్పుడు చైనా అధికారులు కూలంకషంగా ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు చైనా అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఆక్టోజెనేరియన్ అనే 82 ఏళ్ల మహిళ కంటి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తుండగా, ఆమె అసహనంతో కదలిపోవడం ప్రారంభించింది. ఐతే రోగికి స్థానికి మాండలిక భాష మాత్రేమ తెలుసు. పాపం వైద్యుడికి ఆ భాషలో అంత ప్రావిణ్యం లేదు. అందువల్లో ఇరువరి మధ్య కమ్యూనికేషన్ కాస్త ఇబ్బందిగా మారింది. ఓ పక్క సర్జరీ టైంలో పేషెంట్ కనుబొమ్మలు కదిలించడం వంటివి చేశాడు. వైద్యుడు చెబుతున్నవేమి రోగికి అర్థంగాక అదేపనిగా కదలడంతో అసహనం చెందిన వైద్యుడు కొట్టడం జరిగింది. దీంతో ఆమె ఎడమ కన్ను పైభాగంలో గాయలయ్యాయి. అందుకు సదరు ఆస్పత్రి దాదాపు 500 యువాన్లు(రూ. 60, వేలకు పైనే) వరకు నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సదరు వైద్యుడిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా ఆ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుండటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో చైనా అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితురాలి కొడుకు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ..ఆ డాక్టర్ దూకుడు ప్రవర్తన కారణంగా ఎడమ కన్ను పైభాగంలో కూడా గాయలయ్యాయిని, ఐతే ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు ఆస్పత్రి సీఈవో, ఆ వైద్యుడిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించారు. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో అలాంటి అనుచిత ప్రవర్తన తగదని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చైనా అధికారులు వెల్లడించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
దేశంలో కొత్తగా 88 కరోనా కేసులు.. 400 మందికి చికిత్స!
గతంలో కరోనా వైరస్ విజృంభణతో దేశం అతలాకుతలమైపోయింది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. వ్యాక్సినేషన్ తర్వాత కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మహమ్మారి ఇంకా మన మధ్య నుంచి పోలేదు. భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 396 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,300. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,68,407కు పెరిగింది. దేశంలో కరోనా నుండి కోలుకున్నవారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందించారు. కాగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో కరోనా పాజిటివ్‌తో ఒక మహిళ మృతి చెందింది. ఇది కూడా చదవండి: భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది? -
పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..
రోగుల ప్రాణాలు కాపాడే వైద్యుడైన మృత్యువుకి బలవ్వాల్సిందే. ఒక్కొసారి మృత్యువు ఎలా వస్తుందో తెలియదు. చూస్తుండగానే కబళించేసి తన పని చేసుకుని వెళ్లిపోతుంది. తేరుకునేలోపే కథ అయిపోతుంది అదే కథ జీవితం!. అసలేం జరిగిందంటే..ఓవైద్యుడు పేషెంట్‌కి చికిత్స చేస్తూ కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది. 38 ఏళ్ల దిలీప్ కుమార్ కుష్వాహా తన క్లినిక్ రోగికి చికిత్స అందిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ వైద్యడు రోగిని తనిఖీ చేస్తుండగా ఛాతి నొప్పితో విలవిలలాడుతు కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ వైద్యుడు షాహదోల్ జిల్లాలో కేస్వాహి గ్రామంలో తన క్లినిక్ నడుపుతూనే సామాజిక సేవలో చొరవ చూపేవాడని పలువురు చెబుతున్నారు. రోగులకు ఉచిత వైద్య అందించడమేగాక ఉచితంగా మందులు కూడా ఇచ్చేవాడని సన్నిహితులు తెలిపారు. పేషెంట్ల ట్రాన్స్పోర్ట్ చార్జీలు సైతం అతనే చెల్లించేవాడని అంటున్నారు. ఈ రోజుల్లో ఇలా ప్రజలకు ఇలాంటి మెరుగైన సేవలందించే వ్యక్తే మృత్యువు కబళించడం అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. (చదవండి: వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్! మొత్తం కంటినే మార్పిడి..) -
ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది?
ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్).. దేశంలోని ఇతర ప్రాంతాలకు మించిన మౌలిక సదుపాయాలు కలిగినదిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోని గురుగ్రామ్ జిల్లాలోని బంధ్‌వాడి గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది గురుగ్రామ్-ఫరీదాబాద్ హైవేపై, ఆరావళి పర్వతాల దిగువన ఉంది. ఇక్కడకు రాగానే దూరం నుంచే ఒక చెత్త కొండ కనిపిస్తుంది. దీని పరిష్కారానికి కసరత్తు జరుగుతున్నప్పటికీ, మరోవైపు దీనికారణంగా స్థానికుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు నాలుగున్నర వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతి మూడో ఇంటిలో ఒక కేన్సర్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న సత్పాల్ మాట్లాడుతూ ‘చెత్త కొండపై నుంచి ప్రవహించే ‘లీచెట్’ కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటున్నాను’ అని అన్నాడు. ‘లీచెట్’ అంటే తడి చెత్త నుండి వెలువడే ద్రవ విష పదార్థం. అది భూమిలో ఇంకిపోతే ఆ నీరు తాగడానికి లేదా స్నానానికి సైతం పనికిరానిదిగా మారుతుంది. ఇక్కడ సుమారు రెండున్నరేళ్ల క్రితం పల్లపు స్థలంలో నిర్మించిన సరిహద్దు గోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ స్థలంలో నిరంతరం చెత్త పేరుకుపోతూవచ్చింది. ఈ చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. గౌహతిలోని ఐఐటి బృందం తన సర్వేలో ఇక్కడ 22 లక్షల టన్నుల చెత్త ఉందని వెల్లడించింది. ఈ చెత్తనంతటినీ 2024, ఏప్రిల్ నాటికి తొలగించగలమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. బంధ్‌వాడి భూగర్భ జలాల పరీక్షలో నీటిలో సీసం ఉండవలసిన పరిమితి కంటే 120 రెట్లు, కాడ్మియం 10 రెట్లు అధికంగా ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి? -
డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?
దేశంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిపై 2004లో తన తండ్రి ఢిల్లీ వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారని, తదనంతరం ఎదురైన పరిణామాలు ఇలా ఉన్నాయంటూ స్టోరీపిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు తన్మయ్ గోస్వామి ట్విట్టర్ మాధ్యమంలో పలు వివరాల తెలిపారు. తన తండ్రి విషయంలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ వైద్యపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకుగాను రూ. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తన తండ్రి అభ్యర్థించారన్నారు. ఇది జరిగి11 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని, 2015లో తన తండ్రి చనిపోయారన్నారు. అయితే వృద్ధురాలైన తన తల్లి ఈ కేసును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నదని, సుదీర్ఘ పోరాటం అనంతరం 19 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విజయం సాధించామని తెలిపారు. తొందరపాటుతో శస్త్రచికిత్స అసోంకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 19 సంవత్సరాల పాటు ప్రముఖ వైద్యసంస్థతో న్యాయపరంగా పోరాడి ఎలా గెలిచిందనే వివరాలను తన్మయ్ గోస్వామి తెలియజేశారు. తన తండ్రి 2004లో ఈపీఎస్ డయాగ్నస్టిక్ స్టడీ కోసం బాత్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈపీఎస్ అధ్యయనం అసాధారణంగా ఉంటే, రోగితో చర్చించిన తర్వాత ఆర్ఎఫ్ఏ చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఏ ప్రమాదకరం లేదా ప్రాణాంతకం కావడంతో దానిని వైద్యులు సిఫార్సు చేయరు. అయినప్పటికీ బాత్రా ఆసుపత్రి కార్డియాలజిస్టులు తన తండ్రితో లేదా మా కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఆర్ఎఫ్ఏ చేశారన్నారు. ఇది కూడా చదవండి: భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత! పేస్ మేకర్ సరిగా అమర్చకపోవడంతో.. అయితే ఈ చికిత్స కారణంగా తన తండ్రి ఆరోగ్యం విషమించిందని గోస్వామి తెలిపారు. దీంతో వైద్యులు తన తండ్రిని కాపాడేందుకు అతని ఛాతీలో పేస్ మేకర్ అమర్చాలని నిర్ణయించారు. దీంతో వైద్యులు తన తల్లికి ఫోన్ చేసి, వెంటనే ఢిల్లీకి రావాలని తెలియజేశారు. వారు చెప్పిన విధంగానే తన తల్లి ఢిల్లీ వెళ్లిందన్నారు. అక్కడి చికిత్స ముగిసిన కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారని, అయితే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోలేదన్నారు. తన తండ్రి ఛాతీ ప్రాంతం రోజురోజుకు ఉబ్బిపోవడాన్ని గమనించి, గౌహతిలో కార్డియాలజిస్ట్‌ని సంప్రదించామన్నారు. అప్పుడు ఆయన తన తండ్రిని పరీక్షించి, పేస్ మేకర్ సరిగా అమర్చలేదనే విషయాన్ని తెలిపారన్నారు. దీంతో తండ్రి ఛాతీలోని పేస్ మేకర్‌ను సరిచేయడానికి అతనికి అత్యవసరంగా అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. వైద్యుల సలహా మేరకు తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. అనంతరం ఆయన బలహీనంగా మారి, పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. అయినా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించేవారన్నారు. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌పై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశారన్నారు. తమ కుటుంబ న్యాయవాది ఈ కేసును చేపట్టారన్నారు. ఇది వినియోగదారుల న్యాయస్థానానికి సంబంధించిన ఉదంతం కనుక సత్వర న్యాయం జరుగుతుందని తామంతా భావించామన్నారు. చనిపోయే వరకూ న్యాయపోరాటం 2004 నుండి 2015 వరకు.. అంటే తన తండ్రి చనిపోయే వరకు కేసులోని ప్రతి విచారణ వాయిదాకు హాజరయ్యారన్నారు. కోల్‌కతా నుండి మా న్యాయవాది ఢిల్లీకి వచ్చేవారని, అతని ప్రయాణ, బస ఖర్చులను తామే భరించామని గోస్వామి తెలిపారు. ఈ విధంగా 19 సంవత్సరాల పాటు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయన్నారు. ఈ కేసు కోసం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందన్నారు. కేసు విచారణ సమయంలో పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు. వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. తన తండ్రి చనిపోయే వరకూ అంటే 11 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారన్నారు. తన తండ్రి చనిపోయాక, బాత్రా హాస్పిటల్ కాస్త ఊపిరి పీల్చుకుందేమో.. కానీ మా తల్లి మాత్రం ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో తాను ఈ ఉదంతంలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడం మొదలుపెట్టానని గోస్వామి తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! కేసు జాప్యం వెనుక సవాలక్ష కారణాలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం వెనుక పలు కారణాలున్నాయని గోస్వామి తెలిపారు. ఇది మెడికల్ కేసు కావడంతో వాదనకు న్యాయమూర్తులు సరిపోలేదు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ పలుకుబడి కూడా కేసు జాప్యానికి కారణంగా మారింది. దీనికితోడు ఉద్దేశపూర్వక జాప్యాలు, కోర్టు నుండి సాక్ష్యాలను ఉపసంహరించుకోవడం లాంటివి ఎదురయ్యాయన్నారు. అయితే తమ న్యాయవాది వినతి మేరకు కేసు విచారణలో స్వతంత్ర వైద్య బోర్డు అవసరమని కోర్టు కోరింది. మెడికల్ బోర్డు విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. In 2004, my dad filed a case of medical negligence against one of India's most powerful hospitals viz. Batra Hospital, Delhi and Padmashree awardee cardiologist Dr Upendra Kaul. Case was filed in the state consumer court, Delhi & my dad asked for a compensation of Rs. 80 lakh.… — Tonmoy Goswami (@protonycle) August 3, 2023 ఆధారాలను చూపలేకపోయిన ఆసుపత్రి వర్గాలు అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు తన తండ్రి ఆర్ఎఫ్ఏ చికిత్స విషయంలో తమ సమ్మతి తీసుకున్నట్లు పేర్కొంటూ బెంచ్‌ను గందరగోళపరిచేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సాక్ష్యం అడిగినప్పుడు, వారు తరచూ ఈపీఎస్ సమ్మతి పత్రాన్ని సాకుగా చూపిస్తూ వచ్చారు. దీంతో కేసు ఆలస్యం అవుతూ వచ్చిందేగానీ, ముందుకు కదలలేదు. పైగా పీఎస్ సమ్మతి పత్రాన్ని తమకు ఇచ్చేశామని వారు కోర్టులో బుకాయించేవారని గోస్వామి తెలిపారు. ఎంతకాలం గడిచినా బాత్రా ఆసుపత్రి వర్గాలు ఆర్ఎఫ్ఏ పత్రాలను కోర్టుకు సమర్పించ లేకపోయాయి. ఎట్టకేలకు 2018లో తాము ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌లో కేసును గెలిచామన్నారు. కేసు దాఖలు చేసిన తేదీ నుండి 7% సాధారణ వడ్డీతో రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం బాత్రా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించింది. అయితే తన తండ్రి కోరిన విధంగా రూ. 80 లక్షల పరిహారంతో పోల్చితే ఇది ఏమీ కానప్పటికీ, తాము ఈ కేసులో గెలిచినందుకు ఎంతో సంతోషించామన్నారు. కథ మళ్లీ మొదటికి.. అయితే అప్పటితో కథ ఆగిపోలేదని బాత్రా ఆసుపత్రి వర్గాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్‌లో అప్పీలు చేశామని గోస్వామి తెలిపారు. దీంతో కేసు మొదటికి వచ్చింది. అయితే మరో 14 ఏళ్లు పట్టినా ఈ పోరాటం కొనసాగిస్తానని తల్లికి మాట ఇచ్చానని గోస్వామి తెలిపారు. అయితే మా న్యాయవాది నెగ్వివ్ అహ్మద్ ఈ కేసు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, విచారణలో ఎక్కువ వాయిదాలు పడకుండా కేసు త్వరగా ముందుకు కొనసాగేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 2023లో ఈ కేసులో తాము మరోమారు గెలిచామని గోస్వామి తెలిపారు. అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు వారి పరపతి నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తాము భావించామన్నారు. అయితే 19 ఏళ్లలో తాము రెండుసార్లు విజయం సాధించిన నేపధ్యంలో బాత్రా ఆసుత్రి వర్గాల సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయలేదని గోస్వామి తెలిపారు. భవిష్యత్ న్యాయ పోరాటాలకు స్ఫూర్తి ఎట్టకేలకు ఈ కేసు ముగిసినందుకు మా కుటుంబం సంతోషించింది. అయితే ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సాధ్యం కాదని తాను అర్థం చేసుకున్నానని గోస్వామి అన్నారు. తాము సాగించిన న్యాయపోరాటం భవిష్యత్తులో మరింతమంది రోగులకు న్యాయం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. బాధితులు ఎవరైనా ఇటువంటి న్యాయపోరాటం చేసేటప్పుడు వారు గోస్వామి కుటుంబాన్ని గుర్తుంచుకుంటారన్నారు. నష్టపరిహారం సొమ్ముతో మంచి పని మాకు కోర్టు నుంచి అందిన పరిహారం మొత్తాన్ని మా అమ్మ ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుందన్నారు. మొదట్లో తాను బాత్రా ఆసుపత్రిపై కోపంగా ఉండేవాడనిని, ఈ ఆసుపత్రిలో మీ సొంతపూచీ కత్తుతో చేరాలని ఆసుపత్రి ముందు బోర్డు పెట్టాలని అనుకునే వాడినని అన్నారు. అయితే అటువంటి సందర్భంలో తన తల్లి తనను శాంతపరిచేదని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
చికిత్స కోసం వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్.. ఆసుపత్రి బయట కూడా!
ఆ విషయం తెలియగానే ఆసుపత్రి యాజమాన్యంలో కలకలం చెలరేగింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేయడంతో, యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దర్యాప్తులో ఆమె ఆ బాధితుడు డయాలసిస్ కోసం వస్తుంటాడని చెప్పింది. ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా.. చికిత్స కోసం వచ్చిన బాధితునితో ఒక నర్సు రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆసుపత్రి బయట కూడా ఆ బాధితుడిని కలుస్తూ వచ్చింది. ఈ వ్యవహారం ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా గుట్టుగా సాగింది. అయితే ఒక రోజు ఆ బాధితుడు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కన్నుమూశాడు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా సాయంతో.. డెయిలీ స్టార్ రిపోర్టులోని కథనం ప్రకారం ఈ ఉదంతం ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. పెనెలోప్ విలియం అనే మహిళ 2019 నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్‌లో నర్సుగా పనిచేస్తోంది.ఈ నేపధ్యంలో ఆమెకు ఒక పేషెంట్‌తో సంబంధం ఏర్పడింది. వారు రహస్యంగా కాల్ చేసుకోవడం, కలుసుకోవడం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా సాయంతో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఆసుపత్రి బయట తరచూ కలుసుకునేవారు. అయితే ఒక రోజు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో ఆ పేషెంట్‌కు గుండెపోటు వచ్చింది. సహోద్యోగికి ఫోను చేసి.. వెంటనే పెనెలోప్ అంబులెన్స్‌కు కాల్ చేసింది. ఇంతలో వారుంటున్న కారులోనే ఆ బాధితుడు మృతి చెందాడు. అయితే పెనెలోప్ తన సహోద్యోగినికి ఫోను చేసి, సీపీఆర్ అందించేందుకు పిలిచింది. అయితే అప్పటికే సమయం మించిపోయింది. విషయం ఆసుపత్రివర్గాలకు తెలియగానే కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పెనెలోప్‌ను విధుల నుంచి తొలగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించగా, అతను ఆరోజు డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చాడని తెలిపింది. అయితే ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక మెసేజ్‌లో అతనికి చెస్ట్ పెయిన్ వచ్చినట్లు ఉంది. దీంతో పెనెలోప్ అబద్దం చెబుతున్నదని యాజమాన్యానికి స్పష్టమైంది. ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందంటూ.. ఆమె అతనికి ఫోను చేసి, ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందని దర్యాప్తులో తేలింది. అతను రాగానే వారిద్దరూ కారులో సరససల్లాపాల్లో తేలారు. సరిగ్గా అదే సమయంలో ఆ బాధితునికి గుండెపోటు వచ్చి, మృతి చెందాడు. ఆ నర్సు, బాధితునికి మధ్య గత రెండేళ్లుగా ఈ ఎఫైర్ ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ బాధితుని పేరు వెల్లడించలేదు. ఈ విషయమై ఆసుపత్రి దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ పెనెలోప్ విలియమ్స్ ఆ బాధితునితో తనకు ఎటువంటి సంబంధం లేదని, బాధితునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, మృతి చెందాడని తెలిపిందన్నారు. ఇది కూడా చదవండి: తండ్రి మృతుని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి.. -
ఆస్పత్రి వేళలో వస్తేనే వైద్యం చేస్తాం
కోస్గి: మున్సిపల్ పరిధిలోని తిమ్మాయపల్లికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి రావడంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంకాలం వస్తేనే వైద్యం చేస్తామని చెప్పి వైద్యానికి నిరాకరించిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. తిమ్మాయపల్లికి చెందిన ఎల్లప్ప రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలికి గాయాలయ్యాయి. కొంతకాలు భాగం తీసివేశారు. ఒకరోజు విడిచి ఒకరోజు గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నడవలేని స్థితిలో ఓ ఆటోలో కట్టు కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రికి వచ్చాడు. దీంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంత్రం 4 గంటలకు రావాలని సిబ్బంది చెప్పారు. వైద్యం చేయడానికి నిరాకరించారు. నడవలేని స్థితిలో ఉన్నాడని, కట్టుకడితే వెళ్తామని బాధితులు ప్రాధేయపడినా వినిపించుకోలేదు. ఆస్పత్రి వేళల్లో వస్తేనే వైద్యం చేస్తాం.. మీ ఇష్టం వచ్చినట్లు వస్తే చేయం. ఎవరికై నా చెప్పుకోండి అంటూ రోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక బాధితుడు ఎల్లప్ప ఇంటికి వెళ్లిపోయాడు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యుడు అనుదీప్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేడు. -
Stroke: ఈ చికిత్స అందిస్తే..ఈజీగా రికవరీ అవ్వచ్చు!
స్ట్రోక్ వస్తే సత్వరమే చికిత్స అందుబాటులో ఉన్నా అవన్నీ తాత్కలికమే. ఎందుకంటే ఒక్కోసారి భవిష్యత్తులో మళ్లీ రావచ్చు లేదా రాకపోవచ్చు. అంతేగాదు రోగికి అలాంటి సమయంలో త్వరితగతిన కోలుకోవడం కూడా ఒక్కొసారి సమయం పడుతుంటుంది. పైగా రోగి అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇక నుంచి అలా కాకుండా రోగులను త్వరితగతిన కోలుకునేలా చేయవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్వీడన్ యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్‌లో ఆ పరిశోధనలు గురించి వెల్లడించింది. పరిశోధకులు అందుకోసం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రయోగంలో భాగంగా ఎలుకలకు నాసిల్ చికిత్స విధానం ఉపయోగించి.. నాసిక గుండా సీ3ఏ పెప్టైడ్ ఆస్ట్రోసైట్ల డ్రాప్స్‌ను ఇచ్చారు. ఈ చుక్కలను తీసుకున్న ఎలుకలు స్ట్రోక్ తర్వాత చాలా చురుకుగా యథావిధిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వీడన్, జర్మనీలలో చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ అధ్యయనాలు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని న్యూరో ఇమ్యునాలజీ ప్రోఫెసర్ మార్సెలా పెక్నా మాట్లాడుతూ..ఈ చికిత్స క్లినిక్స్‌లో ఉపయోగించవచ్చన్నారు. స్ట్రోక్‌కి గురై ఆస్పత్రులకు వచ్చిన వారు కూడా అంగవైకల్యానికి గురి కాకుండా త్వరితగతిన కోలుకోగలుగుతారని పెక్నా చెప్పారు. అంతేగాదు ఈ నాసిల్ డ్రాప్ చికిత్స విధానం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని చెప్పారు. (చదవండి: విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్‌తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్‌కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్‌బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్‌లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..
యువ వైద్యురాలి మృతి యావత్తు కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. దీంతో వైద్యుల, ఆరోగ్య కార్యకర్తలకు కేరళ రాష్ట్రంలో ఎలాంటి భద్రత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో కేరళ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ ప్రతిపక్షాలు పినరయి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. అసలేం జరిగిందంటే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బుధవారం కేరళలో 24 ఏళ్ల వందనా దాస్ అనే యువ వైద్యురాలు పెషెంట్ దాడిలో మృతి చెందింది. నిజానికి ఆ రోగిని పోలీసులు తీసుకువచ్చారు. అతను సస్పెన్షకు గురైన ఓ ఉపాధ్యాయుడు. పేరు సందీప్. తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రక్షించమంటూ అతను పోలీసుల అత్యవసర హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన సందీప్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆ సమయంలో వందనాదాస్ అతడి గాయానికి డ్రస్సింగ్ చేస్తోంది ఇంతలో ఆకస్మికంగా రెచ్చిపోయి..చికిత్స చేస్తున్న డాక్టర్‌తో సహా సమీపంలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై కత్తెరతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ పేషెంట్ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువ డాక్టర్ వందనా దాస్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించి తెలసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు. దీన్ని దిగ్బ్రాంతికరమైన బాధకర ఘటన అని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఐతే ఈ ఘటనకు వ్యతిరేకంగా మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసీయేషన్(కేజీఎంఓఏ) వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. మరోవైపు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఏడురోజుల్లోగా ఈ ఘటనపై కొల్లాం జిల్లా పోలీస్ చీఫ్‌ను నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా, కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బాధితురాలు హౌస్ సర్జన్ అని, అంతగా అనుభవం లేదని చేసిన ప్రకటన కాస్త మరింత వివాదాస్పదమై విమర్శలకు ఆజ్యం పోసింది. ఆమె ప్రకటనపై కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ ఫైర్ అయ్యారు. వైద్యురాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..ఇలాంటికి జరగడం దురదృష్టకరమని సుధాకరన్ అన్నారు. యువ వైద్యురాలు హత్య యావత్తు కేరళ రాష్ట్రాన్నే కలిచివేసిందని కేరళ సీనియర్ నేత సతీశన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని సతీశన్ ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పినరయి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించాయి. కాగా, విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలపడమే గాక ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐతే కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఈ విషాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే గాక మెడికల్ టూరిజానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలో ఇలాంట ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ ఘటన కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని, కేరళలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతలో లోపాలను తేటతెల్లం చేసిందని విమర్శించారు. (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
లోపలికి తీసుకెళ్లేందుకు ఎలాంటి సాయం చేయని సిబ్బంది
-
స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన బంధువులు
-
సాక్షి ఎఫెక్ట్: రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగింది?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేక రోగి కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనానికి ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు వద్ద ఓకే చోట 10 నుంచి 16 స్ట్రెచర్లు 5 వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా దర్శనం ఇస్తున్న స్ట్రెచర్లు, వీల్ చైర్లు చూసి రోగుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ఇన్ని స్ట్రెచర్లు కంటికి కనిపించలేదని అవాక్కవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ హనుమంతు ఆసుపత్రికి వచ్చి పరిశీలించాలని రోగుల బంధువుల డిమాండ్ చేస్తున్నారు. కాగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమ్మర్ టూర్.. వెరీ ‘హాట్’ గురూ! -
వైద్యుల నిర్వాకం.. పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్ మరిచి..
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది. ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు. చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి! -
గ్రేట్ సీఎం! పేషెంట్ కోసం ఏకంగా హెలికాప్టర్ని...
ఒక మారుమూల ప్రాంతంలోని రోగి కోసం ఏకంగా తన్న ప్రత్యేక హెలికాప్టర్ని నింపి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు హిమచల్ ముఖ్యమంత్రి. తన పర్యటను సైతం రద్దు చేసుకుని మరీ హెలికాప్టర్ని పంపారు. చంబా జిల్లాలోని పాంగి సబ్‌డివిజన్‌లో కిల్లార్లో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. అతను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న హిమచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించడం కోసం ఆ ప్రాంతానికి హెలికాప్టర్ని పంపారు. అతనిని తండా వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు అతనికి ఉచితంగా వైద్యం అందించడమే గాక అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి సదరు ఆస్పత్రి అధికారులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. వైద్య సదుపాయం లేని ఆ సుదూర ప్రాంతానికి తన అధికారిక చాపర్ని పంపడం కోసం ముఖ్యమంత్రి తన పర్యటనను సైతం రద్దు చేసుకున్నట్లు అధికారుల పేర్కొన్నారు. అంతేగాదు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు సరైన వైద్యం అందేలా ఆ ప్రాంతంలో తగినంత మంది వైద్యులను నియమిస్తామని కూడా చెప్పారు. దీంతో ఆ పేషెంట్ సోదరుడు ప్రీతమ్ లాల్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ..మా కుటుంబాన్ని రక్షించే దేవుడు అని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌ని కొనియాడాడు. (చదవండి: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు..ఇది కేవలం సర్వేనే!) -
చేయని ఆపరేషన్‌కు కుట్లు తీయాలన్న వైద్యులు..షాకైన పేషెంట్
సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన రోగమైనా ఇక్కడ ఇట్టే నయమవుతుందనే నమ్మకం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా దొరకని స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయనే భావన. అరుదైన చికిత్సలు..పరిశోధనలతో ఉత్తమ గుర్తింపు పొందిన నిమ్స్ నేడు కొంత మంది వైద్యుల తీరుతో అబాసు పాలవుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తోడు అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది వైద్యులు రోగులను మభ్యపెట్టి ఆస్పత్రికి చెడ్డపేరు తీసు కొస్తున్నారు. ఫలితంగా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. తాజాగా ఓ వైద్యుడు రోగికి ఎలాంటి సర్జరీ చేయకుండానే చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో చూపించడమే కాకుండా ఆయన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 15 మంది రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సర్జరీ చేయకుండానే...చేసినట్లు రికార్డులు.. ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకటేశ్వర్రావు(47) వాంతులు, కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం2 2021 ఏప్రిల్4న నిమ్స్‌కు చేరుకున్నాడు. న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఉంది..ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, అం దులోనే సర్జరీ చేయాలని సదరు బాధితుడు వైద్యులకు మొర పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ చికిత్స లేదని, డబ్బులు కట్టి సర్జరీ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైద్య ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స చేసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. అయితే, డాక్టర్లు ఇక్కడే తప్పులో కాలేశారు. డిశ్చార్జీ సమ్మరీలో వెంకటేశ్వరరావుకు సర్జరీ చేసినట్లు నమోదు చేయడమేగాకుండా.. కుట్లు తీయించుకునేందుకు ఫలానా తేదీనాడు రావాలని సూచించారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడం..లాక్డౌన్ కారణంగా ఆయన ఆస్పత్రికి రాలేకపోయారు. ఇటీవల ఆనారోగ్య సమస్య తీవ్రం కావడంతో గతేడాది డిసెంబర్ 28న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సమాధానం విని బిత్తెరపోయారు. నిమ్స్ వైద్యులు రాసిన డిశ్చార్జీ సమ్మరీ చూసి వైద్యులు ఆశ్చర్య పోయారు. ఆపరేషన్ చేయక పోయినా...చేసినట్లు సమ్మరిలో పేర్కొనడంతో వారు చికిత్సకు నిరాకరించి.. మళ్లీ నిమ్స్‌కు వెళ్లమని తిప్పిపంపారు. దీంతో ఆయన గురువారం నిమ్స్ న్యూరాలజీ ఓపీకి వచ్చాడు. ఇంతకు ముందు నిన్నెవరు చూశారో వాళ్ల దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో చూసిన వైద్యుడెవరో తెలియని వెంకటేశ్వరరావు..ఏం చేయాలో అర్థంగాక తలపట్టుకున్నారు. ఇప్పటికే చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేసుకున్న తనకు సర్జరీ కోసం మళ్లీడబ్బులు సర్దుబాటు చేయడం తలకు మించిన భారమని వాపోయారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన మరో బాధితుడు అదే విధంగా బడంగ్‌పేటకు చెందిన అరుణ కుమార్ మెదడులో ఏర్పడిన కణితి సమస్యతో బాధపడుతూ నిమ్స్‌ను ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలోని ఓ అధికారి సిఫార్సుతో వచి్చన ఆ రోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.50 వేలు కట్టించి పరీక్ష చేయించారు. అంతే కాకుండా ఓ అధికారి కూడా అతని వద్ద నుంచి ఆపరేషన్ చేయించేందుకు గానూ రూ. 20వేలు వసూలు చేశాడు. చివరికి ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. సదరు బాధితుడు ఇటీవల ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సదరు అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ సాయిబాబాలతో విచారణ కమిటీ వేసింది. (చదవండి: వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం ) -
నీకో పెగ్గు.. నాకో పెగ్గు..! అంబులెన్స్ ఆపి పేషెంట్‌తో డ్రైవర్ లిక్కర్ పార్టీ
భువనేశ్వర్: ఏదైన ప్రమాదం జరిగినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అంబులెన్స్. వెంటనే ఫోన్ కొట్టి బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు అంతా పక్కకు తప్పుకుని దారి ఇస్తారు. కానీ ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. లిక్కర్ కోసం వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు నిలిపేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. అంతే కాదండోయ్..! అంబులెన్స్‌లోని రోగికి సైతం ఓ పెగ్గు అందించిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒడిశా జగత్సింగ్పూర్ జిల్లాలోని తిర్తోల్ హైవేలో ఓ బాధితుడిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన డ్రైవర్.. లిక్కర్ బాటిల్ తీసి గ్లాసులో పోసుకొని తాగటం ప్రారంభించాడు. వాహనంలోని పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా దానిని సేవించాడు. ఆ సమయంలో బాధితుడి పక్కన ఓ మహిళ, చిన్న అబ్బాయి కూడా ఉన్నారు. దీనిని చూసిన వాహనదారులు.. అంబులెన్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. బాధితుడే మద్యం అడిగారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక -
కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అనధికార వ్యక్తుల సంచారం అధికమైంది. వైద్య సిబ్బందిలాగా యూనిఫాం ధరించి వార్డులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఫిమేల్ వార్డుకు వైద్యపరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన వృద్ధురాలిని డబ్బులు ఇవ్వాలంటూ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వేధించారు. తన వద్ద డబ్బులు లేవంటూ వృద్ధురాలు బతిమిలాడినా వదిలిపెట్టలేదు. చివరికి వంద రూపాయలు ఇస్తానని వృద్ధురాలు చెప్పగా కనీసం రూ.150 ఇవ్వాలంటూ వేధించి మరీ తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రి అధికారులను విచారణకు ఆదేశించారు. అయితే వైద్య సిబ్బంది ముసుగులో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి సంబంధించిన వారు కాదని, బయటి వ్యక్తులని అధికారులు తేల్చారు. వారిపై మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షణలో నిమగ్నమై ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు, డ్రస్ కోడ్ ధరించి ఉండాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: (ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు) -
ఘోస్ట్ పేషెంట్‌తో ముచ్చటిస్తున్న సెక్యూరిటీ గార్డు: వీడియో వైరల్
ఒక ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలోని ఘటన ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ఈ ఘటన అర్జెంటీనాలోని ఫినోచిట్టో శానిటోరియం, బ్యూనస్ ఎయిర్స్లో ఉన్న ఒక ప్రైవేట్ కేర్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఆ వీడియోలో...ఆస్పత్రి వద్ద ఉన్న ఆటోమెటిక్ డోర్లు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఎవరో ఎంట్రవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే సెక్యూరిటీ గార్డు మాత్రం లేచి వచ్చి మరీ రిజిస్టర్లో పేషెంట్ ఎవరో వచ్చినట్లుగా వివరాలు నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత లోపలకి వెళ్లే దారిని వివరిస్తూ ఒక వీల్ చైర్ కూడా ఇస్తున్నట్లు కనిపించింది. ఈ ఘటన సీసీఫుటేజ్‌లో రాత్రి 3 గంటల ప్రాంతంలో రికార్డు అయ్యిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా వామ్మో ఏముందక్కడా? అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డైలీ స్టార్ అనే స్థానిక మీడియా ఈ విషయమై ఆరా తీయగా ఆ తలుపులు ప్రతి పది గంటలకోసారి ఆటోమెటిక్‌గా తెరుచకుంటాయని చెబుతున్నారు ఆస్పత్రి యజమాన్యం. పైగా ఆ రోజు ఏ పేషెంట్ వివరాలు ఆ సమయంలో రికార్డు చేయలేదని అన్నారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవ్వడం స్థానికి మీడియా వంతైంది. మరికొంతమంది నెటిజన్లు మాత్రం.... ఆ సెక్యూరిటీ గార్డు కావాలనే ఇలా చేశాడు. అక్కడే ఏమి లేదు ఇదంతా సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుందనే తెలిసే ఇలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
ఇవి తెలుసుకుంటే.. మెడికల్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చు!
కుమార్ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలే కడుపులో తీవ్రమైన నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. పరిశీలించిన వైద్యులు పేగు సంబంధిత ఇన్ఫెక్షన్గా తేల్చారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయగా, మొత్తం బిల్లు రూ.80వేలు వచ్చింది. నిజానికి కుమార్‌కు రూ.5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ ఉంది. దాంతో అతడు నిశ్చింతగా ఉన్నాడు. కానీ, అయిన బిల్లులో బీమా కంపెనీ చెల్లించింది కేవలం రూ.49,000. మిగిలిన రూ.31,000 తను జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. బీమా సంస్థ అంత మొత్తం ఎందుకు తగ్గించిందన్నది అతడికి అంతుబట్టలేదు. ఇది కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. వైద్య చికిత్సల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంత ఖజానా నుంచి చెల్లించుకోవాల్సిన సందర్భాలు బోలెడు. నీతి ఆయోగ్ 2021 నివేదిక ప్రకారం.. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న మొత్తం వ్యయాల్లో 63 శాతాన్ని ప్రజలు సొంతంగా భరిస్తున్నారు. ప్రపంచదేశాల్లోనే ఇది ఎక్కువ. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా ఇలా మన జేబు నుంచి చెల్లించుకోవాల్సిన పరిస్థితులను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పే కథనమిది... అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నదే లేకపో వడం, ఉన్నా సమగ్ర కవరేజీతో తీసుకోకపోవడం కూడా క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై అదనపు భారం పడేలా చేస్తోంది. చికిత్సలో భాగంగా ఉపయోగించే కొన్ని రకాల వస్తువులు, సేవలకు హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, ప్రొడక్ట్స్ క్లెయిమ్ డైరెక్టర్ డాక్టర్ బబతోష్ మిశ్రా గుర్తు చేశారు. ‘‘చాలా మంది సమగ్రమైన కవరేజీని ఎంపిక చేసుకోవడం లేదు. కరోనా సంక్షోభం తర్వాత పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావంతో, ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే కవరేజీ చాలడం లేదు. దాంతో మిగిలిన మొత్తాన్ని పాలసీదారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెడ్ భాస్కర్ నెరుర్కర్ పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ రూపంలో పొందే వైద్య సేవలకు చాలా ప్లాన్లలో కవరేజీ ఉండదు. కో–పే, సబ్ లిమిట్ తదితర షరతులు క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారానికి కారణమవుతాయి. అందుకుని పాల సీ కవరేజీ విషయంలో కొన్ని ముందస్తు జా గ్రత్తలు తప్పనిసరి. దీనికితోడు పాలసీదారులు తమపై భారం తగ్గించుకునేందుకు అందుబాటు లోని ఇతర మార్గాలను గుర్తించడమే పరిష్కారం. బయటి ల్యాబ్‌లు ఔట్ పేషెంట్‌గా వైద్య చికిత్సలకు వెళ్లినప్పుడు హాస్పిటల్‌కు సంబంధించిన ల్యాబ్‌లలో కాకుండా, బయటి డయాగ్నోస్టిక్స్‌లో టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. హాస్పిటల్ అనుబంధ కేంద్రాల్లో రక్త పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రేడియో ఇమేజింగ్ సేవల చార్జీలు ఎంతో అధికంగా ఉంటుంటాయి. ప్రైవేటులోనూ హెల్త్ స్టార్టప్‌ల రూపంలో ఎన్నో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. హెల్తియన్స్, థైరోకేర్ ఇలా చాలానే ఉన్నాయి. వైద్యులు పరీక్షలు సూచించినప్పుడు తక్కువ చార్జీలున్న వాటికి (న మ్మకమైన సంస్థలకే పరిమితం) వెళ్లొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేయించుకోవచ్చు. హాస్పి టల్ చార్జీలతో పోలిస్తే 40–50 శాతం తక్కువకే ఎన్నో సంస్థలు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. జనరిక్ మందులు వైద్యుల సూచించిన మందులను, హాస్పిటల్ వద్దనున్న ఫార్మసీల్లోనే తీసుకోవాలని లేదు. ఆ ప్రిస్కిప్షన్‌తో నేరుగా జనరిక్ ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి వాటికి ప్రత్యామ్నాయాలను తీసుకోవచ్చు. కంపెనీ ఏదైనా, లోపల అదే మందు ఉంటే చాలు. బ్రాండెడ్ ఔషధాల పేర్లకు బదులు, ఫార్మా ఇంగ్రేడియంట్ పేర్లతోనే రోగులకు మందులు సూచించాలని జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కనుక బ్రాండెడ్ ఔషధాలకు జనరిక్ మందులు మంచి ప్రత్యామ్నాయం. ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్లను సిఫారసు చేయాలంటూ వైద్యులను కోరుతుంటాయి. ఇందుకోసం సిబ్బంది, వైద్యులకు ప్రయోజనాల రూపంలో చాలా ఖర్చు చేస్తుంటాయి. దీంతో బ్రాండెడ్ ఔషధాల ధరలు అధికంగా ఉంటాయి. జనరిక్ మందులకు ఈ బెడద లేదు. బ్రాండెడ్‌తో పోలిస్తే 80 శాతం చౌకగా లభిస్తాయి. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన కేంద్రాలు కూడా దేశవ్యాప్తంగా జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నాయి. తగినంత కవరేజీ ఒకరి అవసరాలకు తీర్చే, సరిపడా కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యమని మెడి అసిస్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నిఖిల్ చోప్రా సూచించారు. ఏ పట్టణంలో నివసిస్తున్నారు? వయసు? కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. పెళ్లయి, పిల్లలతో మెట్రోల్లో నివసించే వారు కుటుంబం మొత్తానికి మెరుగైన కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలి. కనీసం రూ.5–10 లక్షలకు బేస్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20–25 లక్షలతో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సమ్ అష్యూరెన్స్ (కవరేజీ) చాలుతుందా? లేదా? అన్నది మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సమగ్రంగా ఉండాలి. మెడికల్, నాన్ మెడికల్ ఖర్చులతోపాటు, ఇంట్లో ఉండి తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేసేలా ఉంటే మంచిది. అలాగే, బీమా సంస్థ హాస్పిటల్స్ నెట్వర్క్ పెద్దగా ఉండాలి. అప్పుడు నగదు రహిత చికిత్సలు పొందడానికి వీలుంటుంది. ప్రమాద మరణం, ప్రమాదంలో వైకల్యానికి కవరేజీనిచ్చే రైడర్‌ను జోడించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల రిస్క్ ఉంటే, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను సైతం తీసుకోవాలి. ఓపీడీ/డేకేర్ ఇండెమ్నిటీ ప్లాన్లలో బీమా సంస్థలు హాస్పిటల్లో చేరినప్పుడు అయ్యే వ్యయాలకే చెల్లింపులు చేస్తుంటాయి. అలాగే, డేకేర్ ట్రీట్మెంట్లకు కూడా చెల్లింపులు చేస్తాయి. అంటే హాస్పిటల్లో చేరకుండా, చికిత్స తీసుకుని అదే రోజు వెళ్లిపోయే వీలున్నవి. ఇవి కాకుండా, వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చులో సగం ఔట్ పేషెంట్ రూపంలో (హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా) సేవలపైనే ఉంటున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలకు చేస్తున్న వ్యయాలకు బీమా ప్లాన్లలో కవరేజీ ఉండడం లేదు. అందుకుని ఓపీడీ కవరేజీనిచ్చే బీమా ప్లాన్ తీసుకోవాలని భత్వాల్ సూచించారు. ‘‘మీ బీమా ప్లాన్ ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) వ్యయాలకు కవరేజీ ఇవ్వకపోతే, అప్పుడు హాస్పిటల్స్‌కు వెళ్లొద్దు. క్లినిక్‌లకు వెళ్లండి. ఎందుకంటే హాస్పిటల్స్ అయితే చార్జీలపై 18 శాతం జీఎస్టీ కూడా విధిస్తాయి’’అని మిశ్రా వివరించారు. బీమా ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో కవరేజీ మొత్తం ఖర్చయిపోతే, తిరిగి మరోసారి హాస్పిటల్లో చేరాల్సి వస్తే అప్పుడు ఈ రీస్టోరేషన్ (నూరు శాతం కవరేజీని పునరుద్ధరించేవి) సాయపడుతుంది. హాస్పిటల్లో చేరినప్పుడు డైలీ క్యాష్ బెనిఫిట్‌ను కొన్ని పాలసీలు ఇస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కవరేజీ పరిధిలోకి రాని వాటి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్లాన్ తీసుకుని, అందులో ఈ ఫీచర్లు లేకపోతే పోర్టింగ్ ద్వారా అన్ని ఫీచర్లు ఉన్న ప్లాన్‌కు మారిపోవడం మంచి మార్గం. క్యాష్‌లెస్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రికి వెళ్లడం ద్వారా తమపై పడే వ్యయాలను పాలసీదారులు తగ్గించుకోవచ్చు. బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆస్పత్రులతో భాగ స్వామ్యం ఉంటుంది. వాటిలో చేరితే పాలసీదారులకు తక్కువ చార్జీలు అమలవుతాయి. దీనివల్ల అటు బీమా సంస్థకు, పాలసీదారుకు ప్రయోజనం ఉంటుంది. నగదు రహిత వైద్య సేవలతోపాటు, పాలసీదారు తన వంతుగా చెల్లింపులు చేయాల్సి వస్తే వాటిపైనా తక్కువ చార్జీలు పడతాయి. కన్జ్యూమబుల్స్ చార్జీలు విధించవు. లేదా చాలా పరిమితంగా వేస్తాయి. నెట్వర్క్ హాస్పిటల్స్‌కే పాలసీదారులు వెళ్లేలా చూడడం కోసం.. కొన్ని బీమాకంపెనీలు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే కో–పేమెంట్ (బిల్లులో కొంత మొత్తం పాలసీదారు చెల్లించేలా) షరతు విధిస్తున్నాయి. హాస్పిటల్ రూమ్ పాలసీదారుడు హాస్పిటల్లో చేరినప్పుడు వైద్యేతర ఖర్చులకు (నాన్ మెడికల్) బీమా కంపెనీలు చెల్లింపులు చేయవు. రోగి రూమ్‌లో ఉన్నప్పుడు ఇచ్చే టిష్యూ, హ్యాండ్ వాష్, టూత్‌పేస్ట్ తదితర ఉత్పత్తులతోపాటు, హౌస్ కీపింగ్ చార్జీలు పాలసీలో కవర్ కావు. అలాగే, హాస్పిటల్లో చేరేందుకు రిజిస్ట్రేషన్ చార్జీలు, పోషకాహార నిపుణుడి చార్జీలు, కాటన్, బ్యాండేజ్‌లు, డిస్పోజబుల్కు బీమా సంస్థల చెల్లింపులు చేయవు. అయితే, వీటికి సైతం చెల్లింపులు చేసే ఆప్షన్‌ను బీమా సంస్థలు కొన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం కొంత అదనపు ప్రీమియం వసూలు చేస్తా యి. హాస్పిటల్లో అన్ని చార్జీలు రూమ్ విభాగం ఆధారంగానే ఉంటాయని నివాబూపాకు చెందిన బబతోష్ మిశ్రా తెలిపారు. డాక్టర్ ఫీజులు, ఐసీయూ అడ్మిషన్ చార్జీలు, ఆహారం, ఇతర సేవలకు చార్జీలను రూమ్ కేటగిరీ ఆధారంగానే విధిస్తారు. సింగిల్ రూమ్‌కు బదులు ట్విన్ షేరింగ్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాలసీదారు తాను సొంతంగా చెల్లించాల్సిన చార్జీలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ పాలసీలో సింగిల్ ఏసీ ప్రైవేటు రూమ్ అనే నిబంధన ఉంటే, దీనికంటే ఎగువ కేటగిరీ అయిన డీలక్స్ రూమ్‌లో చేరి చికిత్స పొందినప్పుడు, చార్జీలు కూడా అధికంగా పడతాయి. అప్పుడు పాలసీదారు జేబు నుంచి చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. కో–పే, డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కో–పేమెంట్ లేదా డిడక్టబుల్ ఆప్షన్లతో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ, చికిత్సలు అవసరమైనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. కో–పే లేదా డిడక్టబుల్ అన్నవి నిర్ణీత మొత్తం దాటినప్పుడు అమల్లోకి వచ్చేవి. అందుకని తక్కువ కో–పే/డిడక్టబుల్ ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారం లేదనుకుంటే, కో–పే లేని ప్లాన్‌కు వెళ్లాలి. రైడర్లు ఎప్పుడో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, అందులో అన్ని రకాల ఫీచర్లు లేకపోతే.. అలాంటి అన్ని సదుపాయాలను ఆఫర్ చేస్తున్న బీమా కంపెనీకి పోర్ట్ ద్వారా మారిపోవాలి. పోర్టింగ్‌తో వేరే కంపెనీకి మారే ఉద్దేశ్యం లేకపోతే అప్పుడు అదనపు కవరేజీలను ఆఫర్ చేసే రైడర్లు తీసుకోవడం ద్వారా, చికిత్సలు అవసరమైనప్పుడు తమపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని యాడాన్లు అందరికీ ఉద్దేశించినవి కావు. అవసరమైన రైడర్లను జోడించుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్‌కు పరిమితులు ఉంటే, అప్పుడు రూమ్‌రెంట్ వేవర్ రైడర్ తీసుకోవాలి. డైలీ క్యాష్, కన్జ్యూమబుల్స్ కవరేజీలను కూడా ఎంపిక చేసుకోవాలి. డిస్కౌంట్స్ హాస్పిటల్స్ డిజిటల్ సేవలపై తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఆన్లైన్లో అపాయింట్మెంట్పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. డిస్కౌంట్‌తో కూడిన హెల్త్‌కార్డ్‌లను ఆఫర్ చేసేవీ ఉన్నాయి. ఫార్మసీ బిల్లులపైనా తగ్గింపు ఇస్తున్నాయి. ఇలాంటివి తెలుసుకుని వాటిని పొందడం ద్వారా ఖర్చుల భారం తగ్గించుకోవచ్చు. చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయానికి.. -
తప్పతాగి మహిళా పేషెంట్‌ని చితక్కొటిన డాక్టర్!
చత్తీస్‌గఢ్: మద్యం మత్తులో ఉన్న డాక్టర్ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన కోర్బాలోని చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గెర్వాని గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తన తల్లి సుఖమతికి అర్థరాత్రి ఆరోగ్యం బాగోకపోవడంతో అంబులెన్స్‌కి కాల్ చేశాడు. ఐతే అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో శ్యామ్ తన తల్లిని ఆటోరిక్షాలో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఐతే డాక్టర్ తప్పతాగి ఉండటంతో చికిత్స సమయంలో శ్యామ్ తల్లిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయ్యి ఎందుకలా చేస్తున్నారంటూ వైద్యుడిని ప్రశ్నించాడు. ఐతే సదరు డాక్టర్ శ్యామ్‌ని సైలెంట్‌గా ఉండు అంటూ అతని తల్లిని పదే పదే కొడుతూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు డాక్టర్‌కి షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ మేరకు మెడిక్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ మిశ్రామ్ సదరు డాక్టర్‌కి నోటీసులు ఇచ్చామని, అతను ఎందుకలా చేశాడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. महिला पर डॉक्टर ने की थप्पड़ों की बारिश#korba #Chhattisgarh pic.twitter.com/tdehhmz8t0 — Nayabharat News (@NayabharatLive) November 9, 2022 (చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి) -
షాకింగ్ వీడియో: రక్తపు మడుగులో పేషెంట్.. చుట్టూ తిరుగుతున్న కుక్క
లఖ్‌నవూ: ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు. అతని చుట్టూ ఓ వీధి కుక్క తిరుగుతున్న హృదయవిదారక సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. వీడియో ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో కింద పడిపోయి ఉన్నాడు. చుట్టూ రక్తం పడి ఉంది. ఆ వ్యక్తి ముఖం, తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి చుట్టూ ఓ వీధి కుక్క సైతం తిరుగుతోంది. 28 సెకన్ల పాటు చూపించిన ఈ వీడియోలో ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ పడకల సహా ఏ ఒక్క డాక్టర్, నర్సు సైతం లేరు. మరోవైపు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆసుపత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ ఎస్కే వర్మ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, చికిత్స అందిస్తున్న సమయంలోనే పలుమార్లు బెడ్ పైనుంచి కిందపడిపోయినట్లు చెప్పారు. ఆ వీడియో తీసిన సమయంలో డాక్టర్, వార్డు బాయ్ మరో వార్డులోని ఎమర్జెన్సీ కేసును చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తిని గోరఖ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. The video is from #Kushinagar, #UttarPradesh In the government hospital, the injured youth lying in a pool of blood is lying on the ground instead of the bed, dogs are licking his blood. The fate of every hospital is not like Morbi, which is brightened overnight. pic.twitter.com/5PM5di0Lxv — Today Hind (@today__hind) November 3, 2022 ఇదీ చదవండి: ‘ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్ -
జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం
లక్నో: ఒక మహిళా పేషంట్‌కి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఒక నర్సు చాలా దురుసుగా ప్రవర్తించింది. ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్‌పై పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మాధ్యమంలో వైరల్ కాగా, నర్సు తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ఆస్పత్రి అధికారి స్పందించారు. రోగిని అక్టోబర్ 18న ఆమె బంధువులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆ పేషంట్ ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో హఠాత్తుగా హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభించింది. తన గాజులు పగలు కొట్టుకుని, బట్టలు చించేసుకుంది. దీంతో అదే వార్డులో ఉన్న ఇతర మహిళా పేషంట్లు భయాందోళనలకు గురయ్యారు. సదరు పేషంట్ని కంట్రోల్ చేసే నిమిత్తం అలా నర్సు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ తదనంతరమే పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు. ఆమెను అదుపుచేయడానికి నర్సు అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నర్సు దురుసుగా ప్రవర్తించిందంటూ వస్తున్న ఆరోపణలను డాక్టర్ సింగ్ తోసిపుచ్చారు. सीतापुर जिला अस्पताल से हैरान करने वाला वीडियो आया सामने,स्टॉफ नर्स एक महिला मरीज की चोटी पकड़कर बेड पर पटकती नजर आई,वीडियो वायरल.@dm_sitapur @myogiadityanath @CMOfficeUP @brajeshpathakup#UttarPradesh #Sitapur#सीतापुर @abcnewsmedia pic.twitter.com/WhPaZUHbpx — ASHISH YADAV (@AshishYadavknp) October 28, 2022 (చదవండి: -
ప్లేట్లెట్స్ బదులు బత్తాయి జ్యూస్.. బిగ్ ట్విస్ట్
లక్నో: కలకలం రేపిన ప్లేట్లెట్స్ బదులు పండ్లరసం పేషెంట్‌కు ఎక్కించి.. అతని మరణానికి కారణమయ్యారనే ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పేషెంట్‌కు ఎక్కించింది బత్తాయి రసం కాదని.. అది ప్లేట్లెట్స్ యూనిట్లేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ ఖత్రీ మాట్లాడుతూ.. ఆ రోగికి ఇచ్చింది బత్తాయి రసం కాదని చెప్పారు. పేషెంట్‌కు ఎక్కిచ్చింది ప్లేట్లెట్స్. కాకపోతే వాటిని సరిగా నిల్వ చేయలేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించినట్లు ఖత్రీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటికే అధికారులు ఆస్పత్రిని సీల్ చేయడమే గాక వివరణ ఇవ్వకపోవడంతో బుల్డోజర్తో కూల్చివేయాలని అదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు) -
పేషెంట్ బెడ్ కింద పాము.. పరుగులు తీసిన రోగులు, వైద్య సిబ్బంది
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల అలజడే కాదు, పాములు కలకలం సృష్టిస్తున్నాయి. పేషెంట్లను వైద్య సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పేషెంట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. పదిరోజుల క్రితం క్యాన్సర్ వార్డులోని బాత్రూంలోకి చొరబడ్డ నాగుపాము, తాజాగా వార్డులోకే వచ్చింది. ఓ పేషెంట్ బెడ్ కిందకి రావడంతో పామును చూసిన పేషెంట్లు వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చి దాక్కున్న పామును పట్టేశారు. పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పాము ఆసుపత్రిలో ప్రత్యక్షం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఆసుపత్రిలో పాములు కనిపించడం, గతంలో ఎలుకలు అలజడి సృష్టించడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పురాతన భవనం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే పాములు ఎలుకలకు ఆవాసంగా ఆసుపత్రి మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త -
చిన్నారి హానీ వైద్యానికి రూ.కోటి మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
-
‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు!
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రోగికి సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. స్పృహలో ఉన్న రోగి మెదడులోని కణితి(ట్యూమర్)నితొలగించి శభాష్ అనిపించుకున్నారు. ఈ రకమైన సర్జరీని వైద్యపరిభాషలో అవేక్ క్రేనియటోమీ అంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ ప్రకాశరావు, అనస్తీషియా వైద్యురాలు ప్రొఫెసర్ శ్రీదేవి తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు(60) అస్వస్థతతో ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజీ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన రీతిలో కణితి(ట్యూమర్) పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణ సర్జరీ చేస్తే రోగి ప్రాణానికే ప్రమాదమని భావించి న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు సంయుక్తంగా అవేక్ క్రేనియటోమీ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం సంబంధిత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సుమారు గంట సమయం వెచ్చించి ఆమెలో నమ్మకం కల్పించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లోని టేబుల్‌పైకి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చారు. మెదడు పైభాగాన్ని తెరిచి సర్జరీ చేస్తున్న సమయంలో ఫిట్స్, పెరాలసిస్‌తోపాటు పలు రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో స్పృహలో ఉన్న ఆమెతో నిరంతరాయంగా మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉంచారు. తనకు చిరంజీవి, నాగార్జున అంటే అభిమానమని, చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పడంతో కంప్యూటర్ ట్యాబ్‌లో ఆ సినిమాను చూపించారు. ఆమె సినిమా చూస్తుండగా వైద్యులు సుమారు రెండు గంటలు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్యూమర్‌ను తొలగించారు. వైద్యుల హర్షం తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన అవేక్ క్రేనియటోమీ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు ప్రకాశరావు, ప్రతాప్‌కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, అబ్బయ్య, పీజీలు కిరణ్, గిరీశ్, యామిని, స్ఫూర్తి, నర్సింగ్ సిబ్బంది రాయమ్మ, సవిన, రజిని, సుమ, వార్డ్బాయ్ నవీన్, వెంకన్నను వైద్యమంత్రి హరీశ్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీలు శోభన్‌బాబు, నర్సింహనేత, టీజీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షకార్యదర్శులు రాజేశ్వరరావు, భూపేందర్ రాథోడ్ తదితరులు అభినందించారు. -
వార్డుబాయ్ హంగామా.. పెదవికి కుట్టేయమంటే కన్ను కింద కోశాడు
సాక్షి, కరీంనగర్: ఓ వ్యక్తి పెదవి పగిలి వైద్యం కోసం ఆసుపత్రికి రాగా.. మద్యం మత్తులో ఉన్న వార్డుబాయ్ పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోసిన దుర్ఘటన మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. వివరాల్లో కెళితే.. ప్రమాదంలో పెదవి పగిలిన వ్యక్తి కుట్లు వేయించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. సీవోటీలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్ కుట్లు వేయమని వార్డుబాయ్‌ను పురమాయించాడు. అప్పటికే చిత్తుగా మద్యం సేవించి సీవోటీ వద్ద విధులు నిర్వహించే వార్డుబాయ్ పెదవికి కుట్లు వేయకుండా కన్ను కింది భాగంలో బ్లేడ్‌తో కోసి కొత్త గాయం చేశాడు. దీంతో పేషెంట్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్, నర్సులు పేషెంట్ల బంధువుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరగగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీసేలా వ్యవహరిస్తున్నారని పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సదరు వార్డుబాయ్ గతంలో కూడా చాలాసార్లు మధ్య మత్తులో హల్ చేసిన ఘటనలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనత కారణంగానే సదరు వార్డుబాయ్ మద్యం మత్తును వీడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు -
ఆస్పత్రి బిల్డింగ్ ఎక్కి రోగి హల్చల్.. రెండు గంటలు శ్రమించినా చివరకు
కోల్‌కతా: కోల్‌కతా న్యూరోసైన్స్ హాస్పిటల్లో ఓ రోగి హల్చల్ చేశాడు. రెండు గంటల పాటు అందర్నీ పరుగులు పెట్టించి, చివరికి బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ హాస్పిటల్లో సుజిత్ అనే పేషెంట్ తన బెడ్ నుంచి తప్పించుకుని ఆస్పత్రి భవనం ఏడవ అంతస్తులోని ఓ గోడ అంచున కూర్చుని దూకేస్తానంటూ రెండు గంటలు పాటు హంగామా చేశాడు. ఆ పేషంట్ చికిత్స తాను పొందుతున్న వార్డులోని గ్లాస్ కిటికీలోని గ్యాప్ ద్వారా తప్పించుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆసుపత్రి ఉద్యోగులు, అగ్నిమాపక దళం సిబ్బంది పేషంట్ని వార్డుకు తిరిగి రావాలని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పేషంట్ని కాపాడేందుకు హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో సిబ్బంది కిందకు దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరికి ఆస్పత్రి సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. దీంతో అతని పుర్రె, పక్కటెముక, ఎడమ చేయి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేషంట్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు -
ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ కన్నుమూత
-
ఎంజీఎం ఘటన: ఎలుకల దాడిలో గాయపడ్డ బాధితుడి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఎలుకల దాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చికిత్స పొందుతూ.. ఇవాళ వేకువ జామున కన్నుమూశాడు. శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి. అతడి చేతి వేళ్లను కొరుక్కుతినడంతో రక్తస్రావం జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, చాలామంది ఎలుకల దాడికి గురయ్యారని పేషెంట్లు వాపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు దిగింది. శ్రీనివాస్‌పై ఎలుకల దాడిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండె వైఫల్యంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దాంతో అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి చికిత్స పొందాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి కుటుంబ సభ్యులు హన్మకొండకు తీసుకెళ్లారు. -
రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు
ఎంజీఎం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకెల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రిగా పేరుగాంచిన వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం) ఐసీయూలోకి ఎలుకలు జొరబడ్డాయి. వెంటిలేటర్ల ద్వారా కృత్రిమశ్వాస అందించే వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేశాయి. కాళ్లు, చేతులు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. అధిక రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆ రోగి పరిస్థితి విషమంగా ఉంది. ఏమీ కాదులే అంటూ... రోగి బంధువుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ (42) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత నెల 26న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆర్ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. గత నెల 27న శ్రీనివాస్ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికినట్లు బంధువులు గమనించారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు కట్టుకట్టి ఏమీ కాదులే అని వదిలేశారు. అయితే గత నెల 30న అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌పై ఎలుకలు మరోసారి దాడి చేశాయి. ఆయన ఎడమ చేయి, కాలి వేళ్లతోపాటు మడమ వద్ద కొరకడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే అతని సోదరుడు శ్రీకాంత్ విషయాన్ని వైద్యులతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇదేమి ఆస్పత్రి.. వైద్యం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన వైద్యులు రోగికి చికిత్స అందించారు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్.. ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ గురువారం ఎంజీఎంకు చేరుకొని సూపరిండెంట్ శ్రీనివాస్, వైద్య బృందంతో కలసి ఆర్ఐసీయూ వార్డును సందర్శించారు. ఎలుకల సంచారం వెనక ఎవరి నిర్లక్ష్యం ఉందంటూ పరిపాలనాధికారులను ప్రశ్నించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఆర్ఐసీయూ వార్డుతోపాటు ఆస్పత్రిలో సాధారణ వార్డులన్నీ కలియతిరిగి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. ప్రాణంపోతే ఎవరిది బాధ్యత? శ్రీనివాస్‌ను తొలిసారి ఎలుకలు గాయపరిచిన ఘటనను ఆస్పత్రి అధికారులతోపాటు వైద్యుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా పరిపాలనాధికారులు పట్టించుకోలేదు. వైద్యాధికారుల అలసత్వం వల్లే మరోసారి ఎలుకలు శ్రీనివాస్‌ను కొరికిపెట్టాయి. దీనివల్ల ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇప్పుడు ఆయన ప్రాణం పోతే ఎవరు బాధ్యులవుతారో చెప్పాలి? – రోగి బంధుమిత్రులు సూపరింటెండెంట్, ఇద్దరు వైద్యులపై చర్యలు... సాక్షి, హైదరాబాద్: ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించారు. పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక పంపాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్ఐసీయూ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఘటనకు కారణాలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు యాకుబ్, ఆబీబీలను సస్పెండ్ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదని హరీశ్‌రావు హెచ్చరించారు. -
ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు
జైపూర్: కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. డాక్టర్లు పేషెంట్లను రక్షించాలనే అనుకుంటారు. అయితే ఒక్కోసారి అనూహ్య పరిణామాల వల్ల ఒక పెషంట్ చనిపోతే దానికి వైద్యుడే కారణం అంటూ ఆరోపణలు చేస్తుంటారు. నిజానికి వైద్యుడి నిర్లక్ష్యం ఎంతో ఉందో చెప్పలేం గానీ ఆ సమయంలో పేషెంట్ పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి అరుదైన సంఘటన కారణంగా సున్నితమైన వైద్యులు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు కథనం ప్రకారం...రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఓ ప్రైవేట్ ఫెసిలిటీలో గర్భిణి మృతి చెందింది. ఆ ఆస్పుత్రిని డాక్టర్ అర్చన శర్మ, ఆమె భర్త కలిసి నిర్వహిస్తున్నారు. అయితే గర్భిణి కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్యంగా కారణంగానే ఆమె చనిపోయిందంటూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సదరు డాక్టర్ అర్చనపై కేసు నమోదు చేశారు. అంతేగాదు ఆమె పై తక్షణమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్లో ఆ డాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వైద్యురాలు అవమానం తట్టుకోలేక తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: మహేష్ బ్యాంకు హ్యాక్ కేసు.. షాకింగ్ విషయాలు వెల్లడి) -
‘క్వార్టర్ మందైనా, డబ్బులైనా ఇవ్వాలి’ రోగి బంధువుపై వైద్య సిబ్బంది చిందులు
సాక్షి. విశాఖపట్నం: అప్పుడే 72 ఏళ్ల వృద్ధుడికి శస్త్రచికిత్స అయింది. 50–50 చాన్స్‌తో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోగి బంధువులు తీవ్ర వేదనలో ఉన్నారు. వీరి బాధలు అక్కడ (శస్త్రచికిత్స గది) వార్డు బాయ్‌కు పట్టడం లేదు. వార్డుకు షిఫ్ట్ చేయాలి. క్వార్టర్ బాటిల్ ఇస్తారా? లేదా డబ్బులైనా ఇస్తారా? అంటూ భీష్మించాడు. తమవారు వచ్చిన వెంటనే ఇస్తారని చెప్పినా కనికరించలేదు. ఇది కేజీహెచ్‌లో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం. నగరానికి చెందిన ఎల్. అప్పారావు(72)కు గత శుక్రవారం కడుపు నొప్పి సమస్యతో సమీపంలో వైద్యులను సంప్రదించారు. మోషన్ అయ్యేందుకు మందులు వాడినా తగ్గలేదు. అనంతరం స్పెషలిస్ట్ వైద్యుడి సూచన మేరకు ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు చేయించారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో గత మంగళవారం కేజీహెచ్ ఎస్–4 వార్డులో చేర్పించారు. అక్కడ మరికొన్ని పరీక్షలు చేశారు. రిపోర్టుల ఆధారంగా అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. సర్జరీ మూడు గంటలపాటు జరిగింది. 7 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ నుంచి రోగి తాలూకా ఎవరంటూ వార్డుబాయ్ పిలుపొచ్చింది. తామే అంటూ వెళ్లగా.. క్వార్టర్ బాటిల్ అయినా లేదా క్వార్టర్ బాటిల్‌కు డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇంతలో రోగి బంధువులు సెల్ఫోన్లో ఆ వ్యక్తి ఫొటో తీశారు. దీంతో వారిపై చిందులు వేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. ‘మా బాధలో మేము ఉండగా, మద్యం సేవించి ఆపరేషన్ థియేటర్లో ఉండడమే గాక.. మాపై విరుచుకుపడ్డాడు’ అని వాపోయారు. మహిళలపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న ఆపరేషన్ థియేటర్ ఉద్యోగి -
ప్రభుత్వాస్పత్రుల్లో ‘రేల’ సేవలు!
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం ప్రముఖ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ రేల తన సేవల్ని అందిస్తున్నారని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రేల హాస్పిటల్లో 4 ఏళ్ల బాలుడికి జరిగిన చిన్న పేగు మార్పిడి శస్త్ర చికిత్స ఏసియా బుక్ ఆఫ్‌లో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బెంగళూరుకు చెందిన స్వామినాథన్ కుమారుడు గుహన్(4)కు కొన్ని నెలల క్రితం ఆరోగ్య పరంగాఎదురైన సమస్యలతో చెన్నైలోని రేల ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ బాలుడికి చిన్న పేగు పూర్తిగా కుళ్లి పోవడంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యం అయింది. ఆ బాలుడి తండ్రి పేగులో కొంతభాగం సేకరించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఈ శస్త్ర చికిత్స ఏసియా బుక్‌లో చోటు దక్కించుకుంది. ఇందుకు తగ్గ ప్రశంసాపత్రం, పతకం ప్రదాన కార్యక్రమం మంగళవారం చెన్నై గిండిలో జరిగింది. ఈసందర్భంగా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జనని అనే పేద బాలిక ప్రాణాల్ని రక్షించేందుకు డాక్టర్ రేల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ప్రైవేటు రంగంలోకి ఉన్న డాక్టర్ రేల తన సేవల్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సైతం ఉచితంగా అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ రేల, డాక్టర్ నరేష్ షణ్ముగం బృందంతో పాటుగా ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఏసియా బుక్ ప్రతినిధి వివేక్ పాల్గొన్నారు. -
ఆ మాష్టారు కిడ్నీలో 156 రాళ్లు!
బంజారాహిల్స్: దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి యూరాలజిస్ట్, ఎండీ డాక్టర్ వి.చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని హుబ్లికి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బసవరాజు కడుపు నొప్పి రావడంతో పరీక్షలు నిర్వహించడంతో కిడ్నీల్లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు బదులుగా కడుపు దగ్గరలో ఉందని దీన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారని డాక్టర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. ఇలాంటి చోట కిడ్నీలోని రాళ్లను తీయడం చాలా పెద్ద ప్రయత్నమేనని అయితే శరీరంపై పెద్ద కోతకు బదులు కేవలం కీహోల్ మాత్రమే చేసి తీసేశామని ఆయన వివరించారు. ఈ రోగికి రెండేళ్లకు ముందే రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుందని అయితే ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఉన్నట్టుండి నొప్పి రావడంతో పరీక్షలు చేయిచుకున్నారని అన్నారు. -
ఇదో ప్రేమలేఖ! ఆనందం పట్ట‘లేఖ’
టెక్కలి రూరల్: ఇదో ప్రేమలేఖ. తన భార్యకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞత చెప్పేందుకు భర్త రాసిన లేఖ. సంతకం పెట్టడం తప్ప రాయడం తెలీని ఆ వ్యక్తి లెటర్‌ను టైప్ చేయించి ఆస్పత్రిలోని ఫిర్యాదుల పెట్టెలో వేసి వైద్యులను ఆశ్చర్యపరిచారు. నిత్యం ఫిర్యాదులతో సతమతమయ్యే వైద్య సిబ్బంది ఈ లేఖను చూసి మురిసిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే.. టెక్కలి మెట్టవీధికి చెందిన గుడ్ల రామారావు భార్యకు అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. చదవండి: శ్యామలను బిడ్డలా చూసుకుంటా! కాళ్లు చేతులు కదలక నోట మాట కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితిలో ఆమెను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు పది రోజుల పాటు పసిబిడ్డను చూసుకున్నట్లుగా ఆమెను రాత్రీపగలు చూసుకున్నారు. వారి కృషి ఫలితంగా ఆమె వేగంగా కోలుకున్నారు. వైద్య సిబ్బంది చూపిన చొరవ రామారావు మనసు గెలుచుకుంది. వారిని ప్రత్యక్షంగా అభినందించడానికి మొహమాట పడి, ఓ లెటర్‌ను ఇలా టైప్ చేయించి ఫిర్యాదుల పెట్టెలో ఈ నెల 4న వేశారు. శుక్రవారం ఆ పెట్టెను తెరిచి చూసిన ఆస్పత్రి సిబ్బంది లేఖను చూసి సంతోషపడ్డారు. ప్రజలు ఏవో కారణాలతో ఎప్పుడూ తమను నిందిస్తూనే ఉంటారని, ఈ లేఖతో ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. -
ఎంత నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి సూదిని కడుపులో మరిచిపోవడంతో..
తిరువొత్తియూరు: ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న యువకుడి కడుపులో సూది మరచి కుట్లు వేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెన్నై పులియాంతోపు బీకే కాలనీకి చెందిన రంజిత్‌కుమార్ (28) కడుపులో ఏర్పడిన గాయానికి పట్టాలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకున్నాడు. నొప్పి విపరీతంగా ఉండడంతో మూడు రోజుల తర్వాత స్కాన్ చేయించుకున్నాడు. కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తిరిగి ఆపరేషన్ చేయాలని తెలిపారు. దీనిని తిరస్కరించిన రంజిత్‌కుమార్ సోమవారం రాత్రి స్టాన్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఆపరేషన్ చేసి సూదిని తొలగించారు. చదవండి: గతంలోనూ బిపిన్ రావత్ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం.. ఎక్కడంటే? -
మందు నింపకుండానే సూది
సాక్షి, హుస్నాబాద్(మెదక్): మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం నవ్వులాటగా మారింది. సిరంజిలో మందు నింపకుండానే ఖాళీ సూది ఇచ్చిన తీరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పట్టణానికి చెందిన కేడం సుచిత్ర కరోనా రెండో డోస్ కోసం సోమవారం హుస్నాబాద్ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో సిరంజిలో వ్యాక్సిన్ మందు నింపి సూది వేయాల్సిన వైద్య సిబ్బంది, మందు నింపకుండానే ఎడమ చేతికి ఇంజక్షన్ ఇచ్చారు. పక్కనే ఉన్న సు చిత్ర తమ్ముడు ఇదేమిటని ప్రశ్నించగా, తెరుకున్న సిబ్బంది తిరిగి కరోనా వ్యాక్సిన్ మందు నింపి మళ్లీ కుడి చేతికి టీకా ఇచ్చారు. ముచ్చట్లలో పడిన సిబ్బంది మందు నింపారో లేదో చూసుకోకుండానే çసూది ఇవ్వడంపై అక్కడున్నవారు వాపోయారు. దీనిపై వివరణ అడగగా మరోసారి పొరపాటు జరకుండా చూస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారి సౌమ్యను ఫోన్లో స్పందించగా, స్పందించలేదు. -
హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్ గుండె
సాక్షి, గాంధారి (కామారెడ్డి): గుండెపోటుకు గురైన ఓ రోగికి ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలో వైద్యుడు సైతం గుండెపోటుకు గురయ్యాడు. వైద్యం అందించేలోగానే తుదిశ్వాస విడిచాడు. దీంతో రోగిని అంబులెన్సులో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అతనూ మార్గమధ్యలోనే కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే... గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్గు (60) ఆదివారం ఉదయం గుండెనొప్పితో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధారి మండల కేంద్రంలోని ఎస్వీ శ్రీజ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని నడుపుతున్న డాక్టర్ డి. లక్ష్మణ్ (45) వెంటనే వైద్య సేవలు మొదలు పెట్టారు. రోగిని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే డాక్టర్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది వెంటనే సమీపంలో ఉన్న మరో ఆస్పత్రి వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం అందించే ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే మరణించారు. అదే సమయంలో రోగి జగ్గును అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అటు డాక్టర్, ఇటు రోగి నిమిషాల వ్యవధిలో మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ముందురోజు సరదాగా గడిపి.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ డి. లక్ష్మణ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య స్నేహలత, ఇద్దరు కుమార్తెలు దీక్షణి, దర్శణి ఉన్నారు. ఆరు నెలల క్రితం గాంధారి మండల కేంద్రంలో సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఎం.ఫార్మసీ చదివిన భార్య స్నేహలత ఆస్పత్రిలో మెడికల్ షాప్ చూసుకుంటున్నారు. ఆయన ఇటీవలే అయ్యప్ప మాల ధరించారు. శనివారం భార్య, పిల్లలతో స్థానికంగా ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సరదాగా గడిపి వచ్చిన డాక్టర్ ఆదివారం ఉదయమే మేల్కొని చన్నీటితో స్నానం చేసి పూజలు పూర్తి చేసుకున్న సమయంలోనే గుండెపోటుకు గురైన జగ్గును అతని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతనికి వైద్యం అందించే ప్రయత్నంలో డాక్టర్ లక్ష్మణ్ చనిపోవడం అందరినీ కలచి వేసింది. డాక్టర్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. భార్య, పిల్లల రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం గుండెపోటు రావడంతో గాంధారి మండలంలోని ఎస్వీ శ్రీజ మల్లి స్పెషలిస్ట్ ఆసుపత్రికి వారి బంధువులు తీసుకొచ్చారు. పేషేంట్‌కు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్ లక్ష్మణ్‌కు కూడా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పేషేంట్‌కి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మధ్యమార్గంలో రోగి కూడా మృతి చెందారు. దీంతో గాంధారి మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. చదవండి: టెన్త్ క్లాస్‌మెట్.. పెళ్లి చేసుకుంటానని యువతిని లొంగదీసుకుని.. -
రోగిని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ఈసీ జీ గదిలో ఒక యువతికి పరీక్షలు చేస్తూ, సెల్ఫోన్లో ఫొటోలు తీసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కొత్తపేట పీఎస్ ఎస్ఐ ఖాజీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన ఒక యువతి అనారోగ్య కారణాలతో ఈసీజీ తీయించుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈసీజీ విభాగంలో పనిచేస్తున్న రాకేష్ వ్యక్తిగత సెలవులో ఉండటంతో అతడి స్థానంలో నల్లచెరువుకు చెందిన బత్తుల హరీష్‌ను ఉంచాడు. ఆస్పత్రిలో నిత్యం హరీష్ ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాత గుంటూరుకు చెందిన యువతికి పరీక్షలు చేస్తున్న సమయంలో ఆమెను హరీష్ సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీన్ని గుర్తించిన యువతి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆమె తల్లి, ఇతర రోగులు, అవుట్‌పోస్ట్ పోలీసులు వచ్చి హరీ‹Ùను పట్టుకున్నారు. -
వైద్యుల నిర్వాకం.. చికిత్సకోసం వెళితే.. కరెంట్‌షాకులు..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లోని ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన కిషన్ (38) మానసిక సమస్యతో ప్రశాంతి హాస్పిటల్లో చికిత్సకోసం పది రోజుల క్రితం చేరాడు. చికిత్స పొందుతున్న కిషన్ మంగళవారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. అయితే పేషెంట్ పరిస్థితిని అంచనా వేయకుండా వైద్యులు అడ్డగోలుగా కరెంట్ షాక్‌లు, ఓవర్‌డోస్ మందులు ఇవ్వడం మూలంగానే చనిపోయాడని ఆరోపిస్తూ బుధవారం ఉదయం మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. టూటౌన్ పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మృతుడి బంధువులతో చర్చించి సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై సైకియాట్రిస్టు డాక్టర్ పి.కిషన్‌ను వివరణ కోరగా, సదరు పేషెంట్‌కు ట్రీట్మెంట్ పూర్తిచేసి డిశ్చార్జ్ చేసే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందాడని తెలిపారు. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
వంకర తిరిగిన గుండె
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా అందరికీ గుండె ఎడమవైపున ఉంటుంది. 20 వేల మందిలో ఒకరికి కుడివైపున ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం పూర్తిగా ఛాతి మధ్యలో ఉంది. అది కూడా వంకర తిరిగి ఉండటంతో వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఇలాంటి వ్యక్తికి బైపాస్ సర్జరీ చేయడం ప్రపంచంలోనే రెండోదని వైద్యులు ప్రకటించారు. వివరాలను మంగళవారం కర్నూలులోని గౌరీగోపాల్ హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పీఎన్ఎన్. లక్ష్మణస్వామి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘కడప నగరానికి చెందిన గౌస్ మొహిద్దీన్ (57) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు రెండు నెలల నుంచి ఆయాసం ఎక్కువై ఇటీవల గుండెపోటు వచ్చింది. స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకోగా వైద్యపరీక్షలు చేసిన వైద్యులు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని కర్నూలుకు రెఫర్ చేశారు. హాస్పిటల్లో చేరిన అతనికి 2డీ ఎకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా మీసో కార్డియా అనే పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కూడా ఉందని నిర్ధారించాం. ఈ సమస్య వల్ల అతని గుండె ఎడమ వైపునకు గాకుండా ఛాతి మధ్యలో ఉండటంతో పాటు వంకరగా తిరిగింది. ఇలాంటి గుండెలో బైపాస్ సర్జరీ ఇప్పటికి ఒకసారి మాత్రమే 2016లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇలాంటి గుండెకు బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీని అనెస్తెటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్తో కలిసి ఈ నెల 25వ తేదీన కర్నూలులో విజయవంతంగా నిర్వహించాం. ఇలాంటి బైపాస్ సర్జరీ ప్రపంచంలో రెండోది మాత్రమే. ప్రస్తుతం గౌస్ మొహిద్దీన్ కోలుకుంటున్నాడు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించాం. గౌరీగోపాల్ హాస్పిటల్లో 3వేల కార్డియోథొరాసిక్, వాస్కులర్ ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. -
దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదు: కలెక్టర్ కార్తికేయమిశ్రా
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆశ్రమ్ ఆస్పత్రిలో ఘటనపై కమిటీ నిజనిర్ధారణ చేసిందని కలెక్టర్ కార్తికేయమిశ్రా అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. డయాబెటిక్ పేషెంట్ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
corona patient: బిల్ చూసి మైండ్ బ్లాక్.. ఏంటీ 22 కోట్లా!
వాషింగ్టన్: కోవిడ్ సోకిన ఓ వ్యక్తికి వైరస్ నుంచి విముక్తి లభించినా, బల్ రూపంలో భారీ షాక్ ఎదురైంది. ట్రీట్మెంట్ అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన బిల్ చూడగానే అతని మైండ్‌బ్లాంక్ అయింది. దేవుడా.. అంటూ గుండె పట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.22 కోట్లండి. ఇక ఆ బిల్లును సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అమెరికాలో ఓ వ్యక్తి కరోనా సోకిందని ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో నాలుగు నెలల చికిత్స అనంతరం అతను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇక డిశ్చార్జ్ సమయంలో అతనికిచ్చిన 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్ చూసి బెంబేలిత్తిపోయాడు. ఆ రసీదుని వీడియో తీసి ‘టిక్‌టాక్’లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి కొద్ది రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించుకుంది. కాగా అగ్రరాజ్యంలో వైద్యం కోసం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే అత్యత్తమ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుకే ఆ దేశంలో ఆరోగ్య బీమా తీసుకుంటే ఆస్పత్రుల్లో భారీగా బిల్లు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టేసిన ప్రియురాలు -
కొంప ముంచిన ఆర్ఎంపీ వైద్యం.. బాలిక పరిస్థితి విషమం..
సాక్షి, మరిపెడ(మహబూబాబాద్): ఓ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకుడు తన స్థాయికి మించి ఓ బాలికకు వైద్యం చేయడంతో పరిస్థితి విషమంగా మారిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలిక ఇటీవల జ్వరంతో బాధపడుతుండగా ఈనెల 15న మండల కేంద్రంలోని ఓ ప్రైయివేట్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఆర్ఎంపీ ఇవ్వాల్సిన డోస్ కంటే హైపర్ యాంటిబయోటిక్ ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి పంపించాడు. మూడు రోజుల తర్వాత బాలికకు శరీరంపై బొబ్బలు వచ్చి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షించి ఓవర్ డోస్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే పరిస్థితి వికటించినట్లు వెల్లడించారు. అక్కడ చేసిన వైద్యానికి సుమారు రూ.లక్ష కావడంతో ఇకపై స్థోమతలేని తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆర్ఎంపీని నిలదీయగా.. విషయం బయటకు పొక్కడంతో చేసేది లేక అతను మధ్యవర్తుల ద్వారా రూ.2 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చదవండి: Covid-19: పెరుగుతున్న గుండె కుడివైపు వైఫల్య సమస్యలు -
ఏలూరు ఆశ్రమం ఆస్పత్రి ఘటన.. విచారణకు ఆదేశించిన మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. డీఎం,హెచ్‌వో, ఆశ్రమం హాస్పిటల్ డాక్టర్‌తో మాట్లాడారు. పేషెంట్ ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. మృతుడి బంధువుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ చేరాడు. దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుని మృతి చెందాడు. (చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం) -
ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి
సాక్షి, ముంబై: ఘాట్కోపర్లో బీఎంసీకి చెందిన రాజావాడి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఎలుకలు దాడిచేశాయి. ఘటనలో బాధితుడి కన్నుకు గాయం అయినట్లు తెలిసింది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ పరిపాలన విభాగం దర్యాప్తునకు ఆదేశించినట్లు మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సాధారణంగా ప్రభుత్వ లేదా కార్పొరేషన్ ఆస్పత్రుల్లో జనరల్ వార్డులో ఎలుకలు, పిల్లులు, కుక్కలు అటు, ఇటూ తిరుగుతుంటాయి. కానీ, ఐసీయూలో ఏకంగా ఎలుక దూరడం, ఆ తరువాత బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి కన్ను కొరకడం ఆస్పత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిద్రలో ఉండగా.. కుర్లా, కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలుండటంతో ఐసీయూలో చేర్పించి వైద్యం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐసీయూలోకి వచ్చిన బంధువులు శ్రీనివాస్ కంటి నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు గమనించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు పరీక్షించారు. రోగి నిద్రలో ఉండగా ఎలుకలు కన్ను కొరికినట్లు నిర్ధరణకు వచ్చారు. అదృష్టవశాత్తు కన్నుగా ఎక్కువగా గాయం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న కిశోరి పేడ్నేకర్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఇదిలాఉండగా నాలుగేళ్ల కిందట కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కాటేశాయి. ఆ తరువాత మార్చురిలో ఉన్న శవాలను గుర్తుపట్టలేనంతగా ఎలుకలు కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
‘నేనిలా బతకలేను.. ట్రీట్మెంట్ ఆపేయండి!’
లండన్ : కరోనా కారణంగా అత్యంత ఎక్కువకాలం బాధింపబడ్డ బ్రిటన్ వ్యక్తిగా రికార్డుకెక్కిన జాసన్ కెక్(49) ఇకలేరు. శనివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌లోని వెస్ట్ యాక్స్‌కు చెందిన జాసన్ కెక్ 2020 మార్చి 31వ తేదీన కరోనా బారిన పడ్డారు. దీంతో అతడి కిడ్నీలు, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఇక అప్పటినుంచి సేయింట్ జేమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నడవలేని పరిస్థితుల్లో బెడ్‌కే పరిమితమయ్యారు. దాదాపు పది నెలలు పాటు ఇన్టెన్సివ్ కేర్ పైకప్పు చూస్తూ గడిపాడు. వైద్యులు తమ శక్తివంచనలేకుండా అతడ్ని కాపాడటానికి ప్రయత్నించి సఫలయ్యారు. అతడి ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడింది. పది నెలల తర్వాత నడవటం మొదలు పెట్టిన ఆయన.. నర్సుల సహాయంతో నడుస్తున్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్‌గా మారింది. భార్యా, కూతురితో జాసన్(ఫైల్) అయితే, ఆ తర్వాతినుంచి జాసన్ ఆరోగ్యంలో పెద్ద మార్పేమీ రాలేదు. నడవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. అనారోగ్య సమస్యలు వేధిస్తున్న వేళ ఎప్పుడేమవుతుందా అన్న భయంతో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేధనకు గురైన జాసన్ ఓ కఠిన నిర్ణయానికి వచ్చారు. చావడానికి అన్ని రకాలుగా సిద్ధమై.. ‘నేనిలా బతకలేను.. ట్రీట్మెంట్ ఆపేయండి!’ అని వైద్యులను కోరారు. ఆయన కోరిక మేరకు.. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు జాసన్‌కు అందిస్తున్న చికిత్సలను ఆపేశారు. దీంతో ఈ శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. -
విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప..
కరోనా అనుమానంతో కొందరు అయినవాళ్లకే దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో.. తండ్రిలాంటి మామను కాపాడుకోవాలన్న ఆ కోడలి తాపత్రయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంలో నిహారికా దాస్ అనే మహిళ.. కరోనా పాజిటివ్ సోకిన మామను మీపు మీద మోసుకుంటూ రెండు కిలోమీటర్లు వెళ్లిన ఫొటోలు వారం రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఉత్తమ కోడలిగా, ఈ కరోనా కష్టకాలంలో మనిషికి మనిషి సాయం అంటూ ఆమె స్టోరీపై కథనాలు వెలువడ్డాయి. కానీ, పాపం ఆమె పడ్డ కష్టం వృథా అయ్యింది. ఆమె మామ చనిపోవడంతో పాటు కరోనా సోకిన ఆమె ఇప్పుడు చికిత్స తీసుకుంటోంది. గువాహటి: నిహారికా దాస్.. ఆదర్శ కోడలు ట్యాగ్ లైన్‌తో దేశం మొత్తం ప్రశంసలు అందుకుంది. ఓ మీడియా ఛానెల్ ఆమెను ఫోన్ ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించినప్పుడే.. తన ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం ఆమెకు తెలిసిందట. అంతేకాదు ఆ సంతోషంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె మామకు ఆ ఫొటోల్ని చూపించి ఆమె సంబుర పడింది కూడా. ‘నన్ను మోసేంత గుండె ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అని ఆ పెద్దాయన చెప్పిన మాటల్ని మీడియాతోనూ పంచుకుంది నిహారిక. అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పరిస్థితి క్షీణించి ఆమె మామ కన్నుమూశాడు. ‘‘మా ఫొటోలు షేర్ చేయడంతో పాటు మనిషికి మనిషి సాయం చేసుకోవాలనే సందేశం ఇవ్వడం బాగుంది. కానీ, నా విషయంలోనే అది జరగనందుకు బాధగా ఉంది. నా కష్టం చూసి చుట్టూ చేరి ఫొటోలు తీశారే తప్ప.. సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఫొటోలు చూడగానే నేను ఒంటరిననే భావన కలిగింది. నా గుండె భారంగా అనిపించింది. తల్లిదండ్రులే కాదు.. అయినవాళ్లు, కానీవాళ్లు అనే తేడా లేకుండా ఎవరికైనా సాయం అందించడం మనిషి కర్తవ్యం. అది నెరవేరనంత వరకు మానవత్వం గురించి ఎంత మాట్లాడుకున్నా వ్యర్థమే” - నిహారికా దాస్ ఏం జరిగిందంటే.. రహా ఏరియాలో తులేశ్వర్ దాస్ పోకవక్కలను అమ్ముతుంటాడు. అతని కొడుకు సిలిగురి(వెస్ట్ బెంగాల్)లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఆ ఇంట్లో తులేశ్వర్, కోడలు నిహారికా దాస్ ఉంటున్నారు. జూన్ 2న తులేశ్వర్ ఆరోగ్యం క్షీణించగా.. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిహారిక ప్రయత్నించింది. అయితే ఆ పరిస్థితి చూసి ఆటో, రిక్షా వాలాలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరోదారి లేక ఆమె భుజాన వేసుకుని నాగావ్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆ టైంలో అంతా ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు. తులేశ్వర్, నిహారికలను టెస్ట్ చేసిన డాక్టర్లు ఇద్దరికీ పాజిటివ్ సోకిందని చెప్పారు. తులేశ్వర్ పరిస్థితి చూసి హాస్పిటల్ తరలించాలని చెప్పారు. అయితే వయసు మళ్లిన మామగారిని ఒంటరిగా వదిలేసేందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు. దీంతో ఓ మినీ వ్యాన్ మాట్లాడుకుని అక్కడికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది నిహారికా. తులేశ్వర్ పరిస్థితి విషమించడంతో జూన్ 5న గువాహటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. చివరికి సోమవారం రాత్రి కరోనాతో పోరాడుతూ తులేశ్వర్ కన్నుమూయగా.. నిహారిక ట్రీట్మెంట్ కొనసాగుతోంది. -
దారుణం : గ్లూకోజ్ పెట్టి.. రూ.3లక్షలు వసూలు
సాక్షి, రాజన్నసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన అనంతుల రవీందర్ సుమారు 30ఏళ్లుగా స్థానిక పాత బస్టాండ్‌లో మెస్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు కొడుకులు. ఇంజినీరింగ్ పూర్తయిన కొడుకులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లిద్దరూ సెటిల్ అయితే ప్రశాంతంగా ఉందామనుకున్నాడు. ఉన్నట్టుండి సెకండ్ వేవ్‌లో రవీందర్ కరోనా బారినపడ్డాడు. ఎందుకైనా మంచిదని గత ఏప్రిల్ 4న అతడు కరోనా టీకా వేయించుకున్నాడు. ఒకట్రెండు రోజులు జ్వరం వస్తుందని నర్స్‌లు తెలిపారు. తీవ్రజ్వరం.. కరోనా పాజిటివ్ టీకా వేసుకున్న మరుసటిరోజు రవీందర్ అస్వస్థతకు గురయ్యాడు. ఏప్రిల్ 8వ తేదీన జ్వరం వస్తే డోలో 650 టాబ్లెట్లు వేసుకున్నాడు. తగ్గకపోగా 9,10,11వ తేదీల్లో విపరీతంగా పెరిగింది. 12న ఉదయం జిల్లా ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. మరుసటి రోజు పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆక్సిజన్ లెవెల్ 70కి పడిపోయింది. దీంతో మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. రూ.2వేలు ఇస్తానన్న దొరకని కారు అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు దాటింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేవని చెప్పడంతో స్నేహితుడి సలహాతో వేములవాడలోని ఆస్పత్రికి వెళ్లాలనుకున్నాడు రవీందర్. 12కి.మీ. దూరానికి రూ. 2వేలు కిరాయి చెల్లిస్తామన్నా కారు దొరకలేదు. ఎలాగోలా వేములవాడకు చేరుకున్నాడు. డాక్టర్లు స్పందించక పోవడంతో తిరిగి సిరిసిల్లకు వచ్చాడు. తెలిసిన డాక్టర్‌ను సంప్రదిస్తే.. కరీంనగర్లో తనకు తెలిసిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లండని, తాను నేను ఫోన్ చేసి చెప్పా అని సలహా ఇచ్చాడు. రూ.25వేలు చేతిలో పట్టుకుని కారు డ్రైవింగ్ చేసుకుంటూ కరీంనగర్ వెళ్తుండగా బావుపేటలో చెమటలు బాగా వచ్చాయి. ఓ ఐదు నిమిషాలు ఆగి.. మంచినీళ్లు తాగి సేద తీరాడు. నాలుగురోజులు రూ.3లక్షలు కరీంనగర్‌లోని బంధువు సాయంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు రవీందర్. భయానికి పల్స్ రేటు కూడా పడిపోయింది. రూ.25వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరాడు. సిబ్బంది మాస్క్ వేసి గ్లూకోజ్ పెట్టారు. మరుసటిరోజు రెండు గ్లూకోజులు పెట్టారు. అయినా డాక్టర్ రాలేదు. పరీక్షించలేదు. ఈలోపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వెంటిలేటర్ ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. అప్పటికే నాలుగు రోజులైంది. నామమాత్రపు చికిత్స చేసి మందులకని రూ.90వేలు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రూ.1.30లక్షలు, ఇతర ఖర్చుల కింద ఇంకో రూ. 60 వేలు.. మొత్తం సుమారు రూ. 3 లక్షలు వసూలు చేశారు ఆస్పత్రి నిర్వాహకులు. మొత్తం రూ.13 లక్షలు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లగా ఒక్కరోజులోనే రూ.70వేలు వసూలు చేశారు. అయినా, అక్కడ ఆ సౌకర్యం లేదంటూ ఇంకో ఆస్పత్రికి పంపించారు. రోజూ రూ.50వేలు అడ్వాన్స్‌గా చెల్లిస్తేనే వైద్యం అందుతుందని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చి చెప్పారు. చేసేదిలేక దొరికిన చోటల్లా అప్పు చేసి బిల్లులు చెల్లించారు. ఐదు రోజులు చికిత్స చేసిన నిర్వాహకులు.. రూ.5లక్షలు బిల్లు వసూలు చేసి రవీందర్‌ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక కూడా ఆక్సిజన్ సౌకర్యం ఉండాలని సూచించారు. దీంతో ఇంట్లోనే ఆక్సిజన్‌తో చికిత్స కొనసాగింది. ప్రస్తుతం కోలుకున్నాడు. దాదాపు 12 రోజులు ఆస్పత్రిలో ఉండి తీరా ఇంటికి చేరే సరికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ.13 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. ఇందులో తండ్రి ప్రాణాలు కాపాడాలని కొడుకు తెలిసిన వాళ్లదగ్గర రూ.11లక్షలు అప్పుగా తెచ్చాడు. మంచి ఆహారం తీసుకుంటూ అతడు కోలుకున్నాడు. ప్రాణాపాయం తప్పింది కానీ చికిత్స కోసం చేసిన అప్పు ఎలా తీర్చేదని తల్చుకుంటూ ఆందోళనకు గురవుతున్నాడు. బిల్లులు ఇప్పించాలె కరోనా టీకా తీసుకున్నాక కూడా వైరస్ బారినపడడం దారుణంగా ఉంది. ఉన్నంతలో పనిచేసుకుని బతకడం అలవాటైన సమయంలో కరోనా కాటేస్తూ అప్పుల్లో ముంచింది. చికిత్సల పేరుతో ఆస్పత్రుల నిర్వాహకులు రూ.లక్షల్లో గుంజుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆస్పత్రులను కట్టడి చేయాలె. నా బిల్లులు వాపసు ఇప్పించాలె. సామాన్యులను ఆదుకోవాలె. – అనంతుల రవీందర్, సిరిసిల్ల చదవండి: వన్.. టూ.. 'త్రీ'.. రెడీ! -
కరోనా మృతదేహం, కనికరం లేకుండా బయటకు పడేశారు
సాక్షి, భువనేశ్వర్(జయపురం): కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ సిబ్బంది బయట పడేసిన సంఘటన స్థానిక పట్టణ సమీపంలోని డొంగాగుడ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ మృతదేహాన్ని చూసి, స్థానికులు భయపడుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పీపీఈ కిట్లతో మృతదేహాన్ని డెప్పిగుడ సమీపంలోని చంపాకుపిలి శ్మశానవాటికకు తరలించి, దహనపరిచారు. డొంగాగుడ దగ్గరి కెనాల్ వద్ద బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులు అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని సిబ్బంది పారవేస్తుండగా చూసినట్లు సమాచారం. చదవండి: గొప్ప మనసు; పెళ్లి మండపం నుంచి రక్తదాన శిబిరానికి.. -
కరోనా రోగి మృతదేహాన్ని నదిలో పడేసిన బంధువులు
లక్నో: కరోనా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. రక్త సంబంధీకులు దగ్గరకి రావడానికి జంకుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ రోగి మృతదేహాన్ని బంధువులు రాప్తీ నదిలో పడేశారు. ఈ ఘటన మే 28న బల్రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీన్ని ఆ వైపు నుంచి కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వీడియో తీశారు. వీడియోలోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పీపీఈ కిట్ వేసుకున్నారు. కాగా కరోనా బాధితుడు మే 25న చికిత్స కోసం బల్రాంపూర్ ఆస్పత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో మే 28న మరణించాడు. అతని మృతదేహాన్ని కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం అతని బంధువులకు అప్పగించారు. అయితే రోగి మృతదేహాన్ని బంధువులు నదిలో పడేసినట్లు తమకు సోషల్ మీడియా ద్వారా తెలిసినట్లు బల్రాంపూర్ మెడికల్ ఆఫీసర్ బిబి సింగ్ తెలిపారు. కాగా మృతదేహాన్ని తిరిగి వారికి అప్పగించి వారిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ట్విట్టర్లో స్పందించిన కేంద్ర మంత్రి ఈ ఘటనపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ట్విట్టర్లో స్పందించారు. గంగా నదిలో మృతదేహాలను వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని నిషేధించడానికి చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలను తనిఖీ చేయడానికి నది తీరాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కోరింది. కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం మృతదేహాలను పారవేయాలని, 14 రోజుల్లోగా దీనిపై నివేదిక పంపాలని ఆ రాష్ట్రాలకు సూచించింది. ఈ నెల ప్రారంభంలో బీహార్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో గంగా నది ఒడ్డుకు వందలాది మృతదేహాలు కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. బక్సర్ జిల్లాలో 71 మృతదేహాలను నదీతీరం నుంచి స్వాధీనం చేసుకున్నారు. గంగానది పక్కన ఉండే ఇసుక డంపింగ్‌లలో వేలాది ఇతర మృతదేహాలు ఖననం చేసినట్టు స్థానిక అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. In UP's Balrampur district, video of body of man being thrown in the river from a bridge has surfaced. The body was of a man who succumbed to Covid on May 28. pic.twitter.com/DEAAbQzHsL — Piyush Rai (@Benarasiyaa) May 30, 2021 (చదవండి: Kumbh Mela IG: ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనడం సరికాదు) -
క్వారంటైన్: చెట్టుకింద కరోనా రోగి..
జయపురం: కరోనా పాజిటివ్ నమోదైన ఓ బాధితుడు నవరంగపూర్ జిల్లా చందాహండి సమితి గంభారిగుడ పంచాయతీ మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సమితికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో హోం క్వారెంటైన్లో ఉండమని వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తికి హోం క్వారంటైన్ అవకాశం లేకపోవడంతో మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందాడు. దీంతో మెడిగాం గ్రామస్తులు వణికిపోతున్నారు. వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ నమోదైన వారిని గాలికి వదిలేస్తున్నారని హోం క్వారంటైన్లో ఉండే అవకాశం లేని వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కానీ గాలికి వదిలేయకూయడదని మండిపడుతున్నారు. కరోనా రోగులు చెట్ల కింద ఉంటే ఇతరులకూ కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమితిలోని హలదిగ్రామంలో 100 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్, పనాబెడ డిగ్రీ కళాశాల, సాలెబిడి ఆశ్రమంలో రెండు టీఎంసీ (తాత్కాలిక వైద్య కేంద్రం) లు ఉన్నా తమ గ్రామంలో చెట్టు కింద కరోనా రోగి ఉండడానికి కారణం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. సహాయం చేస్తున్న గ్రామ యువత చెట్టు కింద ఉంటున్న కరోనా రోగికి తిండి, మందులు ఎవరూ సమకూర్చడం లేదు. ఆ రోగి పరిస్థితి చూసి చలించిన మెడిగాం గ్రామానికి చెందిన యువకులు తినేందుకు, తాగేందుకు సమకూర్చారు. అలాగే రోగికి దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అవసరమైన మందులు తెచ్చి ఇస్తున్నారు. -
కరోనా సోకిన మహిళ పండంటి పాపకు జన్మ
బరంపురం: గంజాం జిల్లా పులసరా బ్లాక్ ప్రాంతానికి చెందిన కోవిడ్ బాధిత గర్భిణి సోమవారం మహిళా సిటీ అసుపత్రిలో ప్రసవించారు. డెడికేటెడ్ కోవిడ్‌కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆమె అడశిశువుకు జన్మనిచ్చారు. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ప్రశాంతకుమార్ మాట్లాడుతూ.. బిడ్డకు కోవిడ్ లక్షణాలేమీ లేవని తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొందమాల్ జిల్లా చకాపదా సమితి పరిధిలో ఓ నిండు గర్భిణి కరోనాతో బాధపడుతూ బ్రాహ్మణపధా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ అడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ కూడా తల్లి, బిడ్టా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
నిడదవోలులో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ( చదవండి: ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు ) -
కరోనా తీవ్రతతో మహిళ.. అంబులెన్స్‌లో అసభ్యకరంగా..
కొచ్చి: కరోనాతో బాధపడుతున్న బాధితులకు తమకు తోచిన విధంగా కొందరు సాయంచేస్తుంటే.. మరికొందరు ఏమీ చేయలేని వారి నిస్సహాయతను అదునుగా తీసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న మహిళతో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్‌కు బాధితురాలిని తరలిస్తుండగా ఆమెపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 27న జరగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించమని వైద్యులు తెలిపారు. ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లో అటెండెంట్‌గా ఉన్న ప్రశాంత్ తనను లైంగికంగా వేధించాడని ఆమె వైద్యులకి తెలిపింది. బాధితురాలు పరిస్థితి అప్పడు తీవ్రంగా ఉన్నందున ఘటన జరిగిన వెంటనే ఈ చర్య గురించి తెలపలేకపోయింది. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించింది. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్‌పై పోలీసుల ఫిర్యాదు నమోదు చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ( చదవండి: మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష ) -
రోగి అదృశ్యం.. మార్చురీలో మృతదేహం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా పాజిటివ్‌తో కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలోని అయిన ఘటన శుక్రవారం కాసేపు కలకలం రేపింది. అయితే ఆ రోగి ఆస్పత్రిలో చేరిన రోజే మృతి చెందగా, మార్చురీకి సిబ్బంది చేర్చారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం లేకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. అసలేం జరిగిందంటే.. గుడివాడకు చెందిన ఎంఎన్వీ సుబ్రహ్మణ్యం(42) ఈనెల 12న కరోనాకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అతడికి ఐసీయూ–9లో బెడ్ నంబర్–16 కేటాయించారు. ఆరోజే అతను మృతిచెందాడు. దీంతో సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ సమాచారం అధికారులకు చేరవేయలేదు. దీంతో బంధువులు వచ్చి రోగి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయగా, శుక్రవారం ఉదయం కూడా బాగానే ఉందని సమాచార కేంద్రం సిబ్బంది చెప్పారు. మధ్యాహ్నం మాట్లాడేందుకు యత్నించగా ఫోన్ పనిచేయలేదు. బెడ్‌పై సుబ్రహ్మణ్యం కాకుండా, మరొక రోగి ఉండటంతో కాసేపు అధికారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందని ఆరా తీస్తే మార్చురీలో మృతదేహాం ఉన్నట్లు గుర్తించారు. నిర్లక్ష్యం ఎవరిది! వార్డులో ఉన్న రోగి మృతి చెందితే, ఆ సమాచారం ఉన్నతాధికారులకు తెలియచేయాల్సింది అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందే. కానీ కొందరు నాలుగో తరగతి ఉద్యోగులు ఎవరైనా రోగి మృతి చెందిన వెంటనే మృతదేహాన్ని మార్చురీకి తరలించి, ఆ బెడ్‌పై మరొకరిని తీసుకొచ్చి వేసేస్తున్నారు. దీనికోసం కొంతమొత్తం డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు ఆదర్శం.. ‘ప్రగతి భారత్’ కోవిడ్ కేర్ సెంటర్ -
Telangana: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ
ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ కరోనా బాధితుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకుని సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణలో ఆలంపూర్ వద్దకు రాగానే పోలీసులు ఆ అంబులెన్స్ ని ఆపి.. రాష్ట్రంలోకి రావడానికి అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లమన్నారు. వారు ఎంత బతిమిలాడినా వినలేదు. ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా.. తెలంగాణ పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో బాధితుడు కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కర్ణాటక నుంచి ఆదివారం అర్ధరాత్రి కరోనా రోగితో వచ్చిన ఓ అంబులెన్స్ ను గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్దే పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో బెడ్లు ఖాళీ లేవని వెనక్కి వెళ్లాలని సూచించారు. తమకు బెడ్ అలాట్‌మెంటు ఉందని చూపించినా వెనక్కి పంపించారు. సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు. రాష్ట్రంలో కరోనా పడకలు, ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పాజిటివ్ రోగులను రాష్ట్రంలోకి రానివ్వడంలేదు. అలాంటివారిని తీసుకొస్తున్న అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడు ్డకుని వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిని అనుమతిస్తున్నా.. కరోనా బాధి తులను మాత్రం అడుగు పెట్టనివ్వడంలేదు. 40 శాతం పొరుగు రాష్ట్రాల వారే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో దాదాపు 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు వారికి ఎలాంటి షరతులూ లేకుండా చికిత్స అందించిన ప్రభుత్వం.. ఆదివారం రాత్రి నుంచి అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ–ఆంధ్రా సరిహద్దులైన వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజాలతోపాటు ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించే మాచర్ల మార్గంలో నాగార్జున సాగర్ వద్ద, దాచేపల్లి మార్గంలో వాడపల్లి వద్ద, మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద, హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం రామాపురం వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.. కోవిడ్ రోగులున్న అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్ ఉన్నట్టు పత్రాలు చూపించినవారిని మాత్రం రాష్ట్రంలోకి అనుమతించారు. ఈ విషయంపై ఏపీ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించిన కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. వీరంతా ఆక్సిజన్ సిలిండర్లతో లైఫ్ సపోర్ట్ వచ్చిన వారే కావడం గమనార్హం. ఏపీ నుంచే బాధితులు అధికం.. తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ కంటే ఏపీ నుంచే రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆ అంబులెన్సులను ఆపడంతో చాలావరకు అక్కడే నిలిచిపోయాయి. రోగి కేస్‌షీట్ చూసి కరోనా పాజిటివ్ అయితే వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్ అలాట్మెంట్ చూపిస్తే అనుమతించినా.. మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. ఎందుకు ఆపుతున్నారన్న ప్రశ్నకు హైదరాబాద్‌లో బెడ్లు లేవని, ఆక్సిజన్ కొరత ఉందని అందుకే ఆపమంటూ తమకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని పలువురు కిందిస్థాయి పోలీసులు తెలిపారు. దీంతో చాలామంది తెల్లవారుజాము వరకు ఎదురుచూసి వెనక్కి వెళ్లిపోయారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో లాక్డౌన్ ఉండటంతో అక్కడ నుంచి వచ్చే రోగుల సంఖ్య పెద్దగా లేదు. అందుకే, ఈ విషయంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పోలీసులు తామెవరినీ ఆపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని ఉమ్మడి ఆదిలాబాద్ పోలీసులు తెలిపారు. అయితే, రాష్ట్రంలోకి ప్రవేశించే వారు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం నోట్ చేసుకుని అనుమతిస్తున్నామని వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీ మీదుగా భద్రాచలం ద్వారా రావాలనుకున్న కరోనా పేషెంట్లకు ఎంట్రీ లేదనే చెబుతున్నారు. మానవత్వంతో చూడండి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలగాంణలోకి అనుమతించకపోవడంపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడారు. కోవిడ్ బాధితులపై మానవత్వం చూపాలని కోరారు. అంబులెన్సులను నిలిపివేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగా ణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. -
‘కోవిడ్ చికిత్సకు పాజిటివ్ రిపోర్ట్ అక్కర్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ - 19 పాజిటివ్ రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కచ్చితంగా ఆ రిపోర్ట్ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కోవిడ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను సవరిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆరోగ్య సదుపాయంలో భాగంగా చికిత్ప కోసం కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..ఏ రోగికి కూడా చికిత్స నిరాకంచవద్దు. రోగి వేరే నగరానికి చెందినవాడైనప్పటికీ అవరమైన మందులు, ఆక్సిజన్ అందించాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొంది. చికిత్సకు వచ్చే వారిని సీసీసీ, డీసీహెచ్‌సీ, డీహెచ్సీ వార్డులో అనుమానిత కేసులుగా చేర్చుకోవాలని సూచించింది.కోవిడ్-19తో బాధపడుతున్న రోగులకు సత్వరం, సమర్థవంతమైన చికిత్స అందించాలని తెలిపింది. ఆసుపత్రిలో రోగిని అవసరాన్ని బట్టి చేర్చుకోవాలని, పడకలు నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించకుండా చూసుకోవాలని తెలిపింది. (చదవండి: జూపార్క్‌పై కోవిడ్ దెబ్బ: 20 మంది ఉద్యోగులపై వేటు) -
నిహారిక: కరోనా బాధితులకు అన్నదానం
-
గతంలో మాదిరిగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాని దాతలు
-
9 నిమిషాల వ్యవధి.. ఓ ప్రాణాన్ని నిలిపింది
సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్) : ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం ఇటీవల మనం వార్తల్లో వినే ఉంటాం. ఆ మాటకు ఆర్థాన్నిచ్చేలా మన పోలీసులు వ్యవహరించారు. హైదరాబాద్‌లో ఓ రోగిని అత్యవసరంగా ఒక ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అది చాలా తక్కువ సమయంలోనే మార్చాల్సి ఉండగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏ ఆటంకం లేకుండా రోగి ఉన్న ఆంబులెన్స్ కు సకాలంలో ఆస్పత్రికి చేరాలా చేసి ఓ ప్రాణానికి కాపాడారు. వివరాల్లోకి వెళితే.. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యుల తెలిపారు. ఈ క్రమంలో గ్రీన్ చానెల్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా సకాలంలో ఆంబులెన్స్‌ను గమ్యస్థానానికి చేర్చారు. కిమ్స్ నుంచి అపోలోకు కేవలం 9 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరానికి చేర్చడంతో రోగి ప్రాణాలతో బయట పడ్డాడు. ( చదవండి: హమ్మయ్యా.. గాంధీలో సిద్ధమైన ఆక్సిజన్ ఫ్లాంట్ ) -
కరోనా భయంతో కాటికి వెళ్లాలనుకుంది.. కాపాడారు
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): కరోనా భయంతో మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ధురాలికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన 65 ఏళ్ల పుష్పావతి(పేరుమార్చాం) కరోనా పాజిటివ్‌తో గత నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. కరోనా భయంతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆమె ఏప్రిల్ 28వ తేదీన ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి రోగులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వృద్ధురాలిని నిలువరించి వార్డులో చేర్చి మంచానికి కట్టేసి వైద్యసేవలు అందించారు. ఈ మేరకు గతనెల 29వ తేదీన ‘కరోనా బాధితురాలి ఆత్మహత్యాయత్నం’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. వృద్ధురాలికి సపర్యలు చేసేందుకు కేర్‌టేకర్‌ను నియమించి ప్రత్యేక వైద్యం అందించారు. మానసిక రుగ్మతలు నివారించేందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించారు. మరోమారు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బుధవారం ఆమెను డిశ్చార్జీ చేశారు. సదరు వృద్ధురాలు గతంలో సెరిబ్రోవాసు్కలర్ ఎటాక్ (సీవీఏ)తో బాధపడుతుండేదని, కరోనా సోకడంతో అయోమయానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మానసిక వైద్యుడు అజయ్‌కుమార్ తెలిపారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ( చదవండి: Coronavirus: కోవిడ్ మళ్లీ సోకితే ఏం చేయాలి? ) -
కోవిడ్ ఎఫెక్ట్: మినీ బస్సులను అంబులెన్స్‌లుగా..
నాగపూర్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతిరోజు వేలాదిగా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కానీ అనేక ఆసుపత్రుల్లో బెడ్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ల కొరత అధికంగా ఉంది. ముఖ్యంగా కరోనా బాధితులను ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్‌ల కొరత కూడా తీవ్రంగానే ఉంది. కానీ ఇదే అదను అని భావించిన కొందరు దుర్మార్గులు వ్యాపార ధోరణిని ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అంబులెన్స్ డ్రైవర్లు పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఈ క్రమంలో మహరాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్‌ల కొరతను అధిగమించడానికి వినూత్నంగా ఆలోచించింది. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మినీబస్సులను అంబులెన్స్‌లుగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 25 మినీ అంబులెన్స్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిలో ఆక్సిజన్ సిలిండర్ సహా ఇతర అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ అంబులెన్స్ సేవలు అందరికీ అందించడం కోసం ప్రత్యేక హెల్స్‌లైన్ నెంబర్ 0712 2551417 ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. -
పల్మనరీ ఎంబోలిజంకు గురవుతున్న కరోనా బాధితులు
-
కరోనా మృతురాలి మెడలోంచి పుస్తెలతాడు మాయం..
సాక్షి, జగిత్యాలక్రైం: మృతురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయమైనట్లు కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన సద్దినేని సాయమ్మ కుటుంబ సభ్యులంతా జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం సాయమ్మకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఆస్పత్రి వారు అప్పగిస్తున్న సమయంలో మృతురాలి బంగారు కమ్మలు మాత్రమే అప్పగించారు. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వారిని నిలదీయగా తమ వద్దకు రోగి వస్తున్నప్పుడు మెడలో పుస్తెలతాడు లేదని బుకాయించారు. రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు మాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత
-
ఘోరం: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత
గాంధీనగర్: ఓ బీజేపీ నాయకుడు దారుణానికి పాల్పడ్డాడు. వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడు. తాగించడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి తీరును ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలి వద్దకు బీజేపీ సూరత్ ప్రధాన కార్యదర్శి కిశోర్ బిందల్ వచ్చాడు. పీపీఈ కిట్ ధరించి బీజేపీ కండువా వేసుకుని వచ్చిన అతడు ఓ బాటిల్ తీసుకొచ్చాడు. యాసిడ్ రంగులో ఉన్న ద్రావణం ఆమె నోటిలో పోశాడు. ఆమెకు బలవంతంగా బిందల్ ఆవు మూత్రం తాగించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దాదాపు 80 వేల వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్‌తో పాటు ఘోరంగా తిట్లు.. విమర్శలు రావడంతో దెబ్బకు ఆ వీడియోను బిందల్ తీసేశాడు. అయితే అప్పటికే ఆ వీడియో పలువురు షేర్ చేయడం.. కాపీ చేసుకోవడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ బీజేపీ నాయకుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో కరోనాకు విరుగుడు ఆవుమూత్రం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది నిరూపించేందుకు కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి వివరాలు తెలియడం లేదు. ఏ ఆస్పత్రి? బాధితురాలు ఎవరు? అనేది తెలియడం లేదు. పార్టీ నాయకుడిని ఆస్పత్రిలో కండువా ధరించి ఎలా అనుమతించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైనా ఇప్పుడు వైరలవుతోంది. చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి -
గ్రామంలోనికి అంబులెన్స్ .. కరోనా రోగి పరార్..
సాక్షి,యశవంతపుర(కర్నాటక): గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్‌ను చూసి కరోనా రోగి పారిపోయిన ఘటన హావేరిలో జరిగింది. కాగా, కబ్బూరు తండాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతడు కరోనా సోకిన కూడా బైట స్వేచ్చగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గ్రామస్థులు అతడిని ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలని కోరినా ఏవరి మాట వినలేదు. దీంతో, అతడిని ఎలాగైనా ఆసుపత్రికి తరలించాలని గ్రామస్థులు భావించారు. ఈ క్రమంలో.. స్థానికంగా ఉన్నా ఒక ఆసుపత్రికి సమాచారం అందించారు. అతడిని ఆస్పత్రికి తరలించడానికి గ్రామంలోకి అంబులెన్స్ వచ్చింది. దీనిని గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది, గ్రామస్తులు ఎంత గాలించినా కూడా ఆ వ్యక్తి కనిపించలేదు. -
కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం
దిల్సుఖ్నగర్: సేవయే తమ ధ్యేయమని ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలో నివాసం ఉండే తమ్మనాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తమ్మన శ్రీధర్, లక్ష్మి సుజాతలు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో కరోనా వచ్చిందని తెలిస్తే రోగుల బంధువుల కూడా దగ్గరికి రావడం లేదు. అలాంటిది కరోనా బాధితుల బాధను చూసి వారి ఆకలిని తీరుస్తున్నారు. అది కూడా ఉచితంగా అందిస్తున్నారు. తమ్మనాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బారినపడి ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజనం లేక ఇబ్బంది పడే వారికి లక్ష్మీ సుజాతే స్వయంగా వంట చేసి ఆహారం అందజేస్తున్నారు. ప్రసుత్తం ఆర్కేపురం వాసవి కాలనీలో 35 మంది బాధితులకు ఉచితంగా రోజుకు రెండు పూటలా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు తమకు సెల్ 9441128021లో ఫోన్ చేసి వివరాలు తెలిపితే ఇంటికే భోజనం పంపిస్తామని పేర్కొన్నారు. ( చదవండి: మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..! ) -
40 ఏళ్ల వ్యక్తికి తన బెడ్ ఇచ్చేసిన తాత.. 3 రోజులకే!
ముంబై: భారత్‌లో కరోనా రెండో దశ కరాళ నృత్యం చేస్తోంది. కనివీని ఎరుగని రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క కరోనా బాధితులు కన్నుమూస్తున్నారు. వీరిలో నాకు కరోనా వచ్చింది.. బతుకుతానో లేదో అనే ఆందోళతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో ఆసుపత్రిపాలైన ఓ ముసలాయన 40 ఏళ్ల వ్యక్తికి తన బెడ్ ఇచ్చి గొప్ప మనుసును చాటుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన నారాయణ భావురావ్ దభాద్కర్ అనే వృద్ధుడు ఇటీవల కరోనా బారిన పడి ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే అదే సమయంలో ఆస్పత్రికి ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఏడుస్తూ పరిస్థితి విషమంగా ఉన్న తన భర్తను చేర్చుకోవాలని ఆసుపత్రి అధికారులను వేడుకుంటోంది. కానీ.. బెడ్స్ ఖాళీగా లేవని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాడు దభద్కర్. వెంటనే తన బెడ్‌ను ఆ మహిళ భర్తకు త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం డాక్టర్‌కు చెప్పగా ఆశ్చర్యపోయిన డాక్టర్ ‘ఏం మాట్లాడుతున్నారు మీరు’ అన్నారు. వెంటనే పెద్దాయన ‘అవును మీరు విన్నది నిజమే. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. నా జీవితం మొత్తం గడిపేశాను. ఆమె భర్త చిన్నవాడు. ఆ ఫ్యామిలీ బాధ్యత అతనిదే. అతని పిల్లలకు అతను కావాలి. కాబట్టి నాకు బదులుగా ఈ బెడ్‌ను అతనికి ఇవ్వండి.’ అని దభాద్కర్ ఆసుపత్రి అధికారులకు చెప్పారు. ముసలాయన మాటలు విన్న వైద్యులు, తన పిల్లలు అంగీకరించలేదు. కానీ చివరికి ఒప్పుకున్నారు. నారాయణ కోరిక మేరకు ఆస్పత్రి నిర్వాహకులు. ఓ పేపర్‌పై ‘నేను నా ఇష్టపూర్వకంగానే మరో పేషెంట్‌కి నా బెడ్ ఖాళీ చేసి ఇస్తున్నాను’. అని లిఖితపూర్వక సంతకం తీసుకున్నారు. తరువాత నారాయణ ఇంటికి వచ్చారు. దురదృష్టవశాత్తు మూడు రోజుల తరువాత ఆయన ఆక్సిజన్ శాతం పడిపోయి ప్రాణాలు విడిచాడు. ముసలాయన ఉదారత గురించి తెలుసుకున్న నెటిజన్లు ‘మీరు త్యాగం చేసింది బెడ్ మాత్రమే కాదు.. మీ ప్రాణాలను సైతం త్యాగం చేశారు’ అని ప్రశంసిస్తున్నారు. చదవండి: గుడ్ న్యూస్: ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్ ‘నా భార్యకు గుక్కెడు నీళ్లవ్వలేదు.. వాళ్లే చంపేశారు’ This 85 year old man #NarayanDabhadkar from Nagpur has offered his bed to a young man having said: I'm 85 now have lived my life you should offer the bed to this man, his children need him. pic.twitter.com/2CbfgaIbgu — Akash Chaudhary (@guruguruakash) April 27, 2021 -
రెమిడిసివర్ కోసం మెడికల్ ఆఫీసర్ కాళ్లుపట్టుకున్న మహిళ
లక్నో: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో రోగులకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. యూపీలోని ఒక ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పోందుతున్న బాధితుడికి యాంటి వైరల్ డ్రగ్.. రెమిడిసివర్ లభించలేదు. దీంతో వారి కుటుంబీకులు భయాందోళన చెందారు. అదే సమయంలో అక్కడికి మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓరి వచ్చారు. ఇది చూసిన రోగి బంధువు ఒక్కసారిగా మెడికల్ ఆఫీసర్ పాదాలు పట్టుకుని కన్నీటిపర్యంతమైంది. ఎలాగైనా రెమిడిసివర్ ఇచ్చి తమ వారిని కాపాడాలని అభ్యర్థించింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అక్కడ రోగులందరూ దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ సంఘటన అక్కడ కేసుల తీవ్రత, మందుల కోరత ఏ మేరకు ఉందో తెలియజేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది చాలా బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వివారాలు తెలియాల్సి ఉంది. -
ఆపదలో కుయ్ కుయ్‌మంటూ వచ్చే వాహనాలేవి?
సాక్షి ,నాగిరెడ్డిపేట: ఆపత్కాలంలో కుయ్ కుయ్‌మంటూ వచ్చి ఆదుకోవాల్సిన అంబులెన్స్‌లు జిల్లాలో అంతంతమాత్రంగానే సేవలందిస్తున్నాయి. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్ అవసరం ఉండగా ప్రస్తుతం జిల్లాలోని చాలా మండలాల్లో అంబులెన్స్‌లే లేవు. జిల్లాలో 22 మండలాలుండగా 13 అంబులెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పది మండలాల్లో ఇబ్బందులు.. జిల్లాలోని బాన్సువాడలో రెండు, కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, పిట్లం, బిచ్కుంద, జుక్కల్, బీర్కూర్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, దోమకొండ, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్, మద్నూర్, తాడ్వాయి, బీబీపేట మండలాల్లో 108 అంబులెన్స్‌లు లేవు. ఆయా మండలాల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, అత్యవసరంగా ఎవరినైనా ఆస్పత్రికి తరలించాల్సి వస్తే పక్క మండలాల్లోని అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. పొరుగు మండలంనుంచి అంబులెన్స్ వచ్చేంత వరకు బాధితులు నరక యాతన అనుభవించాల్సిందే.. అంతేకాకుండా ఆ సమయంలో పక్క మండలం అంబులెన్స్ వేరే ఇతర రోగులను తరలించే పనిలో ఉంటే ఇక్కడున్న వారి పరిస్థితి మరీ దారుణం. దీంతో అంబులెన్స్‌లు లేనిప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దాదాపు ప్రైవేట్ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆటోలు, కార్లలో తరలించే సమయంలో క్షతగాత్రులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. కోవిడ్ బాధితుల వ్యథలు.. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. అయితే వారిని ఆస్పత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకినవారిని ఆస్పత్రులకు తరలించడానికి ప్రైవేట్ వాహనదారులెవరూ ముందుకు రావడంలేదు. అంబులెన్స్‌లు అందుబాటులోలేక, ప్రైవేట్ వాహనదారులు ముందుకురాకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ వాహనాల యజమానులు ముందుకు రాకపోవడం వల్ల వారిని కుటుంబ సభ్యులే తీసుకెళ్లాల్సి వస్తోంది. నాగిరెడ్డిపేట మండలంలో 108 అంబులెన్స్ లేదు. శనివారం ఓ కోవిడ్ పేషెంట్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఎల్లారెడ్డి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ బిజీగా ఉండడంతో రాలేమని సమాధానం వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కుటుంబ సభ్యులు బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ( చదవండి: తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు ) -
కృష్ణా జిల్లా: కరోనా రోగి ఆత్మహత్య
-
వెంటిలేటర్‌పై ఉన్నా నీ పాడు బుద్ధి వదులుకోలేవా..
సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏది కూడ తినే పరిస్థితి ఉండదు. ఏది కూడా తినాలనిపించదు. అయితే, ఈ వీడియోలోని సదరు వ్యక్తి మాత్రం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉండికూడా తన చెడు వ్యసనాన్ని వదులుకోలేక పోయాడు. ఇతడు చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతడు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు. అతని శరీరానికి అన్ని పైపులే ఉన్నాయి. కాగా, ఒక నర్సు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని చూస్తొంది. మరోక వ్యక్తి అతని పాదాల వద్ద ఉండి అతడిని గమనిస్తుంది. ఆ సదరు వ్యక్తి మాత్రం తీరిగ్గా.. తన చేతుల్లో ఖైనీ ( తంబాకు) తీసుకొని, చేతిలో వేసుకొని రుద్దుతు తంబాకు తయారు చేయడం చేస్తున్నాడు. ఈ వీడియో.. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. ప్రాణాలు పోతున్నా, చెడు వ్యసనం మాత్రం వదులుకోలేకున్నాడు’ అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. -
బిల్లు కట్టలేదని రోగిని స్టోర్ రూమ్ లో ఉంచిన ఆసుపత్రి వర్గాలు
-
ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి
ముంబై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశంలో మహారాష్ట్రపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా పడిందనే చెప్పాలి. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి వైద్యం కోసం అతని కొడుకు 24 గంటల పాటు రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులను తిరిగినా ఒక్క బెడ్ కూడా దొరకని దయనీయమైన దుస్థితి ఏర్పడింది. చివరకు చేసేదేమిలేక ఆస్పత్రిలో చేర్చుకొని బెడ్ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్ ఇచ్చి చంపమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రోగి కుమారుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన సాగర్ కిశోర్ నహర్షివర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడ్ని అంబులెన్స్‌లో ఉంచి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ కనికరించడం లేదు. మొదట చంద్రాపూర్‌లోని వరోరా హాస్పిటల్‌కు వెళ్లగా, అక్కడ వాళ్లు కుదరదని మరో చోటుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక అక్కడి నుంచి పలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లినా ఏం లాభం లేకపోయింది. చివరకు రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు కూడా వెళ్లినప్పటికీ, అక్కడ సైతం చికిత్స అందించలేకపోయారు. ఇక చేసేదేమిలేక మళ్లీ ఉదయం తిరిగి మహారాష్ట్రకు తిరిగి వచ్చారు. 24 గంటల నుంచి తన తండ్రి అంబులెన్సులోనే ఉన్నాడని కిశోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి చికిత్స అందించడం కోసం చేయని ప్రయత్నం లేదని బాధపడుతున్నాడు. ( చదవండి: మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్డౌన్ ) 24 घंटे चक्कर लगाए, कहीं बेड नहीं! बुज़ुर्ग मरीज़ के बेटे की गुहार, ‘या बेड दो या इंजेक्शन देकर मार दो!’ महाराष्ट्र के चंद्रपुर का हाल. pic.twitter.com/ZzxhlnzdZL — Puja Bharadwaj (@Pbndtv) April 14, 2021 -
దారుణం: అంబులెన్స్‌కు దారివ్వని చంద్రబాబు
నెల్లూరు: అత్యవసర ఆరోగ్య సేవలకు.. ఆపద సమయంలో చిక్కుకున్న వారిని వెంటనే కాపాడేందుకు ఉపయోగపడే అంబులెన్స్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారి ఇవ్వలేదు. ఆయన రోడ్‌షోలో 108 అంబులెన్స్ చిక్కుకుపోయింది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సైరన్ మోగుతున్నా కూడా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు. దీంతో అంబులెన్స్‌లోని ఓ వ్యాధిగ్రస్తురాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పొదలపూడిలో రోడ్ షో చేపట్టారు. పొదలకూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఉషారాణి గుండె సంబంధిత నొప్పితో బాధపడుతుండడంతో ఆమెను తీసుకుని అంబులెన్స్ నెల్లూరులోని ఆస్పత్రికి వెళ్తోంది. ఆస్పత్రి మార్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంబులెన్స్ ఆ మార్గంలో వెళ్లలేక ఇరుక్కుపోయింది. దారి ఇవ్వమని టెక్నీషియన్ (డ్రైవర్)తో పాటు బాధితురాలి కుటుంబసభ్యులు ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. దీంతో అంబులెన్స్‌లోని మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అతికష్టమ్మీద అక్కడి నుంచి అంబులెన్స్ బయటపడింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంబులెన్స్‌కు దారివ్వని వ్యక్తి చంద్రబాబు మానవత్వం లేని మనిషి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘యముండా’ మాస్క్ లేకుంటే తాటతీస్తా చదవండి: లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన చదవండి: లోకేశ్ ఐరన్ లెగ్.. ఎక్కడికెళ్తే అక్కడ మటాశ్ -
అంబులెన్సుకు దారి ఇవ్వని చంద్రబాబు
-
ఆక్సిజన్ పైప్‌తో ఉరివేసుకుని..
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో 81 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య ఆందోళన రేపింది. బాత్రూం లోపల ఆక్సిజన్ పైపుతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ (ఇన్ఛార్జ్) డాక్టర్ కాంచన్ వాంఖడే తెలిపారు. సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుడిని పురుషోత్తం అప్పాజీ గజ్భీగా గుర్తించామని అజ్న పోలీసు అధికారి తెలిపారు. కరోనా బారిన పడటంతో మార్చి 26న పురుషోత్తం ఆసుపత్రిలో చేరారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా సెకండ్‌వేవ్‌లో దేశంలో పలు స్టేట్స్లో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట 3 లక్షల 37 వేలకుపైగా కేసులు, 54 వేలకు పైగా మరణాలతో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రంగా నిలిచింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలో (360 ఐసీయులతో సహా) ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3000 పడకలకు అదనంగా మరో 2269 పడకలను తక్షణమే అందుబాటులోకి తీసుకు రానున్నామని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తాజాగా ప్రకటించారు. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించని పక్షంలో మళ్లీ లాక్డౌన్ విధించక తప్పదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
రికార్డు సృష్టించిన కరోనా వైరస్ పేషంట్!
లండన్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రమైన అనారోగ్యంతో చావును పలకరించి వచ్చారు. వీరంతా రోజులు, మహా అయితే రెండు, మూడు నెలల్లో కోలుకోవటమో.. ప్రాణాలు కోల్పోవటమో జరిగింది. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నం. కరోనా ప్రభావంతో ఏకంగా మూడు వందల రోజులు బెడ్‌కు పరిమితమయ్యాడు. కరోనా కారణంగా అత్యంత ఎక్కువకాలం బాధింపబడ్డ బ్రిటన్ వ్యక్తిగా రికార్డుకెక్కాడు. వివరాలు.. బ్రిటన్‌లోని వెస్ట్ యాక్స్‌కు చెందిన జాసన్ కెక్(49) మార్చి 31వ తేదీన కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడి కిడ్నీలు, ఉపీరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. (మరో రెండు విపత్తులు.. కోటి మరణాలు: బిల్‌గేట్స్) ఇక అప్పటినుంచి సేయింట్ జేమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నడవలేని పరిస్థితుల్లో బెడ్‌కే పరిమితమయ్యాడు. దాదాపు పది నెలలు పాటు ఇన్టెన్సివ్ కేర్ పైకప్పు చూస్తూ గడిపాడు. వైద్యులు తమ శక్తివంచనలేకుండా అతడ్ని కాపాడటానికి ప్రయత్నించి సఫలయ్యారు. అతడి ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడుతోంది. తాజాగా పది నెలల తర్వాత నడవటం మొదలు పెట్టాడు. నర్సుల సహాయంతో జాసన్ నడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా
సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నెలలు తరువాత మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి ఎట్టకేలకు చిరునామా గుర్తుకొచ్చింది. దీంతో ఆయనను ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్(22) చినవాల్తేరులో రోడ్డు పక్కన ఉండడంతో గమనించిన ప్రభుత్వ మానసిక ఆస్పత్రి డాక్టర్ ప్రొఫెసర్ రామానంద శతపతి తన సహచరుని కారులో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. (వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!) జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాయంతో రిసెప్షన్ ఆర్డర్ తేవడంతో పోలీసులు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగి కోలుకోవడంతో తన వివరాలు తెలియజేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్ డీజీపీని సంప్రదించడంతో కుమార్ డిశ్చార్జికి మార్గం సుగమమైంది. ఆస్పత్రి చిరునామా కోసం కుమార్ కుటుంబీకులు ఆస్పత్రి డాక్టర్ని ఆదివారం సంప్రదించారు. అతని కుటుంబ సభ్యులు సోమవారం మానసిక ఆస్పత్రికి వస్తారని డాక్టర్ రామానంద శతపతి ‘సాక్షి’కి తెలిపారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..) -
‘పేషెంట్ చనిపోయారనేది అవాస్తవం’
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగి చనిపోయారనేది అవాస్తవమని ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుష్మా అన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఓ రోగి చనిపోయారని, దీంతో అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వమనేసరికి ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఆస్పత్రిపై దుష్ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా కష్ట సమయంలో ఎంతో శ్రమిస్తున్న వైద్యులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎంతో మంది పేద రోగులు ఆస్పత్రికి వస్తున్నారని, ఇలాంటి సమయంలో తప్పుడు ప్రచారం చేసి వారిని అయోమయంలో పడేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. -
కోమాలోకి వెళ్తే ఏం చేయాలంటే..
కోమా అనేది మరణం వంటి కండిషన్. అందుకు కోమాలోకి వెళ్తే వెనక్కి రారనేది చాలామంది అపోహ. కానీ అది వాస్తవం కాదు. కోమాలోంచి వెనక్కి వచ్చిన కేసులూ చాలా ఎక్కువే. కాకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే రోగి కోమాలోకి వెళ్తే కొన్ని ప్రథమ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ, బీ, సీ అంటూ సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ... ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకునే మార్గంలో అంటే ముక్కు / నోరు దారుల్లో తెమడ / గల్ల వంటిది ఏదైనా ఉంటే దాన్ని గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. బీ – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా చూడాలి. రోగికి ఊపిరి బాగా అందేలా జాగ్రత్తతీసుకోవాలి. సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలి. ఈ మూడు అంశాలతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే... అది కట్టుబడేలా మరీ ఒత్తిడి పడకుండా చూస్తూనే గట్టిగా పట్టుకుని రక్తస్రావం ఆగేలా చూడాలి. కోమాలోకి వెళ్లిన రోగిని గాలి ధారాళంగా వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం చేయవద్దు. ఈ చర్య ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రోగి మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఆల్కహాల్‌తోనూ ‘కోమా’లోకి... మద్యపానం మితిమీరితే కోమాలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది. అందుకే ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఒక్కోసారి ఆల్కహాల్ వల్ల వచ్చే ఫిట్స్‌తో కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల కొన్ని సార్లు కొన్ని విటమిన్లు (ప్రధానంగా థయామిన్) లోపించడం వల్ల కోమాలోకి వెళ్తారు. ఈ కండిషన్‌ను ‘వెర్నిక్స్ ఎన్‌కెఫలోపతి’ అంటారు. వీరికి కేవలం థయామిన్ ఇస్తే చాలు కోమా నుంచి బయటకు వచ్చేస్తారు. ఆల్కహాల్ తాగాక తూలి పడిపోయి తలకు దెబ్బ తగలడం, దాని వల్ల రక్తస్రావం కావడం లేదా రక్తం గడ్డకట్టి కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఇలా కోమాలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఆల్కహాల్ కావడం వల్ల దాన్ని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. -
మళ్లీ ఊపిరి పోశారు!
సాక్షి, హైదరాబాద్: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇ బ్బంది, ఆయాసంతో పాటు కరోనా వైరస్ బారిన పడిన ఓ యువకుడికి నగరంలోని కిమ్స్ వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ భాస్కర్‌రావు, హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్పెషలిస్టు డాక్టర్ సందీప్ అట్టావర్లు చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా బారిన పడిన వ్యక్తికి ఒకే సమయంలో 2 ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చే యడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. దాతది కోల్‌కతా.. స్వీకర్తది చండీగఢ్ పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన రిజ్వాన్ (32) గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్య (సర్కోయిడోసిస్)తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అనేక ఆస్పత్రులను తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆయన హైదరాబాద్ కిమ్స్‌లోని ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అట్టావర్‌ను సంప్రదించాడు. అయితే బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా సర్కోయిడోసిస్‌కు తోడు కరోనా కూడా సోకినట్లు తేలింది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు నిర్ణయించారు. అవయవ మార్పిడి చికిత్సకు రిజ్వాన్ అంగీకరించడంతో అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆగస్టు 24న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి (52) బ్రెయిన్‌డెత్ స్థితికి చేరుకున్నాడు. అతడి అవయవాలు దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న రిజ్వాన్, కిమ్స్ వైద్యులకు ఈ సమాచారం అందింది. అప్పటికే రిజ్వాన్ కోవిడ్‌ను జయించడంతో వైద్యులు చికిత్సకు సిద్ధమయ్యారు. వైద్యులు రెండు బృందాలుగా విడిపోయి.. ఆస్పత్రికి చెందిన వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. వీరిలో ఓ వైద్య బృందం వెంటనే ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్లి దాత శరీరం నుంచి ఊపిరితిత్తులను సేకరించి, అదే రోజు అదే విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. ఆస్పత్రిలో ఉన్న మరో వైద్య బృందం అప్పటికే రోగి ఛాతీని ఓపెన్ చేసి ఉంచింది. డాక్టర్ సందీప్ అట్టావర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 10 గంటల పాటు శ్రమించి రోగికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన కిమ్స్ వైద్యులకు బాధితుడు రిజ్వాన్ కృతజ్ఞతలు తెలిపాడు. -
ఏ మాత్రం జాలి, దయ లేకుండా..
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు ఓ రోగిని వీల్ చైర్లోంచి కిందపడేసిన సంఘటనపై తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు సోమవారం వైద్య, గ్రామీణ ఆరోగ్య సేవల డైరెక్టర్‌కు నోటీసు పంపింది. కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్-పేషెంట్ వార్డులో ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఓ పేషెంట్.. హాస్పిటల్ ఉద్యోగి బాస్కరన్(40)ను, తన మంచం మీదకు వెళ్లడానికి సహాయం చేయమని కోరతాడు. కానీ బాస్కరన్ స్పందించడు. పేషెంట్ పదే పదే ప్రాధేయపడటంతో సదరు ఉద్యోగిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటిది. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ పేషెంట్‌ను వీల్ చైర్లో నుంచి కిందకు పడేస్తాడు. పాపం ఆ వ్యక్తి మంచం మీదకు ఎక్కడానికి నానా అవస్థలు పడతాడు. అంతేకాక బాస్కరన్ అతడిని తిట్టడం వీడియలో చూడవచ్చు. ఈ తతంగాన్ని మరో పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు ఉద్యోగితో పాటు ఆస్పత్రి యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. (5 రూపాయల డాక్టర్ ఇకలేరు) Watch | Tamil Nadu government hospital employee pushes patient from wheel-chair, viral video leads to action. pic.twitter.com/Y3d5yRbbBb — The Indian Express (@IndianExpress) August 18, 2020 అంతేకాక దీని గురించి ఓ తమిళపత్రికలో వార్తా కథనం ప్రచురితమయ్యింది. ఈ క్రమంలో ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి.. నోటిసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆలస్యం చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. -
వారందరికీ సోనూసూద్ విజ్ఞప్తి
ముంబై: సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరు లాగా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ ఒక విజ్ఞప్తి చేశాడు. ఎవరైనా సాయం చేయగలిగిన వారు ఉంటే ఒక రోగిని దత్తత తీసుకోని వారి వైద్య భారాన్ని అంతా మొత్తం భరించాలని కోరారు. అలా చేస్తే పేదరికం సగం పోతుంది అని చెప్పారు. వీలైనంత మంది సాయం చేయాలని అని సోనూసూద్ కోరారు. చదవండి: ‘సోనూ సూద్ పీఎస్4 కావాలి ప్లీజ్’ -
వైరల్: పరోటా కోసం గోడలు దూకాడు..
సాక్షి, చెన్నై : ఆచారిపాలెంలో కరోనా బాధితుడు హల్చల్ చేశాడు. అక్కడ ఉన్న ప్రత్యేక వార్డు నుంచి కరోన బాధితుడు సమీపంలో ఉన్న సుమారు నాలుగు ఇండ్ల కాంపౌండ్ గోడ ఎక్కి దూకి ఓ దుకాణంలో పరోటా పార్సిల్ చేసుకుని వెళ్లే వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. కన్యాకుమారి జిల్లా ఆసారిపళ్లంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో కరోనా సోకిన సుమారు 150 మందికి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆ పాఠశాలలో ఉన్న ఒక అతను గోడ ఎక్కిదూకి సమీపంలో ఉన్న దుకాణంలో పరోటా కొనుక్కుని వచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానికులు శుక్రవారం రాత్రి హఠాత్తుగా ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు సమాధాన పరిచి పంపారు. అతను పాఠశాల కాంపౌండ్ గోడ ఎక్కి అక్కడ ఉన్న సుమారు నాలుగు ఇళ్లలోని కాపౌండ్లలో చొరబడి బయటకు వచినట్టు తెలుస్తోంది. సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో మెయిన్ రోడ్లో ఉన్న ఓ ప్రైవేటు దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో నమోదయినట్టు సమాచారం. (మద్యం బాటిళ్లలో బొద్దింకలు) -
ఒక్క ఫోన్ కాల్‌తో..
-
‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’
సాక్షి, హైదరాబాద్ : ఒక్క ఫోన్ కాల్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’ అంటూ మంత్రిపై బాధితుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో తనను కాపాడిన మంత్రి ఈటలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రఫీ అనే వ్యక్తి గత రెండు రోజుల అనార్యోగానికి గురయ్యాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లాగా, చేర్చుకోను అని చెప్పడంతో ఇంటర్నెట్లో మంత్రి ఈటల ఫోన్‌నెంబర్ చూసి ఫోన్ చేశాడు. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. వెంటనే స్పందించిన మంత్రి, తన పీఏను అలర్ట్ చేయించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అయితే తనను కాపాడిన ఈటలకు జీవితాంతం రుణపడి ఉంటానని రఫీ చెబుతున్నాడు. -
మూడు రెక్కల దేవత
దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్‌లోని లైబి ఓయినమ్‌కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్ను ఇప్పుడు మణిపూర్‌లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు. జూన్ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని తూర్పు ప్రాంతం డ్యూలాలాండ్లో ఒక అంబులెన్స్ ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయిని, ఆమె తండ్రిని దించేసి వెళ్లిపోయింది. ‘మమ్మల్ని ఇంటి దాకా దించుతామన్నారు కదా’ అన్నారు తండ్రీ కూతుళ్లు. ‘ఇక్కడ నుంచి జిల్లా మారిపోతుంది. జిల్లా లోపలి వరకే దించాలి. దాటకూడదని రూలు’ అని వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. తండ్రీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు. ఒకవైపు చూస్తే చీకటి పడుతోంది. అమ్మాయి పేషెంట్. కోవిడ్ బారిన పడి పద్నాలుగు రోజులు ఇంఫాల్‌లోని ప్రసిద్ధ వైద్య సంస్థ జె.ఎన్.ఐ.ఎమ్.ఎస్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యింది. తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. వాళ్లది ఇంఫాల్ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న కాంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామం. అక్కడకు వెళ్లాలి. ఎలా? తండ్రి తన కూతురిని రోడ్డు పక్కన నిలబెట్టి టాక్సీల కోసం పరిగెత్తాడు. మొదట అందరూ వస్తామన్నారు. బేరం చేశారు. తీరా తీసుకెళ్లాల్సింది పేషెంట్‌ని అని తెలిశాక వెనక్కు తగ్గారు. ‘మా అమ్మాయికి కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు లేదు. భయపడకండి’ అని తండ్రి చెప్పినా ఎవరూ వినలేదు. ‘అమ్మో.. మేము రాలేం’ అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ల బాధ చూసిన ఎవరో లైబి ఓయినమ్‌కు ఫోన్ చేశారు. లైబి ఓయినమ్ ఇంఫాల్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్. అంతకు ముందు ఆమె స్ట్రీట్ వెండర్‌గా అవీ ఇవీ రోడ్డు పక్కన అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త ఉన్నా కుటుంబానికి తన సంపాదన ఆధారం. ‘కోవిడ్ పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు వాళ్లు. ‘వారికి అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను’ అంది లైబి. కాని ఆమెకు ఉన్నది ఆటో మాత్రమే. వెళ్లాల్సిన దూరం పెద్దది. అంత దూరం ఆటోలో వెళ్లడం సాధ్యమా? పైగా చీకటి పడిపోయింది. తోడు కోవిడ్ నుంచి బయటపడ్డ అమ్మాయి. రకరకాల ఆలోచనలు వచ్చినా లైబి ధైర్యం చేసి భర్తకు ఫోన్ చేసింది. ‘నాతో తోడురా. బేరం వచ్చింది’ అని చెప్పింది. భర్త ఆమెను చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ తండ్రీ కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ‘పదండి పోదాం’ అన్నారు. లైబి, ఆమె భర్త ముందు కూర్చుంటే వెనుక బాధితురాలు, ఆమె తండ్రి కూచున్నారు. ప్రయాణం మొదలైంది. గంట కాదు... రెండు గంటలు కాదు... ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ఆటోను నడిపింది లైబి. రాత్రి రెండున్నర ప్రాంతంలో పేషెంట్‌ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. ఆమె చేసిన పనికి ఆ కుటుంబం శతకోటి నమస్కారాలు పెట్టింది. లైబి భర్తతో అప్పటికప్పుడు తిరిగి వచ్చేసింది. కాని ఈ విషయం వెంటనే పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. లైబి చేసిన పనిని ఇంఫాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న చాలామంది, ముఖ్యంగా మణిపూర్ వాసులు మెచ్చుకున్నారు. ఆమెకు కానుకగా ఇవ్వడానికి అందరూ డబ్బు పంపారు. అవన్నీ లక్షా పది వేల రూపాయలు అయ్యాయి. వాటిని జూన్ 11న మణిపూర్ సి.ఎం. ఎన్.బిరేన్ సింగ్ ఆమెకు అందజేశాడు. ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు. లైబి ఆ పేషెంట్‌ను దింపి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సూచనల ప్రకారం తన భర్తతో కలిసి క్వారంటైన్లో ఉంటోంది. డిశ్చార్జ్ అయిన కోవిడ్ పేషెంట్‌తో అంత సేపు ఉన్నందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది. మణిపూర్‌లో తొలి మహిళా ఆటో డ్రైవర్ అయిన లైబి మీద రెండేళ్ల క్రితం ‘ఆటో డ్రైవర్’ పేరుతో డాక్యుమెంటరీ తయారైంది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘స్త్రీలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఆమె జీవితం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీ చూసినవాళ్లంతా అన్నారు. ఇప్పుడు తన సేవాభావంతో కూడా ఆమె చాలామందికి స్ఫూర్తి కలిగిస్తోంది. దేవతలు తెల్లటి బట్టల్లో ఉండరని, సాదాసీదా ఖాకీ యూనిఫామ్ వేసుకు తిరుగుతుంటారు లైబిని చూస్తే మనకు అర్థమవుతుంది. శాలువాతో సత్కరిస్తున్న సీఎం. ఎన్.బిరేన్ తనను ఇంటికి చేర్చిన లైబీతో ప్రయాణికురాలు -
బ్లాడర్‌లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!
మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్ హెడ్ ఫోన్ వైర్ ను చూసి విస్తుపోయారు. చివరికి ఆ కేబుల్ ను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్‌ఫోన్ కేబుల్‌ను మింగేశానని చెప్పాడు. దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్‌ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు. “యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్‌ను తొలగించేవారిమని చెప్పారు. -
‘మేము జంతువులమా.. నీళ్లు కూడా ఇవ్వరా?’
లక్నో: తమకు సరైన ఆహారం, తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వడంలేదంటూ కరోనా పేషంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కొత్వా బన్సి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో ఎల్1 కేటగిరికి చెందిన ఓ కరోనా పేషెంట్ తమ పరిస్థితి జంతువుల కంటే హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘మేము జంతువులమా.. మాకు కనీసం నీళ్లు కూడా ఇవ్వరా’ అంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ‘ఆహారం సరిగా పెట్టడం లేదా’ అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తే.. ‘లేదు కచ్చపచ్చగా ఉడకేసి ఇస్తున్నారు’ అని తెలిపాడు. అంతేకాక ‘మీ దగ్గర డబ్బు లేకపోతే చెప్పండి.. మేం ఇస్తాం. అంతేకాని ఈ పరిస్థితులు ఇలానే కొనసాగతే మేం ఇంటికి వెళ్లి పోతాం. అధికారులతో చెప్పండి’ అంటూ సదరు పేషెంట్ ఆందోళనకు దిగాడు. అతడికి ఇతర రోగులు మద్దతు తెలిపారు. (మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది) గురువారం ఉదయం ఆస్పత్రిలో రెండు గంటల పాటు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు స్పందించకపోవడంతో పేషెంట్లు ఇలా నిరసనకు దిగారు. దీని గురించి ప్రయాగ్‌రాజ్ చీఫ్ మెడికల్ అధికారిని ప్రశ్నించగా.. ‘విద్యుత్ లోపంతో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రీషియన్‌ను పిలిచి రెండు గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించాము. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో నీరు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. కాని రోగులు స్నానానికి మంచినీటిని ఉపయోగిసస్తారు. ఫలితంగా ఈ సమస్య తలెత్తింది. మేము వారి సమస్యను వెంటనే పరిష్కరించాము’ అని తెలిపారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి, ఆస్పత్రిపై దాడి
కోల్‌కతా: ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అక్తరి బేగం అనే మహిళను ఆమె కుటుంబసభ్యులు గురువారం రాత్రి కమర్హతిలోని సాగోర్ దత్తా ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది గంటలలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రిపై దాడికి దిగారు. అత్యవసర వార్డులోని కిటికీలు పగలగొట్టి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందించలేదు. -
కరోనాపై తొలి విజయం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నమోదైన కరోనా తొలి బాధితుడిని మంగళవారం డిశ్చార్జి చేశారు. మధ్యాహ్నం 2గంటలకు ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు డిశ్చార్జి చేశారు. మార్చి 17న కరోనా లక్షణాలతో ఛాతీ ఆస్పత్రిలో చేరిన 65 ఏళ్ల వృద్ధుడు మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా సోకినట్లు నిర్థారించిన విషయం తెలిసిందే. ఐసోలేటెడ్ వార్డులో సేవలందిస్తూనే మూడు సార్లు రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. మొదటిసారి పాజిటివ్ వచ్చిన తర్వాత రెండు సార్లు నెగిటివ్ రావడంతో డిశ్చార్చి చేశారు. యంత్రాంగం పటిష్టమైన చర్యలు మార్చి 19న అల్లిపురానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టింది. (పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్) ఆయన మక్కా నుంచి వచ్చిన తరువాత సన్నిహితంగా మెలిగిన వారు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి 11 మంది అనుమానితులను ఛాతీ ఆస్పత్రికి, విమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. వారందరికీ రక్త పరీక్షలు చేశారు. అందులో అందరికీ నెగిటివ్ వచ్చినప్పటికీ భార్యకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు మాట్లాడుతూ అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఇంటికి పంపించేశామని, 14 రోజులపాటు హోం క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. -
కరోనా సోకిందని ఆత్మహత్య
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు బ్లాక్‌నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఏయిర్‌పోర్టులో ఓ 35ఏళ్ల వ్యక్తిని కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో అధికారులు అక్కడినుంచి తరలించారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సఫ్దార్జంగ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. రక్తపు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. అయితే రిపోర్టు రాకమునుపే అతడు తనుంటున్న 7వ అంతస్తు బ్లాక్‌నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, పంజాబ్‌కు చెందిన అతడు గత సంవత్సరకాలంగా సిడ్నీలో ఉంటున్నాడని, ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీ చేరుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చదవండి : కరోనా : ఒక్కరోజే 475 మంది మృతి తారలు ఇంటికే పరిమితం -
విద్యార్థి త్యాగం.. ఓ మనిషి ప్రాణం..!
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి క్యెంగ్ గ్రా మానికి చెందిన విద్యార్థి అరుణ్‌కుమార్ చేసిన త్యాగం.. ఓ మనిషి ప్రాణాన్ని కాపాడింది. తన చదువు ఖర్చుల కోసం తల్లిదండ్రులు పంపించిన సొమ్మును నిస్సహాయ స్థితిలో ఉన్న అంబ గుడకు చెందిన క్షతగాత్రుడు వాసుదేవ్ ముదులికి అందజేసి ప్రాణాపాయం నుంచి అతడిని ఆదుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, వైద్యసేవల నిమిత్తం మత్తిలి ఆస్పత్రిలో చేరిన వాసుదేవ్‌కు వైద్య పరీక్షలు జరిపిన అక్కడి వైద్యులు బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, కొరాపుట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వైద్యులు సిఫారసు చేసిన ఆస్పత్రికి క్షతగాత్రుడి ని తరలించేందుకు కావాల్సిన డబ్బులు కూడా లేకపోవడంతోబాధిత కుటుంబ సభ్యులు బిక్క ముఖాలు వేసుకుంటూ అక్కడే తచ్చాడుతున్నారు. ఇదే విషయం తెలుసుకున్న అగ్రికల్చర్ విద్యార్థి అరుణ్‌కుమార్ పెద్దమనసుతో స్పందించి, మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తన తల్లి దండ్రులు తనకు ఇచ్చిన రూ.5 వేలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాసుదేవ్ పరి స్థితి కాస్త నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పుడు విద్యార్థి సహాయ సహకారా లు గురించి తెలుసుకున్న స్థానికులు, విద్యార్థి కుటుంబ సభ్యులు, సహచరులంతా విద్యార్థిని తెగ అభినందిస్తున్నారు. -
రక్తదాతల కోసం ఎదురు చూపులు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : నెగటివ్ గ్రూపు కలిగిన రక్త దాత దొరకాలంటే అనేక అగచాట్లు పడాల్సి వస్తోంది. అలాంటిది ఒకే వ్యక్తికి 30 యూనిట్ల నెగిటివ్ గ్రూపు రక్తం కావాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. సహృదయంతో ఆ గ్రూపు కలిగిన దాతలు ముందుకు వస్తే తప్ప ఇంత పెద్ద మొత్తంలో రక్తాన్ని సేకరించలేం. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన హుస్సేన్‌బాషా అనే 20 ఏళ్ల యువకుడు బ్లడ్ సర్కులేషన్ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు చికిత్స సమయంలో నెల రోజుల పాటు రోజుకు ఒక బ్యాగ్ చొప్పున 30 బ్యాగుల రక్తం ఎక్కించాలని తెలిపారు. అతడిది ఏ నెగిటివ్ రక్తం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందసాగారు. బ్లడ్ బ్యాంకుల నుంచి తెచ్చిన రక్తాన్ని స్విమ్స్ ఆస్పత్రి లో అనుమతించరు. నేరుగా డోనర్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు కలిగిన దాతల కోసం హుస్సేన్‌బాషా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. దాతలు 9390819132 అనే నంబర్‌కు ఫోన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మధ్య తర గతి కుటుంబానికి చెందిన హుస్సేన్‌బాషా కు టుంబ సభ్యులకు చిన్న పాటి ఖర్చులు భరాయించే స్థోమత కూడా లేదు. ఆస్పత్రిలో రో జు వారి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. దాతలు స్పందించాలని వారు కోరుతున్నారు. -
రోగిగా వచ్చి వైద్యుడికి మస్కా
సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యం బాగోక ఆస్పత్రికి వెళితే.. టెస్టులు.. స్కానింగ్‌లు.. ఇంకా ఏవేవో పేరుతో వైద్యులు, ఆస్పత్రులు రోగిని నిండా ముంచుతారని చాలామంది అనుకుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం రోగిగా ఆస్పత్రికి వచ్చి వైద్యుడునే నిండా ముంచేశాడు. ఈ ఉదంతం నగరానికి చెందిన డాక్టర్ జీఎన్ రావు విషయంలో సీన్ రివర్స్ అయింది. హృద్రోగిగా వచ్చి, శస్త్రచికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి తన స్నేహితుడిని తీసుకువచ్చి పరిచయం చేశాడు. ముగ్గురం కలిసి పశ్చిమ బెంగాల్లో వ్యాపారం చేద్దామంటూ వైద్యుడి నుంచి రూ.1.4 కోట్లు కొల్లగొట్టారు. నకిలీ వర్క్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేయడంతో విషయం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) వద్దకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు గురువారం ఓ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు.మరో నిందితుడు తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో అతడినికి నోటీసులు జారీ చేశారు. అసలు కథ ఇదీ.. నగరానికి చెందిన డాక్టర్ జి.నాగశయన రావు ఓ ప్రముఖ ఆస్పత్రిలో సీటీ సర్జన్‌గా (హృద్రోగ వైద్యుడు) పనిచేస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీతాంబరం ఈయన వద్దకు రోగిగా వచ్చారు. అప్పట్లో డాక్టర్ రావు ఇతడికి బైపాస్ సర్జరీ చేశారు. పీతాంబరం కుమార్తె కూడా వైద్యురాలు కావడంతో వీరిద్దరి మధ్యా పరిచయం పెరిగి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు పీతాంబరం తన స్నేహితుడైన నల్లగొండ వాసి గురు పట్టాభిరామన్ చామర్తిని డాక్టర్ నాగశయనరావుకు పరిచయం చేశారు. ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి సదరు డాక్టర్‌ను టోకరా వేయాలని ప్లాన్ వేశారు. దీనికోసం ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన(పీఎంకేవై) పథకం కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విభాగానికి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యాపారం చేద్దామంటూ నమ్మబలికారు. పెట్టిన పెట్టుబడిపై ప్రతి నెలా 24 శాతం లాభం చొప్పున కేవలం ఆరు నెలల్లోనే పెట్టుబడికి రెట్టింపు దాటి ఆదాయం వస్తుందని నమ్మించారు. దీనికి ఆకర్షితుడైన వైద్యుడు ఆసక్తి చూపడంతో ముగ్గురూ కలిసి అన్నపూర్ణ ఆగ్రో బయోటెక్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. తమకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి డాక్టర్ పరితోష్ భట్టాచార్య, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ పిజోష్ కాంతి ప్రమాణిక్ వర్క్ ఆర్డర్లు ఇచ్చారంటూ ఆ ఇద్దరూ నాగశయనరావుకు చెప్పారు. అందుకు ఆధారాలుగా కొన్ని ఫోర్జరీ పత్రాలను సైతం చూపించారు. ఆ ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తులు సేకరించాల్సి ఉందని చెప్పిన ఈ ద్వయం డాక్టర్‌ను భారీ మొత్తం పట్టుబడిగా కోరింది. దీంతో ఆయన వివిధ దఫాల్లో మొత్తం రూ.1.4 కోట్లు పట్టాభిరామన్ ఖాతాల్లోకి బదిలీ చేశారు. డబ్బు తీసుకుని మోసం.. ఈ మొత్తం స్వాహా చేసిన ఇద్దరూ ఆపై వైద్యుడు ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. వీరికోసం నాగశయనరావు దాదాపు ఏడాదిన్నర పాటు ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో ఆయన రెండు నెలల క్రితం సీసీఎస్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఎఫ్–డివిజన్ ఏసీపీ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.మనోజ్‌కుమార్ ఈ కేసు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి ప్రధాన నిందితుడైన పట్టాభిరామ్ ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. అతడి కదలికపై పూర్తి నిఘా ఉంచిన అధికారులు బుధవారం నగరానికి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే దర్యాప్తు అధికారులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. ఇతగాడు ఈ పంథాలో ఇంకా అనేక మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్న సీసీఎస్ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న పీతాంబరం ఆచూకీని దర్యాప్తు అధికారి కనిపెట్టారు. అయితే, అతడు పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యానికి లోనైనట్టు తేలింది. దీంతో పీతాంబరాన్నీ నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41–ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అభియోగపత్రాలు దాఖలు చేస్తామని సీసీఎస్ పోలీసులు తెలిపారు. -
స్పందించిన పోలీస్ హృదయం
సాక్షి, సిటీబ్యూరో: వర్షం నీటిలో చిక్కుకున్న ఓ రోగిని..స్వయంగా తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి తరలించాడో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. శుక్రవారం భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డు వెళ్లే దారిలో వర్షపు నీరు నిలిచిపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన తన తండ్రిని తీసుకుని బండిపై వెళ్తుండగా...మధ్యలోనే టూ వీలర్ ఆగిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు విషయం గమనించి ఆ రోగిని తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి వైరల్ చేశారు. సీఐ మానవతా హృదంతో స్పందించిన తీరును పలువురు ప్రశంసించారు. -
మానవత్వం చాటుకున్న సిఐ
-
సీఎం చొరవతో ఇంటికి వస్తాడనుకున్నాం..
సాక్షి, జ్ఞానాపురం(విశాఖ దక్షిణం): బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నీరజ్‌కుమార్ మృతితో జ్ఞానాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో అందిన చికిత్సతో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న నీరజ్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆదివారం కాన్వెంట్ కూడలి శ్మశానవాటికలో నీరజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. జ్ఞానాపురం బాబు కాలనీకి చెందిన నీరజ్‌కుమార్ టెన్త్ వరకు రవీంద్రభారతి పాఠశాలలో చదువుకున్నాడు. 2017–18 టెన్త్‌లో 9.5 జీపీఏతో ఉత్తమ విద్యార్థిగా మంచిపేరు సంపాదించుకున్నాడు. నీరజ్ తండ్రి అప్పలనాయుడు పూర్ణామార్కెట్‌లో కలాసీ తల్లి దేవి గృహిణి సోదరుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. కుమారులను ఉన్నత చదువులు చదివించాలని తపన పడ్డారు. అయితే నీరజ్‌కు బ్లడ్ క్యాన్సర్ రావడంతో వారి ఆశల అడియాసలయ్యాయి. మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్తోమత వారికి లేదు. దీంతో గత నెల 4న విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయం వద్ద నీరజ్ స్నేహితులు పరిస్థితి వివరించారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇవ్వడంతో వారి ఆశలు చిగురించాయి. ఈ మేరకు వైద్యం కూడా అందించారు. వైద్యులు పొట్టన పెట్టుకున్నారు! మరో మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తాడనుకున్న తమ కుమారుడు నీరజ్‌ను వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విగతజీవిని చేసి పంపారని ఆయన తల్లిదండ్రులు ఆరోపించారు. డిశ్చార్జి అయి తమతో ఎప్పటిలాగే తిరుగుతాడని అనుకున్న స్నేహితులు, కాలనీవాసులు, కుటుంబ సభ్యులు.. నీరజ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. డాక్టర్ హరికృష్ణ, భాస్కర్లు చికిత్స చేసేవారని, శనివారం డాక్టర్ డొక్క ప్రదీప్ హంగమా చేసి ఆక్సిజన్ అందలేదంటూ తమ కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని, ఆయనపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు. -
బెడ్‌షీట్‌పై పేషెంట్‌ను లాక్కెళ్లారు..
జబల్పూర్ : మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదవారికి ఏ రకమైన వైద్యం అందుతుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్‌లో ఓ పేషెంట్‌కు ఎక్స్ రే తీయించాలని వైద్యులు తెలిపారు. అయితే సిబ్బంది పేషెంట్‌ను ఎక్స్ రే రూమ్‌కు బెడ్‌షీట్‌పై లాక్కుని వెళ్లారు. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్లు లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు అక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో సిబ్బంది, అధికారుల తీరుపై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. దీంతో మెడికల్ కాలేజ్ డీన్ నవనీత్ సక్సేనా ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బెడ్‌షీట్‌పై పేషెంట్‌ను లాక్కెళ్లారు..
-
నిమ్స్ వైద్యుడిపై దాడి
సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రి వైద్యునిపై రోగి బంధువులు దాడికి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు నిరసనగా రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేపట్టారు. బాధితుడు, సీఎంఓ డాక్టర్ అన్వేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం 4.30 ప్రాంతంలో ఓ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన నిఖిల్ అనే యువకుడు చికిత్స నిమిత్తం నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చిడు. అతనితోపాటు మరో 15 మంది వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సీఎంఓ డాక్టర్ అన్వేష్, రెసిడెంట్ డాక్టర్ అనీస్ ఫాతిమా అతడికి ప్రథమ చికిత్స నిర్వహించి సీటీ స్కాన్‌కు పంపుతుండగా...వారి వెంట వచ్చిన యువకుల్లో ఒకరు ఎంతసేపు వైద్యం చేస్తారంటూ తమతో అకారణంగా గొడవకు దిగారన్నారు. తమకు నగరంలోని ఒక ముఖ్య నేత అండ ఉందని దుర్భాషలాడుతూ తనను నెట్టినట్లు తెలిపాడు. దీంతో ఆగ్రహానికి లోనైన రెసిడెంట్ డాక్టర్లు ఆస్పత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ అత్యవసర విభాగం ఎదుట ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గౌతం, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ఆస్పత్రి వద్ద 260 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరం ఉండగా..కేవలం 60 మందితో కాపలా చేపడతున్నారన్నారు. ఆసుపత్రి యాజమాన్యం తమకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. గతంలోనూ రెండు సార్లు వైద్యులపై దాడులు జరిగాయని, తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ఘటనపై వైద్యురాలు అనీస్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావ్, సీఐ మోహన్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను శిక్షించాలి: బొంతు శ్రీదేవి నిమ్స్ వైద్యునిపై దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం ఆమె వైద్యులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు నిందితులు సందీప్, సుశీల్, విజయ్ లను సోమవారం రాత్రి పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. -
సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రిలో రోగి భందువులు ఆందోళన
-
సిటీ కో–బ్రాండ్‌తో పేటీఎం క్రెడిట్ కార్డ్
ఈ–కామర్స్ కంపెనీ పేటీఎం.. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటీతో కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశ పెట్టింది. ఈ కార్డ్ పరిమితి లక్ష రూపాయిలు కాగా, ప్రతి కొనుగోలుపై ఒక శాతం క్యాష్‌బ్యాక్, రూ.50,000 లావాదేవీలు దాటితే వార్షిక ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేటీఎం చైర్మన్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వివరించారు. సాధారణ వినియోగదారులకు వార్షిక ఫీజు రూ.500 వసూలు చేయనున్నట్లు తెలిపారు. క్రెడిట్ కార్డుల సేవలను మరింత విస్తరించడంలో భాగంగా పేటీఎంతో కలిసి సేవలందిస్తున్నట్లు సిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ స్టీఫెన్ బర్డ్ అన్నారు. -
లోగుట్టు ఏమైనట్టు?
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏదైనా ఊహించని ఘటన జరిగినప్పుడు హడావుడిగాకమిటీలు వేయడం.. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణల పేరుతో సాగదీయడం వైద్య ఆరోగ్యశాఖలో పరిపాటిగా మారింది.ఒక వేళ ఫలానా ఘటనకు ఫలనా వైద్యుడు, అధికారి బాధ్యుడని కమిటీ రిపోర్టులో స్పష్టం చేసినా పట్టించుకున్నది లేదు.. చర్యలు తీసుకున్నదీ లేదు. రోగుల జీవితాలతో ఆడుకుంటున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే ఆయా ఘటనలపై కమిటీలు సమర్పించిన నివేదికలను బుట్టదాఖలు చేస్తుండటంపై అనేక అనుమానాలు, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడుపులో కత్తెర మరిచినా.. ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యుల నిర్వాకం ఇది. ఇటీవల ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు సర్జరీ చేశారు. తర్వాత తరచూ ఆమెకు కడుపునొప్పి వస్తుండటంతో మళ్లీ ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యలు సర్జరీ సమయంలో కడుపులో కత్తెర మరిచినట్లు గుర్తించి.. వెంటనే ఆమెకు మరోసారి సర్జరీ చేసి కడుపులోని కత్తెర తొలగించారు. దాంతో రోగికి ప్రాణాపాయం తప్పింది. ఈ అంశం పెద్ద సంచలనంగా మారడంతో ఆస్పత్రి పాలకవర్గం ముగ్గురు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. కడుపులో కత్తెర మరిచిన ఘటనకు ఓ నర్సును బాధ్యురాలిని చేసి.. సర్జరీ చేసిన వైద్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఆస్పత్రిలో ఇటీవల ఓ యువ వైద్యుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. న్యూరాలజీ విభాగాధిపతి వేధింపులే ఇందుకు కారణమని, సంబంధిత వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ డాక్టర్లంతా ఆందోళనకు దిగారు. నిజనిర్థారణ కోసం నిమ్స్ డైరెక్టర్ ఓ అత్యున్నత స్థాయి కమిటీ వేశారు. సంబంధిత కమిటీ యువ వైద్యుడి మృతికి దారితీసిన అంశాలపై సమగ్ర రిపోర్టు అందజేసింది. రెసిడెంట్ వైద్యుల సంరక్షణ కోసం సంస్థాగతంగా చేపట్టాల్సిన పలు చర్యలను సూచించింది. కేసు నుంచి బాధ్యులను తప్పించడమే కాకుండా కమిటీ సిఫార్సుల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పిల్లలు తారుమారైనా..తల్లులు చనిపోయినా.. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు సర్జరీ వికటించింది. దీంతో ఆమెను ఉస్మానియాకు తరలించడంతో ఆమెకు అక్కడి వైద్యులు ప్రాణం పోశారు. ఇక సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో తరచూ పిల్లలు మారుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు కారణమైన వైద్య సిబ్బందిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నది లేదు. నిలోఫర్ ఆస్పత్రిలో రెండున్నరేళ్ల క్రితం ఆరుగురు బాలింతలు మృతి చెందారు. ఈ అంశంపై అప్పట్లో అసెంబ్లీ వేదికగా పెద్ద దుమారమే రేగింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కమిటీ రిపోర్టు ఇచ్చినా.. ఇప్పటి వరకు సంబంధిత వైద్యులపై చర్యలు లేవు. పారాసిటమాల్‌కు బదులు ‘ట్రెమడాల్’ ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయించుకున్న శిశువులకు పారసిటమాల్‌కు బదులు ట్రెమడాల్ మాత్రలు ఇచ్చి ఇద్దరు శిశువుల మృతికి, మరో 37 మంది శిశువుల అస్వస్థతకు కారణమయ్యారు. అప్పట్లో ఈ అంశాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రాధమిక నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ సహా ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్లను సస్పెండ్ చేశారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తుకు కమిటీ వేయగా నివేదిక అందజేసింది. వాక్సినేషన్‌పై సిబ్బందికి శిక్షణ ఇప్పించడంలోనూ, వాక్సినేషన్ తీరును పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క రెగ్యులర్ అధికారిపై కానీ వైద్యుడిపై గానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. 16 మంది కంటిచూపు దెబ్బతిన్నా.. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స వికటించి 16 మంది కంటిచూపు పోయింది. ఆర్ఎల్ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ వాటర్‌తో కళ్లను శుభ్రం చేయడం వల్లే కంటిచూపు దెబ్బతిన్నట్లు స్పష్టమైంది. సెలైన్వాటర్తో కళ్లను శుభ్రం చేసి, రోగుల చూపును కోల్పోవడానికి కారణమైన వైద్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వైద్యులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే వైద్యుల తప్పిదాలను కప్పిపు చ్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉస్మానియా ఆస్పత్రిలో ఒకరికి బదులు.. మరొకరు విధులు నిర్వహిస్తుండటం, చాలామంది ఉద్యోగులు ఆస్పత్రికి రాకుండానే వచ్చినట్లు సంతకాలు చేసి నెలసరి వేతనాలు పొందుతుండటంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. -
కుట్లేశారు.. కత్తెర మరిచారు..
హైదరాబాద్/ సోమాజిగూడ: నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఇటీవల ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేసి కత్తెరను కడుపులోనే మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి తరపు బంధువులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయడంతోపాటు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసిన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నిమ్స్ ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సక్సెస్.. కానీ! హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన వ్యాపారి హర్షవర్దన్ భార్య మహేశ్వరి (33) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను అక్టోబర్ 30న నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు చూపించారు. మహేశ్వరిని పరిశీలించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ జగన్మోహన్రెడ్డిలు.. హెర్నియాతో ఆమెకు కడుపునొప్పి వస్తోందని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు. నవంబర్ 2న ఈ ఇద్దరు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా.. సర్జరీ చేసిన కత్తెరను కడుపులో మరిచిపోయి కుట్లు వేశారు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. రోగి కోలుకోవడంతో నవంబర్ 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సర్జరీ జరిగి మూడునెలలైనా.. తరచూ కడుపునొప్పి వస్తుండటంతో బాధితురాలి కుటుంబం శుక్రవారం రాత్రి మళ్లీ నిమ్స్ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్సరే తీయించగా, పొత్తి కడుపులో సర్జికల్ కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలియడంతో మహేశ్వరి భర్త, బంధువులు నిమ్స్ పరిపాలనాభవనం ముందు ఆందోళనకు దిగడంతో విషయం బయటికి పొక్కింది. ఈ ఆందోళనతో అప్రమత్తమైన వైద్యులు రోగికి మళ్లీ సర్జరీ చేసి కడుపులోని కత్తెరను బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. నిమ్స్ వైద్యులు నిర్లక్ష్యపూరిత వైఖరిపై రోగి తరపు బంధువులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ నివేదిక అందజేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రోగికి సర్జరీ చేసే ముందు, ఆ తర్వాత.. ఆపరేషన్‌లో వినియోగించిన వైద్య పరికరాలు, ఇతర వస్తువులు లెక్కిస్తారు. బ్లేడ్స్, కత్తెర, కాటన్ బెడ్స్, ఇతర సర్జికల్ ఐటమ్స్‌ను విధిగా లెక్కించి, అన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కుట్లు వేస్తారు. కానీ నిమ్స్ ఆసుపత్రిలో ఇలాంటివేవీ జరగకుండానే పని పూర్తి చేస్తారనే ఆరోపణలున్నాయి. దురదృష్టకరం రోగి కడుపులో సర్జికల్ కత్తెర ఉంచి కుట్లు వేయడం దురదృష్టకరం. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడిన వారెంతటివారైనా ఉపేక్షించబోం. బాధ్యులను గుర్తించేందుకు ఆస్పత్రి డీన్, మెడికల్ సూపరింటిండెంట్, ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్‌తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే సదరు వైద్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ బాధ్యులపై చర్యలు తీసుకోండి నిమ్స్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్న వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – హర్షవర్థన్, బాధితురాలి భర్త -
భక్తితో వణికిన గుండె
ఇజ్రాయెల్ దేశంలోని ఎరికో పట్టణంలో జక్కయ్య అనే ధనికుడు ఉన్నాడు. పన్ను వసూళ్ల అధికారిగా తన ధనాన్ని రెట్టింపు చేసుకున్నాడనే కోపంతో ‘పాపి’ అనే ముద్ర కూడా అతనికి వేశారు స్థానికంగా ఉన్న యాజకులు, పరిసయ్యలు. ఆ రోజు తన పట్టణానికి యేసుప్రభువు వస్తున్నాడని విన్న జక్కయ్య ఆనంద తరంగమయ్యాడు. ఎందుకంటే యేసు గురించి అతడు ఎన్నో అద్భుతాలు విని ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రం ఉదయించిందని, దేవదూతలు గాన ప్రతిగానాలతో ఆయన జననాన్ని ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమానంగా ప్రకటించారని విన్నాడు. ఆయన తన యవ్వన ప్రారంభం నుండే గొప్పæఆచరణీయ విషయాలు బోధించడమేగాక, ప్రజల వ్యాధి బాధల్ని నయం చేస్తున్నాడని, దురాత్ములను గద్దించి, ఆయా వ్యక్తుల్ని విడుదల చేస్తున్నాడని, చనిపోయిన వాళ్లకు సైతం పునరుజ్జీవం చేస్తున్నాడని, గాలిని, తుఫానులను, సముద్రాన్ని గద్దించి, నిమ్మళపరిచి, ప్రకృతిని శాసించాడనీ.. ఇలాంటి ఎన్నో సంగతులు విన్నప్పుడు జక్కయ్య గుండె వణికింది. అప్పటినుండి యేసును చూడాలనే కోరిక రోజురోజుకు ఎక్కువవుతుండగా, ఆ రోజు వాళ్ల ఊరికే ఆయన వస్తున్నాడని విని, ఆయన రాబోయే బాటకు పరుగుపెట్టాడు. తనేమో పొట్టివాడు. క్రీస్తుప్రభువు చుట్టూ పెద్ద జన సందోహముంటుంది. ఆయన్ని ఎలా చూడగలడు? ఆ బాట పక్కనే ఓ చెట్టును చూశాడు. వెంటనే చెట్టెక్కి, ఆయన్ని చూడగలిగిన చోటులో కూర్చున్నాడు. తన ధనం అధికార హోదా, వయసు.. ఏవీ అడ్డురాలేదు. అంతలోనే పెద్ద జన సమూహం వచ్చేసింది. జక్కయ్య లేచి నిలబడి, ఆందోళనగా క్రీస్తు కోసం వెదుకుతున్నాడు. చెట్టుకింది నుండి ఎవరో తనని పిలుస్తున్నారు. ‘‘జక్కయ్యా, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను’’ అని వినిపించింది. ‘ఆయనే యేసయ్య’ అని ఎవరో అన్నారు. గడగడలాడుతూ బిరబిరా చెట్టు దిగాడు జక్కయ్య. ప్రశాంతమైన, వాత్సల్యపూరితమైన ఆయన మోము చూశాడు. కళ్లలో కదలాడుతున్న కరుణను చూశాడు. అంతే! యేసయ్య పాదాజీపై పడ్డాడు. ‘‘ప్రభూ! నా ఆస్తిలో సగం పేదలకిస్తాను, నేనెవరి వద్ద అన్యాయంగా తీసుకున్నానో, వాళ్లకు అంతకు నాలుగింతలు ఇచ్చేస్తాను. నా తప్పులన్నింటినీ మన్నించండి స్వామీ’’ అంటూ ప్రభువు పాదాలను కన్నీటితో కడిగాడు. ఆ పూట తన ఇంటిలో పెద్ద విందు చేశాడు జక్కయ్య. ‘‘ఈయన పాపులతో కలిసి తింటున్నాడు’’ అన్న పరిసయ్యలకు ప్రభువిచ్చిన జవాబు.. ‘రోగికే కదా వైద్యుడు కావాలి, నశించిన దానిని వెదికి, రక్షించేందుకే నేను వచ్చాను’ అని! – ఝాన్సీ కేవీకుమారి -
ఈ రిమోట్ ‘ఆపరేషన్’ అద్భుతం!
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్టు, గుజరాత్‌కు చెందిన డాక్టర్ తేజస్ పటేల్ అత్యాధునిక టెక్నాలజీతో గుండె ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించారు. 32 కి.మీ. దూరంలో ఉన్న ఒక మహిళా రోగి గుండెకు రోబోటిక్ టెక్నాలజీ వినియోగించి స్టెంట్ వేశారు. ఇలా రోగికి అంత దూరం నుంచి కూడా సర్జరీ చేయడం, దానికి రోబోటిక్ మొబైల్ టెక్నాలజీ వినియో గించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన సర్జరీకి గుజరాత్ గాంధీనగర్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అక్షర్ధామ్ వేదికైంది. సర్జరీ ఎలా చేశారంటే.. గుజరాత్‌కు చెందిన ఒక మహిళా రోగి గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాల్ని తొలగించి, స్టెంట్ వేసే ఆపరేషన్‌ను డాక్టర్ తేజస్ పటేల్ తానున్న చోటు నుంచి కదలకుండానే చేశారు. అహ్మదాబాద్‌లో ఒక ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌కి ఆ రోగిని తీసుకువచ్చారు. ఆపరేషన్ థియేటర్లోని కాథ్ ల్యాబ్‌లో ఉన్న రోబో చెయ్యిని.. అక్షర్‌ధామ్‌లో డాక్టర్ వద్ద ఉన్న కంప్యూటర్‌తో అనుసంధానం చేశారు. ఎదురుగా ఒక స్క్రీన్‌పై రోబో చెయ్యి, మరో స్క్రీన్‌పై పేషెంట్, ఇంకో స్క్రీన్ మీద రోగి బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ వంటి వివరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్నెట్ ద్వారా రోబో చెయ్యిని ఆపరేట్ చేస్తూ ఆ రోగి గుండెకి విజయవంతంగా స్టెంట్ వేశారు. ఈ టెక్నాలజీని టెలీ రోబోటిక్స్ అని పిలుస్తారు. టెలిమెడిసన్, రోబోటిక్స్ టెక్నాలజీని కలగలిపి వినియోగించడం వల్ల నిపుణులైన డాక్టర్లు మారుమూల గ్రామాలకు వెళ్లకుండానే ఇలాంటి సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీని చూడడానికి అక్షరధామ్‌కు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స గుజరాత్‌కు గర్వకారణమని వ్యాఖ్యానించారు. డాక్టర్ తేజస్ వంటి అనుభవజ్ఞుల సేవల్ని ఈ టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు చేపడతామని చెప్పారు. భవిష్యత్ టెలి రోబోటిక్స్‌దే.. అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు రోబోటిక్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆపరేషన్‌ను 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను వినియోగించి నిర్వహించారు. ఇక 5జీ టెలికామ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఈ తరహా ఆపరేషన్లు ఎక్కువగా జరిగే అవకాశముంది. సాధారణంగా గుండెలో స్టెంట్ వేయడానికి అయ్యే ఖర్చు కంటే, ఇలా టెలీ రోబోటిక్స్ విధానం ద్వారా చేసే ఆపరేషన్‌కు ప్రస్తుతానికైతే 40 నుంచి 50 వేలు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తే ఖర్చు తగ్గే అవకాశముంది. ‘ఇవాళ ఆపరేషన్ 32 కి.మీ. దూరం నుంచి చేశాం. భవిష్యత్‌లో ఇదే టెక్నాలజీ వినియోగించుకొని దేశంలో ఏ మారుమూల ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా చేయొచ్చు’ అని డాక్టర్ తేజస్ పటేల్ అన్నారు. క్యాథ్ ల్యాబ్, రోబో చెయ్యి, నిరంతరాయంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే ఇలాంటి ఆపరేషన్లు ఎక్కడ నుంచి అయినా చేయొచ్చని, యువ సర్జన్లకి ఇందులో శిక్షణ ఇస్తానని తెలిపారు. డాక్టర్ తేజస్ పటేల్ ఇప్పటికే 300కి పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించారు. అయితే, ఇలా కిలోమీటర్ల దూరంగా ఉన్న పేషెంట్‌కు సర్జరీ చేయడం లైవ్ ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమం. ఈ ఆపరేషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన కొరిండస్ వాస్క్యు లర్ రోబోటిక్స్ కంపెనీ అందించింది. నిపుణులైన డాక్టర్లు ఎక్కడ ఉన్నప్పటికీ వారి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా అందుబాటులోకి రావడం ఈ టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆ కంపెనీ సీఈవో మార్క్ టోలండ్ -
కడుపునొప్పితో వెళ్తే .. కిడ్నీ స్వాహా
వంగూరు (కల్వకుర్తి) : అమాయకత్వం.. నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు ఏ కంగా చికిత్స కోసం వచ్చిన రోగి దగ్గర కిడ్నీ స్వా హా చేసిన సంఘటన ఇది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని ఉమ్మాపూర్‌కు చెందిన బుచ్చయ్య 2008లో తీవ్ర కడుపునొప్పి బాధకు గురయ్యాడు. అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో స్థానిక ఆర్ఎంపీ జిలాని వద్దకు వెళ్లాడు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న వంశీ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడంతో బాధితుడు అంగీకరించాడు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు కిడ్నీలో ఉన్న రాయిని తీసి చూపించారు. నెలరోజుల నుంచి నొప్పితో.. పదేళ్లపాటు ఆరోగ్యంగా ఉన్న బుచ్చయ్యకు గత నెలరోజులనుంచి కడుపునొప్పి, కిడ్నీ భాగంలో లాగడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు వెళ్లి పరీక్ష చేయించగా.. ఒకే కిడ్నీ ఉందని మరో కిడ్నీని ఎప్పుడో తీశారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అవాక్కైన బుచ్చయ్య గ్రామపెద్దలతో కలిసి ఆర్ఎంపీ జిలానీని నిలదీశాడు. అయితే తనకేమీ తెలియదని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. వారు వంగూరు పోలీసులను ఆశ్రయించాలని సూచించినట్లు తెలిసింది. మాట మాత్రమైనా చెప్పలేదు.. నా భర్త కడుపునొప్పితో బాధపడితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు రూ.85 వే లు ఖర్చవుతుందని చెప్పి ఆర్ఎంపీ జిలాని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఫీజు మొత్తం చెల్లించాం. ఆపరేషన్ అనంతరం కేవలం రాయి మాత్రమే చూపించారు. కిడ్నీ తీసినట్లు మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నిలదీస్తే కిడ్నీ చెడిపోవడం వల్ల తొలగించారని, తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడని బాధితుడు బుచ్చయ్య భార్య పార్వతమ్మ వాపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు తమకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ఆర్ఎంపీ జిలానీతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఆయన ఆందుబాటులో లేకుండా పోయారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉంది. -
ఈ రిజిస్ట్రేషన్‌తో ఉద్యోగాలకు మంగళం!
బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు.. బాబు వచ్చి నాలుగేళ్లు దాటింది.. ఆయన వస్తే జాబు రాకపోగా ఏళ్లతరబడి పనిచేస్తున్న వారిని సైతం ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారంటూ గుంటూరు జీజీహెచ్‌లోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. ఏదో ఒకనాటికి పర్మినెంట్ చేస్తారని చాలీచాలని వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్నవారిని ఉన్నపళంగా పీకివేసే ప్రయత్నం చేస్తున్నారని వైద్య సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మెడికల్: పేషెంట్ ఈ రిజిస్ట్రేషన్, ఫ్రం ట్ డెస్క్ మేనేజర్ పేరుతో ప్రభుత్వం నూతన పథకాన్ని ఆగస్టులో ప్రారంభించింది. టీచింగ్ ఆస్పత్రుల్లో మాత్రమే అమల్లోకి వచ్చే పేషెంట్ ఈ రిజిస్ట్రేషన్ పనులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కార్యాలయం వారు హైదరాబాద్ కు చెందిన నక్షత్ర కంపెనీ కాంట్రాక్టర్‌కు అప్పగిం చారు. సదరు కాంట్రాక్టర్ కొద్ది రోజులుగా గుం టూరు జీజీహెచ్‌లో పేషెంట్ ఈ రిజిస్ట్రేషన్ కౌం టర్లు ఏర్పాటు చేస్తూ వైద్య సిబ్బందిని రిక్రూట్ చేస్తున్నారు. మల్టీపర్పస్ సపోర్టివ్ వర్కర్స్ పేరుతో కాంట్రాక్టర్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుని రోగుల సేవలకు వారిని వినియోగించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ఇష్టమే.. కొద్ది రోజులుగా ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌తో ఉద్యోగాల నియామకాలు జరుగుతుండటంతో ఆస్పత్రిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది తమ ఉద్యోగాలు పోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి సంఘం, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా సుమారు 120 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఇచ్చిన వేతనాల జీవో ప్రకారం వేతనాలు చెల్లించకుండా ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ తనకు ఇష్టం వచ్చిన వారిని ఉద్యోగాల్లో తీసుకుంటారని, తాము ఏమీ చేయలేమని ఆస్పత్రి అధికారులు చెబుతూ ఉండటంపై కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. జీజీహెచ్ 1954లో ప్రారంభమైన సమయంలో 600 మందిగా నాల్గోతరగతి ఉద్యోగుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. వారిలో చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయటం, కొంత మంది మరణించటంతో ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. కొంతకాలంగా నాల్గోతరగతి ఉద్యోగుల సంఘం నేతలు పోస్టులు భర్తీ చేయాలని, అధిక పనిభారంతో తాము ఇబ్బంది పడటమే కాకుండా రోగులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తమ బంధువులను చేర్పించేందుకు యత్నం ఏడాది కాలంగా ఆస్పత్రి అధికారులు ప్రభుత్వం నాల్గోతరగతి ఉద్యోగుల నియామకాలు చేస్తుం దంటూ గొప్పలు చెప్పారు. తీరా నేడు అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలను నియమించాలని నిర్ణయించటంతో ఉద్యోగుల సంఘం నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కాగా కొంతమంది నాల్గోతరగతి ఉద్యోగులు తమ బంధువులను ఆస్పత్రిలో ఉద్యోగంలో చేర్పించేందుకు హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు సైతం పదివేలు ఖర్చు పెట్టి తెప్పించుకున్నారు. నేడు కాంట్రాక్టర్ ఎవరిని రిక్రూట్ చేసుకుంటారో తెలియక ఆస్పత్రి అధికారులను, కార్యాలయ ఉద్యోగులను, వైద్యులను కలిసి తమకు ఉద్యోగం ఇప్పించేలా చూడాలని బతిమిలాడుకుంటున్నారు. డీఎంఈ కార్యాలయ అధికారులనే అడగండి కాంట్రాక్టర్ ఏ విధంగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటారో, ఏ పనులు చేస్తారో తమకు ఏమీ తెలియదని, డీఎంఈ కార్యాలయం అధికారులనే వివరాలు అడగాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు ‘సాక్షి’ వివరణ కోరగా తెలిపారు. -
అందరిదీ ఒకే మతం
‘యద్దృశ్యతే శ్రూయతే చ’ దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకుని చూస్తామో, దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటామో వాటి ప్రభావం మనమీద తప్పక ఉంటుందనేది నూటికి నూరుపాళ్లు నిజమైన అంశం. శరీరానికి అనారోగ్యకరమైన తిళ్లని తినిపిస్తే ఎలా శరీరం రోగమయమౌతుందో.. వైద్యుని అవసరం కలుగుతుందో, దానివల్ల ఇటు శారీరక బాధ అటు ధనవ్యాయం, అంతేకాక మనకి బంధుమిత్రులు సేవచేయడంలో అలసటా.. కలుగుతాయో, అదే తీరుగా బుద్ధికి కూడా సరికాని కథలనీ సంఘటనలనీ గట్టిగా హత్తుకునేలా అందిస్తే మానసికంగా వ్యక్తి పూర్తిగా రోగిగా మారిపోతాడు. అందుకే పెద్దలు ‘సరైన వాటినే చూపించు–సరైన వాటినే తినిపించు’ అనేవాళ్లు. అలా శరీరానికీ బుద్ధికీ మనసుకీ ఆరోగ్యకరమైన సాయి చరిత్రలో ప్రయాణిస్తూ సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తున్నాం. ఆ నేపథ్యంలో మరో మతమంటూ లేదనీ అందరిమతం ఒక్కటేననీ నిరూపించే సాయికథని జరిగినదాన్ని జరిగినట్లుగా అనుకుందాం! కృతజ్ఞత ‘కృత = తనకి చేయబడిన సహాయాన్ని, జ్ఞ–త=గుర్తుంచుకోవడం’ అని ఈ మాటకి అర్థం. ‘గోపాలరావు గుండ్’ అనే పేరున్న ఒక ధార్మికుడుండేవాడు. చేస్తున్నది పోలీసుశాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా అయినప్పటికీ, రోజూ నేరగాళ్ల మధ్యే ఉండవలసిన ఉద్యోగమైనప్పటికీ, పూర్తిగా వ్యతిరేకబుద్ధితో నేరం దిశగానే ఆలోచిస్తూ ఎవరొచ్చినా దొంగ– ఘాతుకుడు(హత్య చేసినవాడు).. అని ఈ తీరు మనస్తత్వమే కలిగినవాడుగా ఉండవలసిన వాడే అయినప్పటికీ ధర్మబుద్ధితోనే ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. అందుకే ఆయన్ని ధార్మికుడు అనవలసివచ్చింది. తననెప్పుడూ ఏ ఒత్తిడీ ఉద్యోగపరిస్థితీ తోవ తప్పనీయకుండా చేయాలనే దృఢ సంకల్పంతో దైవానికి నిజమైన సమర్పణ బుద్ధితో (ఏదో ఇచ్చుకోవాలనే బుద్ధి అనేది సమర్పణమనే మాటకి అర్థం కాదు. దైవానికి దాసుడైన వాడినని తనని తాను సమర్పించుకున్న బుద్ధి కలవాడనేది అర్థం) ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. వివాహమై ఎక్కువకాలమైనా సంతానం కలగలేదు. ఆ భార్య ఒత్తిడితో ప్రోత్సాహంతో మరో ఆమెని చేరదీయడం కాదు. వివాహమే చేసుకున్నాడు. అందుకే అతణ్ణి ధార్మికుడన్నాం. అయినా సంతానం కలగలేదు. ఈ ఉన్న ఇద్దరి భార్యల ప్రోత్సాహం ఒత్తిడితో మూడవవివాహాన్ని కూడా చేసుకున్నాడు. లోపల ఒక భయం. ఇలా ఎన్ని వివాహాలని చేసుకోవాలి? అని. ఈ సారి ఏమైనా మరి వివాహమనేమాటని ఎంతటి ఒత్తిడి వచ్చినా అంగీకరించననుకుని కాలాన్ని గడుపుతూ ఉంటే ఎవరో తన అదృష్టానికి సాయి గురించిన విశేషాలని వివరించారు. తన భార్యలు ముగ్గురితో కలిసి సర్వసమర్పణ æభావంతో ఆయనని చూడలేదు. దర్శించుకున్నాడు హృదయంతో.. హృదయంలో ఉన్న ఆర్తితో..! ఆయన కన్నుల్లో కన్నుల్ని పెట్టి మనసుతో ఆయన మనసుకి విన్పడేలా మౌనంగా చెప్పుకున్నాడు తన ఆవేదనని. వేదన అంటే ఎవరో వినేవాడున్నప్పుడు చెప్పుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోలేక ఒకవేళ విన్నా మనస్థాయి దుఃఖంతో సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తూ అర్థం చేసుకోలేని బాధ అని అర్థం. అలాంటి ఆవేదనని అర్థం చేసుకోగలవాడు సాయి మాత్రమే అని నిశ్చయించుకుని ఆవేదనని చెప్పుకున్నాడు గోపాలరావు గుండ్. సరైన కాలంలో విత్తనాన్ని నాటితే చక్కని అంకురం వచ్చి మొక్కై మానుగా ఎదుగుతుందన్నట్లు సాయికి తన ఆవేదనని చెప్పుకున్న కొంతకాలంలోనే ఆయనకి సంతానం కలిగింది. సంతానం కల్గించిన సాయిపట్ల తన ‘కృత–జ్ఞ–త’ తనకి మేలు కల్గించిన సాయికి తన మానసికానందాన్ని హృదయపూర్వకంగా చెప్పుకోవాలని ప్రత్యక్షంగా తనకి తానుగా ఆయనకి కన్పించి చెప్పుకునేలా వెళ్లాలని బయల్దేరి సాయికి సాష్టాంగపడి తన ‘కృతజ్ఞత’లను నమస్కారపూర్వకంగా తెలియజేసుకున్నాడు.ప్రార్థిస్తే సంతానం కలిగితే అన్ని పనుల్నీ మానుకుని వెళ్లి దర్శించిన గోపాలరావు గుండ్ ద్వారా ఎందరో అర్థం చేసుకోవాలి. ‘మొక్కుకుని, ఆ మొక్కుకున్న కారణంగా తీరవలసిన కోరిక తీరాక, ఇప్పుడు కుదరలేదు, అప్పుడు సాధ్యపడదు, మరొక కొంతకాలం వీలుపడదు’ అంటూ దైవదర్శనాన్ని వాయిదా వేసే వారందరూ ఎంతటి తప్పుని చేస్తున్నారో గమనించుకోగలగాలి. కేవలం ఒక్క కుటుంబపు బాధ్యతని నిర్వహిస్తున్న మనకే వీలుపడలేదని, వీలుపడదనీ మనం అంటుంటే, ఆ దైవం తనకంటూ ఎందరు కుటుంబాల బాధ్యతని చేపట్టి ఉన్నాడో కాబట్టి ఆయన అసలు ఏ మాత్రం తీరుబడి లేనివాడవుతూ మన కోర్కెని పట్టించుకోకుండా ఉన్నా అడిగే అవకాశమే లేదు మనకి. అంతటివాడు మన కోర్కెని తీర్చినా ఆయన్ని దర్శించుకోకపోవడం ఎంత ఘోరం ఎంత నేరం ఎంతటి ద్రోహం? ఎంతటి అకృతజ్ఞత?(కృతజ్ఞతకి వ్యతిరేకం కృతఘ్నత కాదు)అందుకే ధార్మికుడైన గోపాలరావు గుండ్ సాయిని దర్శించి తనకి జరిగిన ఆ ఆనందాన్ని ఒక దర్శనంతో వ్యక్తీకరించుకోవడం కాకుండా, అంతతో ముగించుకోవడం కాకుండా, ఆ ఆనందానికి గుర్తుంగా ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం– జాతర– భక్తిపూర్వకంగా జరిపే తిరునాళ్లు జరపాలని దృఢంగా అనుకున్నాడు. బుద్ధింతు సారధిం విద్ధి– మనకి కలిగే ఆలోచనే మన జీవితరథానికి సారథి(నడిపించే వ్యక్తి) అని దీనర్థం. అందుకే తనకి కలిగిన ఈ ఆలోచనని తనకి ఆప్తులైన పాటిల్ ద్వయం(తాత్యా కోత్ పాటిల్, దాదాకోత్ పాటిల్) తోనూ వీరితో సమాన బుద్ధి కలిగిన మాదవరావు అనే ఆయనకీ చెప్పాడు గోపాలరావు గుండ్. ఓ మంచిపనిని చేయబోతే ఆహ్వానం లేకుండానే పదిమంది రావడమనేది సహజం కాబట్టి, నిస్వార్థంగా జరుపబోయే ఉత్సవానికి సంబంధించిన ప్రతిపాదనకి షిర్డీ గ్రామస్థులు కూడా సహకరిస్తామన్నారు. గోపాలరావు గుండ్ ఆనందానికి అవధుల్లేవు. నిరాకరణ – అంగీకారం చేస్తున్నది మంచిపనే కదా! అనే అభిప్రాయంతో ఈ షిర్డీవాసులంతా ఆ ఉత్సవానికి సంబంధించిన అన్ని విధాల సహకారాలని అందించడానికి ముందుకొచ్చారు. అయితే సాంకేతికంగా మాత్రం ఇలాంటి ఉత్సవాలు చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్‌గారి అనుమతి తప్పనిసరి. పైగా ప్రతి సంవత్సరం చేయదలిచిన ఉత్సవం కాబట్టి ప్రతిసారీ ఈ అనుమతి కోసం ఎదురుచూడనక్కరలేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నారు అందరి తరఫునా గోవిందరావు గుండ్ ప్రభృతులు.వేప చెట్టుకి పాలుపోసినా, తేనెని ఎరువుగా వేసినా, గంధాక్షతలతో పూజ చేసినా, గొడ్డలివేటు వేసినా.. దాని రుచి ఎన్నటికీ తీపికానట్లు, చేదుతనమే తన స్వభావమైనట్లు ఆ గ్రామ కులకర్ణి(కరణం) తనదైన సహజబుద్ధితో ఈ దరఖాస్తుని పంపుతున్నట్లే పంపుతూ.. ఈ ఉత్సవానికి అనుమతినీయడం మంచిది కాదంటూ తన సూచనని రాశాడు. రెవెన్యూ వారు ఈ కులకర్ణి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకు తీరాలి. దానికి కారణం ఆయనే ఆ గ్రామ విశేషాలని అందించాల్సిన అధికారి కాబట్టి. దాంతో అనుమతి నిరాకరింపబడింది.గుర్తుంచుకోవాలి! ఎంత గొప్ప పనిని గోపాలరావు గుండ్ తలపెట్టాడో, దానికి గ్రామస్థులంతా ఎలా ముందుకొచ్చారో, ఒక్క సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రతి సంవత్సరం జరుపదలిచారో, ఇది కూడా గోపాలరావు గుండ్‌కి చక్కని పరిశోద్ధారకుడు కలిగిన కారణంగా తప్పక కొనసాగుతూ వెళ్తుందో.. ఇన్నింటినీ ఆ గ్రామాధికారిగా ఉండి అన్నీ తెలిసికూడా కులకర్ణి (కరణం) అలా చేసాడంటే గమనించాల్సిన అంశాలు రెండు. ఒకటి : లోకమంతా ఒకవైపున ఉండి మంచి చేయదలిచినా ఇలాంటి చీడపురుగులుంటాయనీ..! రెండు : సాయి అనుగ్రహం కోసం ముందుగా ప్రయత్నించకుండా ఆయనకి మాట మాత్రంగానైనా చెప్పకుండా చేస్తూండడం వల్లే ఇదంతా జరిగిందనీను. భాగవతం చదువుతూ ఉంటే ఎలా కృష్ణుని చరిత్రతోపాటు శిశుపాలుడూ కంసుడూ గురించి కూడా అనుకుంటామో, శ్రీమద్ రామాయణాన్ని చదువుతుంటే ఎలా శూర్పణఖ–సీతని అపహరించవలసిందని చెప్పిన అకంపనుడనే రాక్షసుణ్ణి గురించి కూడా అనుకుంటామో అలా ఈ కులకర్ణి(కరణం) చరిత్రలో ఒక దుష్టునిగా శాశ్వతంగా నిలిచిపోయాడు. కాబట్టి చరిత్రలో మనమెప్పుడు మాయగా అనుకునేలా ప్రవర్తించాలి తప్ప ఎలా బడితే అలా ఉండడం సరికాదన్నమాట! నిరుత్సాహపరులైన గ్రామస్థులందరితో కలిసి గోపాలరావు గుండ్ సాయికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే! సాయి ఆశీర్వచనం కారణంగా అనుమతి రానేవచ్చింది కొన్ని రోజుల్లోనే. అంటే ఏమన్నమాట? మనకేదైనా ఓ పని కాక మధ్యలో అడ్డంకి కలిగితే సాయిని ప్రార్థిస్తే పని మళ్లీ సక్రమ స్థితికి వచ్చేస్తుందని తెల్పడమే కదా!మరో విశేషం ఉంది కూడా. గోపాలరావు గుండ్ తనకి పుత్రుడు కల్గిన సందర్భంగా తానొక మహ్మదీయుడు కాబట్టి ఉరుసు ఉత్సవాన్ని చేయ సంకల్పించి ఇంత చేసాడు. సత్ప్రవర్తన కలిగిన మహాత్ములైన మహ్మదీయులు మర ణిస్తే వాళ్ల సమాధుల వద్ద ప్రతి సంవత్సరం వాళ్లని స్మరిస్తూ వాళ్లకి నివాళులనర్పించుకునే ఆరాధనోత్సవం ఉరుసు. అలాంటి ఉరుసుని చేయవచ్చునని కలెక్టర్ నుంచి అనుమతి రాగానే సాయి అందరినీ పిలిచి ఆ ఉరుసుని తప్పకుండా ఈ సంవత్సరంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం జరుపుకుందాం! అయితే ఆ ఉరుసుని శ్రీరామనవమినాడు జరుపుకుందామని తన నిర్ణయాన్ని ప్రకటించాడు.గమనించాలి! సాయి ఎంత గొప్పవాడో హృదయవైశాల్యం కలవాడో! పరమత ద్వేషి కానికాడో! ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి! ‘నాకు పరమతసహనం ఉంది. స్వమతం మీద సంపూర్ణ అభిమానం మాత్రమే కాదు’ అంటుంటారు ఎందరో. సాయి దాన్ని అంగీకరించాడు. మతాలంటూ రెండున్నాయని అంగీకరిస్తూ ఈ రెంటింటిలో నాదికాని మతాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇతర మతాన్ని ద్వేషించననడం గొప్ప కాదని తీర్మానిస్తాడు సాయి. రెండు మతాల్లోనూ వేర్వేరుదనం ఉండనే ఉండరాదు. ‘రెండు’ అనుకుంటున్న ఆ ‘రెండూ ఒక్కటే’ అని నిరూపిస్తూ, ముందుకాలం వారికి మార్గదర్శకుడు కూడా అవుతూ ‘ఆ చేయబోతున్న ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమినాడు చేయాలి’ అంటూ ఆజ్ఞ చేసాడు సాయి!ఇలాంటి చరిత్రలని పాఠ్యాంశాల్లో చదివి నేడు కన్పిస్తున్న హిందూ ముసల్మాన్ ద్వేషాలు ఇంతకు వెనుకకాలంలో చరిత్రలో జరిగాయని చెప్పిన ముసల్మాన్ దండయాత్రలు, ప్రస్తుతం ఇంకా జరుగుతున్న హిందూమహ్మదీయ పరస్పర దూషణలు చిన్నచిన్న ఘర్షణలు కూడా పూర్తిగా సమసిపోతాయి. ముఖ్యంగా బాల్యం నుండే పిల్లల్లో మతాల్లో ఉండే రెండు తనం పోయి, మతాలన్నీ ఒకటే అనే అభిప్రాయం బలపడుతుంది! సాయిని కొందరు హిందువులు ఆయన ఓ మహ్మదీయుడనే అభిప్రాయంతోనూ ఆ సంప్రదాయమే ఆయన ఆలయంలో జరుగుతూ ఉంటుందనే ఊహతోనూ సాయిపట్ల ఆయన ఆరాధన పట్ల విముఖతని చూపిస్తూ ఉంటారు. వీరి ఆలోచనే నిజమైనదైనట్లైతే – మసీదేమిటి? ధుని ఏమిటి? లోపల తులసి మొక్కని నాటడమేమిటి? దీపారాధన ఏమిటి? ద్వారకామాయి అని దానికి పేరు పెట్టడమేమిటి? కొద్దిగా ఇలా ఆలోచించుకోగలగాలి. ఇదే సందర్భంలో కొందరు మహ్మదీయులు కూడా ఈయన హిందువనే అభిప్రాయంతో కొంత విముఖతని చూపిస్తూ ఉంటారు. రాబోయే చరిత్రలో ముసల్మానులు అభిప్రాయంతో హిందువులని ఏం చేయబోయారో కూడా తెలియబోతోంది! నిజంగా ఆయన హిందువే అయ్యుంటే నిరంతరం ‘అల్లాహోమాలిక్’ అనడమేమిటి? కఫనీని ధరించడమేమిటి? తల గుడ్డని గట్టిగా చుట్టి ఎడమచెవి మీదుగా ముడిని వేయడమేమిటి? కొద్దిగా పరిశీలించగలగాలి. మరైతే సాయి ఎవరట? ఆయన హిందువుగా కన్పించే మహ్మదీయుడు. మహ్మదీయుడిగా కన్పించే హిందువు. రెంటినీ కలిపి ఒకేమాటలో చెప్పాలంటే ఏ మతానికీ చెందని మహనీయుడూ, అన్ని మతాలు ఒకటే సుమా! అని అర్థం చేసుకునేలా మనకి ఉపదేశాన్నిచ్చే అనన్యసామాన్యుడూను.మొత్తానికి ఉరుసుని శ్రీరామనవమినాడు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి గ్రామస్థుల సహకారం సాయి అనుగ్రహపూర్వకమైన ఆమోదం అన్నీ లభించాయి గానీ మళ్లీ గ్రామస్థుల్లో ఒక చింత బయల్దేరింది. రెండుత్సవాలనీ ఒకే మారు చేస్తున్న కారణంగా భక్తుల సంఖ్య మరింత మరింత అవుతుంది. షిర్డీలో నీటి సమస్య ఉంది. ఉత్సాహంతో మనం ఉత్సవాలని ఇక్కడ కాకుండా మరోచోట చేసుకుంటేనే ఈ ఉత్సవాలని? అనే ఆలోచనదాక వచ్చేసారు జనం అందరూ. దీన్నే అస్థిర అవిశ్వాస తీర్మానం’ అంటారు. ఒకేచోటంటూ ఉత్సవం జరగాలనే గట్టి ప్రయత్నంతో గోపాలరావు గుండ్ ఇంత భగీరథ ప్రయత్నం చేస్తే చివరి క్షణంలో నీటి సమస్య కారణంగా వాయిదా వేయడమా? అదుగో ఆ ఆలోచననే ‘అస్థిర అవిశ్వాస ఆలోచన’ అంటారు.అస్థిర ఆలోచనంటే ముందు షిర్డీలో అనుకుని, తర్వాత షిర్డీ కాక మరోచోట చేద్దామని సంకల్పించడం, అవిశ్వాస ఆలోచనంటే సాయి కూడా ఈ సమస్యని తీర్చలేడనే మానసిక అవిశ్వాసంతో ఆలోచించడం. అసలు సాయికి ఈ సమస్యని చెప్పుకోకుండా తమలో తాము ఆలోచించేసుకోవడమూను. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుష్యులు ఇలాంటి ఆలోచనలనే చేస్తారు. ఆ సరైన ఆలోచన రావడానికి కూడా సాయి అనుగ్రహం ఉండాలి. గోపాలరావు గుండ్తో పాటు పాటిల్ ద్వయం మాధవరావు ఇంకా కొందరికి మెరుపులా ఇదేమిటి? ఇలా ఈ సమస్య మరో తోవ పడుతోంది? అనే ఆలోచన కలిగి సాయికి విన్నవించారు. ‘దేవా! ఈ ఉత్సవాలని చేయదలిస్తే షిర్డీలో రెండే రెండు నీటి వసతులున్నాయి. ఒకపేద్ద నుయ్యి ఉందిగాని ఈ ఉత్సవాలు ఎండల కాలంలో కాబట్టి నీరు సరిపోకపోవచ్చు. లేదా ఇంకిపోతుంది కాబట్టి మధ్యలో ఆ నుయ్యి మనని ఇబ్బందికి గురిచేయచ్చు. ఇక రెండో నుయ్యి ‘నడబావ’. అంటే నాలుగు వైపుల్నించి నడిచే మార్గాల మధ్యలో ఉన్న పెద్ద విశాలమైన బావి. నాలుగు వైపుల వారూ చక్కగా తోడుకుని నీళ్లు పట్టుకోగల వసతి ఉన్న బావి, అయితే దురదృష్టవశాత్తూ ఆ నూతినీరు ఉప్పగా అయిపోయింది. ఎవరికీ ఉపయోగపడడం లేదు. నువ్వే మాకు శరణం’ అని.సాయి చిరునవ్వు నవ్వుతూ ‘చెడు పనులకి విఘ్నాలు కలగనే కలగవు. మంచి పనులకే విఘ్నాల మీద విఘ్నాలొస్తూ ఉంటాయి. (‘శ్రేయాంసి బహు విఘ్నాని’ అని శ్రీమద్ రామాయణంలోని మాట ఇదే అర్థాన్నిస్తుంది) అందుకని ఆలస్యం చేయకూడదు మంచిపని విషయంలో. రండి! అంటూ ఆ నూతి దగ్గరికి వెళ్లి దగ్గర్లో ఉన్న చెట్లపూలని స్వయంగా తానే కోసి లోపల ఏదో ధ్యానం చేసి నూయి చుట్టూ తిరుగుతూ కొన్ని పుష్పాలని తాను వేసాడు నూతిలో.‘ఇక వెళ్దాం!’ అన్నట్టుగా తాను ద్వారకామాయి వైపు నడిచాడు. ఆశ్చర్యం మరురోజునుండే ఎందరో నీళ్లు తోడుకోవడం కన్పించిందక్కడ! నీళ్లన్నీ ఉప్పదనాన్ని కోల్పోయి రుచికరంగా తాగవీలైన తీరులో ఉన్నాయి పరిశీలించి చూస్తే.అప్పుడర్థమైంది షిర్డీ ప్రజలకి. గంగానది మన పక్కనే ప్రవహిస్తూ ఉంటే పొరుగూరి చెరువుకి నీళ్లకోసం వెళ్తున్నామా? అనీ మలయపర్పత వాయువు ఇక్కడే వీస్తుంటే విసనకర్రల్ని కొనుక్కుని వీచుకుంటున్నామా? అనీను! ఇంతలో మరో శుభవార్త వినపడింది అందరికీ! -
కాన్పుకు వస్తే కడుపులో కాటన్ వేసి..
షాద్‌నగర్‌టౌన్ : వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైన సంఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఎనిమిది నెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత(25)ను ఏడాదిన్నర కిత్రం అదే మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాజుతో వివాహం చేశారు. హరితకు తొలి కాన్పు సమయం దగ్గర పడడంతో గతేడాది అక్టోబర్ 3న షాద్‌నగర్ పట్టణంలోని విజయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. హరితను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబీకుల అంగీకారంతో అక్టోబర్ 5న ఆపరేషన్ చేయడంతో హరిత తొలికాన్పులో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాపను చూసి మురిసిపోయిన ఆ కుటుంబ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆపరేషన్ అయిన కొన్ని నెలల్లోనే హరిత అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరితకు స్కానింగ్ చేసి ఆమె కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఉస్మానియా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడలేదు. కొన్ని నెలలుగా మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హరిత మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట పసిపాపతో ధర్నా మృతురాలి కుటుంబీకులు శనివారం సాయంత్రం షాద్‌నగర్‌లోని విజయ ఆస్పత్రి ఎదుట ధర్నా చేప ట్టారు. హరిత కూతురు పసిపాపతో ఆస్పత్రి ఎదు ట బైఠాయించారు. పసిపాపకు న్యాయం చేయాల ని, నిర్లక్ష్యంగా వ్యహరించి ఆపరేషన్ చేసిన వైద్యులను వెంటనే అరెçస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ పట్టణ సీఐ అశోక్‌కుమార్ గట్టి బందోబస్తు చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి హరిత మృతదేహాన్ని పోలీసులు నేరుగా ఆమె స్వగ్రామైన షాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి తరలించారు. రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలి హరిత మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బాధిత కుటుంబ సభ్యులు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిన్నారి పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు, స్ధానిక నాయకులు జోక్యం చేసుకొని విజయ ఆస్పత్రి వైద్యులతో చర్చించినట్లు సమాచారం. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. -
వైద్యులంటే నెత్తుటి వ్యాపారులా?
విశ్లేషణ ప్రయివేటు వైద్యశాలలు పాటిస్తున్న భయానక రహస్య వ్యవహారాల వల్ల రోగికి స్వయం నిర్ణయ స్వేచ్ఛ లేకుండా పోతోంది. రాజ్యాంగం ఇచ్చిన బతుకు హామీ కొందరు బాగా చదువు‘కొన్న’ డాక్టర్ల దుర్మార్గాలకు బలైపోతోంది. వైద్యం ప్రస్తుత జీవనశాస్త్రం కాదు. వైద్యులు ధన్వంతురులూ కాదు. చికిత్స జీవన్మరణ సమస్య. ప్రభుత్వ దవాఖానాల్లో చచ్చినా వైద్యం దొరకదు. ప్రయివేటు నర్సింగ్ హోమ్స్‌లో చచ్చింతరువాత కూడా వైద్యమే అని ఒక విమర్శ. కోటికొక్కరు తప్ప మిగిలిన డాక్టర్లు కుత్తుకలు కోసే నెత్తురు వ్యాపారులనీ కత్తుల రత్తయ్యల కన్న తీసిపోని వారేమీ కాదని తెలుసుకోవాలి. చికిత్సార్థులై వచ్చిన వారు సజీవులైన నాగరికులనీ, వారి డబ్బుతో బతికే డాక్టర్లు, వారి స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుందని వారికి ప్రతిరోజూ పాఠాలు చెప్పవలసిన దుస్థితి ఉంది. వారి సమ్మతి పొందడం అంటే అనస్తీషియా ఎక్కించే ముందో ఆపరేషన్ టేబుల్ మీదో కాగితాల మీద బరబరా సంతకాలు గీకమనడం కాదు. పూర్తిగా సమస్య వివరించి, చికిత్స వివరాలుచెప్పి, పరిణామాలు విశదం చేసి, ప్రత్యామ్నాయాలు ఉంటే చెప్పి, తరువాత హితులతో సంప్రదించి, ఆలోచించి చెప్పే సమ్మతిని చట్టబద్ధమైన సమ్మతి అంటారు. స్వయం నిర్ణయాధికార స్వేచ్ఛ అంటే. వారూ వారూ మాట్లాడుకుని కత్తులు ప్రయోగించడం రోగి స్వేచ్ఛ అనిపించుకోదు మన దేశంలో అస్పష్ట చట్టాల గురించి డాక్టర్లకే తెలియదు. మెడికల్ కౌన్సిల్ చట్టం కింద చేసిన కొన్ని రెగ్యులేటరీ నియమాల ప్రకారం రోగికి లేదా అతని బంధువులకు అడిగిన 72 గంటలలోగా మొత్తం చికిత్స రికార్డులు ఇవ్వాలని డాక్టర్లను నిర్దేశించారు. అంటే ప్రయివేటు డాక్టర్లయినా ప్రభుత్వ డాక్టర్లయినా సరే రోగి చికిత్సావివరాలు తమ సొమ్ముగా భావించి రహస్యాలు దాచి రోగులకు ఇవ్వకుండా ఏడిపించే అధికారం లేదు. అది కూడా సమాచారం నిర్వచనం కిందికే వస్తుంది. రోగ నిర్ధారణ పరీక్షా నివేదికలు, ఎక్స్ రేలు, తదితర స్కాన్ రిపోర్టులు, డాక్టరు ఇచ్చిన సలహాలు, రాసిన మందులు వాటి డోసులు, చికిత్స వివరాలు అన్నీ ఈ సమాచార నిర్వచనం కిందకు వస్తాయి. నిశాప్రియ భాటియా వర్సెస్ భారత మానవ ప్రవర్తనా పరిశీలనా సంస్థ కేసులో, చికిత్స పొందిన వ్యక్తికి ఆ చికిత్స వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్లు, సమాచార హక్కు చట్టం, వినియోగ దారుల చట్టం ప్రకారం కూడా ఈ హక్కును అమలు చేయవలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర సమాచార కమిషన్ CIC/AD/A/2013/001681-S కేసులో 23.4.2014న వివరించింది. ప్రతి ప్రయివేటు, ప్రభుత్వ వైద్యుడు, వైద్యశాల కూడా రోగులకు ఎప్పడికప్పుడు పూర్తి వివరాలు ఇవ్వడానికి ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి రికార్డును వారుగానీ వారి శ్రేయోభిలాషులు కాని అడిగి తీసుకోవచ్చని ఈ తీర్పు వివరించింది. మరొకరి చికిత్సా వివరాలు ఇవ్వవచ్చా లేదా అనే ప్రశ్నను మిస్ జెజె వర్సెస్ భారత మానవ ప్రవర్తనా పరిశోధనా సంస్థ కేసులో విచారించారు. తన భర్తకు సంబంధించిన చికిత్స వివరాలు కావాలని భార్య అడిగింది. అతను మానసిక రోగంతో నరకం చూపుతున్నాడనీ, రకరకాలుగా వేధిస్తున్నాడని, అసలు ఈయనగారికి ఏం జబ్బుందో తనకు తెలియజేయాలని ఆమె కోరింది. ఈ భర్త అతని బంధువులు ఇతనికి ఉన్న జబ్బు సంగతి ముందే చెప్పకుండా ఆరోగ్యవంతుడని నమ్మించి పెళ్లికి ఒప్పించారని, భార్య, ఆమె తమ్ముడు సమాచార కమిషన్‌కు వివరించారు. ఆ వ్యక్తి మానసిక రోగాలకు సంబంధించి తమవద్ద ఉన్న సమాచారం ఒక ధర్మకర్తకు ఇచ్చినటువంటి సమాచారమనీ కనుక ధర్మకర్తలుగా ఆ సమాచారం వెల్లడిచేయజాలమని వైద్యసంస్థ అధికారులు నిరాకరించారు. మొదటి అప్పీలు అధికారి కూడా ఇదే తీర్పుచెప్పారు. భర్తకు చికిత్సలేని రోగం ఉంటే భార్య విడాకులు తీసుకోవచ్చని హిందూవివాహచట్టం 1955లో నిర్దేశించారు. రోగం ఏమిటో తెలియకుండా విడాకులు సాధించలేరు. మానసిక శారీరక రోగాలున్న భర్త వల్ల భార్య ప్రాణాలకు (లేదా భార్య వల్ల భర్త ప్రాణాలకు) ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు పరిష్కారం విడాకులే. పెళ్లికిముందే ఆరోగ్య వివరాలు వధూవరులు పరస్పరం చెప్పుకోవాలి. రోగాలు చెప్పకుండా పెళ్లిచేస్తే ఆ ఒప్పందం చెల్లదు. జీవన హక్కు వివాహ హక్కు, స్వయం నిర్ణయ హక్కు ఆరోగ్య సమాచారంపైన ఆధారపడి ఉంటాయి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
పాప్ సాంగ్ మ్యాజిక్
-
మ్యాజిక్ చేసిన పాప్ సాంగ్...
సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందంటారు. ఆ మాట ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. 4 నెలలుగా కోమాలో ఉన్న ఓ అమ్మాయిని స్పృహలోకి వచ్చేలా చేసింది మాత్రం ఒక పాటే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుచేసే..ఈ అరుదైన సంఘటన చైనాలో చోటుచేసుకుందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. ఇంతకీ విషయమేమిటంటే.. చైనాకు చెందిన 24 ఏళ్ల యువతి గత నవంబర్‌లో కోమాలోకి వెళ్లింది. రక్తంలో ఆక్సీజన్ సరఫరా సరిగా లేనందున మెదడు పనిచేయకపోవడంతో ఆమెకు ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఓ నర్స్ సేవలు అందిస్తోంది. ఎలాగైనా ఆమెలో చలనం కలిగించాలనుకున్న నర్స్.. ప్రతీరోజూ జోకులు చెప్తూ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేది. అందులో భాగంగానే ఓ రోజు తనకెంతో ఇష్టమైన.. తైవాన్ పాప్‌స్టార్ జే చో ‘రోజీమేరీ’ పాటను ప్లే చేసింది. ఆ పాట వినగానే యువతి నెమ్మదిగా కళ్లు తెరిచింది. ఈ విషయాన్ని గమనించిన నర్స్.. డాక్టర్‌ను పిలుచుకొని వచ్చింది. నాలుగు నెలలుగా జీవచ్చవంలా పడి ఉన్న పేషెంట్ ఇలా స్పృహలోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆమెకు మెరుగైన చికిత్సను అందించి తిరిగి మామూలు మనిషయ్యేలా చేశారు. -
చికిత్స సమాచారం రోగి హక్కు
ఒక వైద్యశాలలో జరుగుతున్న చికిత్స సరైంది కాకపోతే, మరొక వైద్యశాలకు వెళ్లాలంటే, అసలు తనకు ఏం జరిగిందో తెలియాలి. ఏ చికిత్సో వివరించాలి. పూర్తిగా రోగి జీవితం ఈ చికిత్సా సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా తెలిసి కొంటేనే మన స్వేచ్ఛకు విలువ– తిండైనా, చికిత్స అయినా. వృత్తి ప్రమాణాలను రక్షిం చడానికి వైద్యమండలిని భారతవైద్యమండలి చట్టం ద్వారా పార్లమెంట్ 1956లో రూపొందించింది. ఈ చట్టం కింద మార్చి 11, 2002న వైద్య రికార్డుల గురించి ఒక రెగ్యులేషన్ జారీ చేసింది. దీన్ని డిసెంబర్ 2010లో సవరించారు. సెక్షన్ 33(ఎం) కింద కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో భారత వైద్యమండలి కింద నమోదయిన వైద్యులకోసం వృత్తి పరమైన ప్రవర్తన, నైతికవిలువలకు సంబంధించిన నియమావళిని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వాటిని రోగులకు అందుబాటులో ఉంచడం వైద్యుల బాధ్యత. మెడికల్ రికార్డ్స్ నిర్వహణ : 1.3.1 చికిత్స మొదలైన తేదీనుంచి ఆస్పత్రిలో చేరిన రోగి చికిత్స పత్రాలను మెడికల్ కౌన్సిల్ అనుబంధం 3లో పేర్కొన్న నిర్ణీత ప్రమాణాల ప్రకారం మూడేళ్లపాటు కాపాడాలి. 1.3.2. రోగి కాని అతను అధికారం ఇచ్చిన ఇతర వ్యక్తి గానీ, లేదా చట్టపరమైన అధికారులు గానీ అడిగితే ఆ రికార్డులను 72 గంటలలోగా ఇచ్చి వేయాలి. ప్రతి వినియోగదారుడికి ఉత్పత్తి గురించి లేదా తాము కొనుక్కున్న సేవల గురించి పూర్తి సమాచారం ఇవ్వవలసిందే. తనకు ఏ ప్రమాణాలతో కూడిన వస్తువులు, సేవలు ఏ ధరకు దొరుకుతాయో ముందే తెలియజేస్తే కొన్నవి ముందే చెప్పిన ప్రమాణాల ప్రకారం ఉన్నాయా ఏవైనా లోపాలు ఉన్నాయా పరిశీలించే హక్కు, లోపాలు ఉంటే పరిహారం కోరే హక్కు ఉందని ఒజైర్ హుస్సేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఏడీ సింగ్, ఎం ముద్గల్ నిర్ధారించారు. కొన్న ఆహారంలో జంతులేశాలుంటే ఉత్పత్తిదారులు తమంత తామే తెలియజేయాలని కోరుతూ ఒజైర్ çహుస్సేన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మన సంవిధానంలో ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావవ్యక్తీకరణ స్వేచ్ఛ రెండు ప్రధాన ఆశయాలను సిద్ధింపజేయాలి. 1. వినియోగదారుడికి కొనబోయే ఉత్పత్తుల నిజాలు తెలుసుకునేందుకు సహకరించాలి. తాను కొన్న ఆహారంలో జంతు, పక్షి, చేప, ఇతర జలచరాలు, గుడ్ల భాగాలు ఉన్నాయా చెప్పాలి. 2. శాకాహారిగా కొనసాగే హక్కును, విశ్వాసాన్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిదారులు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. యూరప్ మానవ హక్కుల ఒప్పందంలోని ఆర్టికల్ 10 ప్రకారం ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉంది. భారతదేశం ఈ ఒప్పందం పైన సంతకం చేసింది. ‘‘ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః’’ అని రుగ్వేద వాక్యం. విశ్వం నలుమూలలనుంచి మనకు సదాలోచనలు అందాలని దీని అర్థం. అనేక భావాలను అన్ని వైపులనుంచి ఆహ్వానించాలన్నదే ఆర్యోక్తి. ఇతరులనుంచి అభిప్రాయాలు వినే హక్కు లేకపోతే సొంతంగా అభిప్రాయం ఏర్పడటం కష్టం, అప్పుడు వ్యక్తం చేయడానికి కూడా ఏమీ ఉండదు. వైద్య చికిత్సపై నిర్ణయానికి రావాలంటే ముం దస్తు సమాచారం ఉండాలి. ఒక వైద్యశాలలో జరుగుతున్న చికిత్స సరైంది కాకపోతే, మరొక వైద్యశాలకు వెళ్లాలంటే, అసలు తనకు ఏం జరిగిందో తెలియాలి. ఏ చికిత్సో వివరించాలి. తన పరిస్థితికి మరే వైద్యం అవసరమో అదెక్కడ దొరుకుతుందో దాని ఖరీదు ఎంతో తెలియకుండా ఆ వ్యక్తి గానీ అతని బంధువులు గానీ ఏ నిర్ణయమూ తీసుకోలేరు. పూర్తిగా అతని జీవితం ఈ చికిత్సా సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. తీసుకునే తిండి విషయంలో చికిత్స విషయంలోనూ సమాచారం ముందే లేకపోతే అతని బ్రతుకుకే ప్రమాదం. ఢిల్లీ హైకోర్టు ఈ అంశం గురించి వివరిస్తూ, ఆహార పదార్థాలు, మందులు, అలంకరణ వస్తువుల గురించి వాటి ప్యాకెట్ల మీద పూర్తి వివరాలు లేకపోతే, ఆ ఉత్పత్తులలో ఉన్న పదార్థాల గురించిన సమాచారం తెలియకపోతే, వాటిని కొని వాడాలో వద్దో నిర్ణయించుకోవడం అసాధ్యమవుతుంది. వినియోగదారులు స్వయంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం జీవన స్వేచ్ఛ, నిర్ణయ స్వేచ్ఛ, అభిప్రాయ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు చెందిన విషయం. ఒకవేళ తను కొనబోయే ఆహారపదార్థం శాకాహారమా లేక మాంసాహారమా తెలియకపోతే, తెలియకుండానే అది తింటే, ఒకవేళ అతను శాకాహారి అయి ఉండి తిన్నది మాంసాహారమైతే అతని స్వేచ్ఛను, సమాచార హక్కును, జీవన విధానాన్ని ఎంచుకునే హక్కును మతభావాలను కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. అంటే ఆర్టికల్ 19(1)(ఎ), 21, 25 కింద హామీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన జరిగినట్టే అని ఢిల్లీ హైకోర్టు వివరించింది. మందులు, డ్రగ్స్ విషయంలో కూడా అవి జంతువుల నుంచి తీసినవా లేక మొక్కలనుంచి తీసిన పదార్థాలా తెలియజేయాల్సిన బాధ్యత ఉత్పత్తి దారుల పైన ఉంది. ఆకుపచ్చ రంగులో శాకాహారమని తెలియజేయాలి. మాంసాహారమైతే ఆ విషయం స్పష్టంగా తెలియజేయాలి. ఆహార పదార్థాల విషయంలో ఇచ్చిన ఈ తీర్పు, సూత్రప్రాయంగా అన్ని రకాల వస్తువులకు, సేవలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా వైద్యసేవలపై పూర్తి సమాచారం పొందేహక్కును ఇది గుర్తించింది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
మారని తీరు.. మంచంపై ఆస్పత్రికి..
లక్నో : విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ సిబ్బంది తీరులో మార్పు రావటం లేదు. మనిషి ఆపదలో ఉంటే స్పందించాల్సింది పోయి.. కుంటి సాకులు చెబుతూ కొందరు తమ చేతులు దులుపుకుంటున్నారు. అంబులెన్స్‌లు నిరాకరించటం.. పెషెంట్లను తోపుడు బండ్ల మీద, భుజాల మీద మోసుకెళ్లిన ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా యూపీలో అలాంటి సన్నివేశం ఒకటి తారసపడింది. ఓ వృద్ధురాలి ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెని మంచంపైనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్ జిల్లా బేద్పూర్ గ్రామానికి చెందిన 70ఏళ్ల మన్జిత్ కౌర్‌కు శనివారం ఆరోగ్యం విషమించడంతో ఆమె బంధువులు 108కి ఫోన్ చేశారు. వాహనంలో డీజిల్ లేనందున రావడం కుదరదని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. దీంతో బంధువులు ఆమెని మంచంపై పడుకొబెట్టి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అలా చాలా కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఓ ట్రక్ సాయంతో ఆమెని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు, దీంతో మంచంపైనే ఆమెని అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై రోగి బంధువులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
క్షయ రోగికి ప్రతి నెలా రూ. 500
కర్నూలు (హాస్పిటల్): 2025 నాటికి ఎండ్ టీబీ స్టాటజీ ప్రోగ్రామ్‌లో భాగంగా మందులతో పాటు ప్రతి క్షయ రోగికి రూ.500 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా క్షయ నివారణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 2003 నుంచి ఇప్పటి వరకు 91,154 మంది టీబీ రోగులకు చికిత్స అందించామన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీతోపాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో టీబీ న్యాట్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ మిషన్‌తో ఇతర వైద్యపరీక్షల్లో బయటపడని టీబీ జబ్బు కూడా బయటపడుతుందన్నారు. ఇదే యంత్రం ద్వారా యూనివర్శల్ డ్రగ్ సెన్సిటివిటి టెస్ట్ కూడా చేస్తున్నామన్నారు. టీబీ రోగులకు ఏ మందులు పడతాయో, ఏవీ పడవో గుర్తించి చికిత్స చేసేందుకు ఈ పరీక్ష ద్వారా సులభమవుతుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా ఉచితంగా మందులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు క్షయ నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. -
అన్నీ ఆన్లైన్లోనే
సిద్దిపేటకమాన్: ‘ఈ–ఔషధి’ అమలులో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారికి అందించే మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తుండటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 19వేల మంది రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. అత్యాధునిక సేవలు సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ హంగులతో అత్యాధునిక సేవలు అందిస్తోంది. ఆస్పత్రికి నిత్యం వచ్చే వందలాది మంది రోగులను వైద్యులు పరీక్షించడంతో పాటు ఫార్మసీలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. అయితే, గతంలో రోగుల సంఖ్య, వారికి అందజేసే మందుల వివరాలను చేతిరాత ద్వారా రికార్డు చేసేవారు. ఈ పద్ధతి వల్ల రోగులు, మందుల వివరాలు సమాచారం పక్కాగా ఉండేది కాదు. దీంతో మందులు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో వసతుల కల్పన, వైద్య సేవల మెరుగుదలపై రాష్ట్ర సర్కార ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రోగుల వివరాలను పక్కాగా నమోదు చేయడం, పారదర్శకంగా మందులను పంపిణీ చేయడానికి ఈ–ఔషది విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కంప్యూటర్లతో పాటు సిబ్బందికి శిక్షణ అందించారు. అంతేకాకుండా రోజువారి రోగులు, మందుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ విధానం 2017 మార్చి నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 19,112 మంది రోగుల వివరాలనుఈ–ఔషధిలో నమోదు చేయడం గమనార్హం. ఈ విధానంతో సిద్దిపేట జిల్లా ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తోంది. రోజుకు 1200 ఓపీ సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి నిత్యం వివిధ విభా గాల్లో సుమారు 1200 మంది రోగులు సేవలు పొం దుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు లేకపోవడంతో పాటు సేవలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో 500 వరకు మంది ఔట్ పేషె ంట్లు వచ్చేవారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఇటీవల ఆస్పత్రిని అన్ని విధాల అ భివృద్ధి చేస్తున్నారు. అన్ని విభాగాల్లో వైద్యులను ని యమించడం, హైరిస్క్ కేంద్రం,డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ–ఔషధి ద్వారా రోగులు, మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతుంది. గతంలో రికార్డులు రాసే విధానం ఉండటంతో మందులు పక్కదారి పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. – డా.నర్సింహం, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
చికిత్స కోసం వచ్చి కన్ను‘మూసింది’
వరంగల్: రాత్రి తమతోనే నిద్రించింది.. తెల్లారేసరికి విగతజీవిగా మారింది.. తన భార్య ఈ లోకం విడిచిందని తెలుసుకున్న భర్త అమ్మ చనిపోయిందని పిల్లలకు చెప్పలేక చెప్పాడు. ఇంకా నిద్రలోనే ఉందనుకుని అమ్మా నిద్ర లేమ్మా అంటున్నవారి పిలుపు అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని మంచుకొండకు చెందిన భూక్యా జ్యోతి(32) అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు పూర్తయినట్లు తెలుపడంతో భర్త రఘుపతి వరంగల్ వచ్చాడు. తమ గ్రామం వెళ్లేందుకు రాత్రి 10 గంటలకు వారంతా వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి రైళ్లు లేకపోవడంతో జనరల్ వెయిటింగ్ హాల్లో నిద్రించారు. తెల్లవారుజామున అందరినీ లేపేందుకు ప్రయత్నించగా జ్యోతి చనిపోయిందని తెలుసుకుని రఘుపతి బోరున విలపించాడు. అమ్మ చనిపోయిందన్న విషయం పిల్లలకు చెప్పడంతో వారు దీనంగా రోదిస్తూ అమ్మా లేమ్మా అంటూ పిలుస్తున్నారు. అక్కడున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఈ సంఘటనతో కంట తడిపెట్టారు. వారందరి సహకారంతో జ్యోతి మృతదేహాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాడు. -
ఆశల బతుకులు..
మర్రిపాటి తులసీదాస్... కవిటి మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈయన మూడేళ్ల కిందటి వరకూ విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ వద్ద ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ విధి మరోలా తలచింది. 2014లో అతనికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెల ల నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరి. ఇతనికి భార్య ఆదిలక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అఖిల 7వ తరగతి, రేష్మ 4వ తరగతి, విన్ని రెండో తరగతి చదువుతున్నారు. కళియా లక్ష్మణరావు... కంచిలికి చెందిన ఈయనకు మూడు పదుల వయస్సులోనే కిడ్నీ పాడైపోయింది. అసలే పేద కుటుంబం. మందులు కొనుక్కోవడానికి కూడా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. నెలకు రూ.10 వేలు ఖర్చు భరించలేక హోమియోపతి మందులను ఆశ్రయించారు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: తులసీదాస్, లక్ష్మణరావు వంటి వారు ఉద్దానంలో వేలాది మంది ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశ పడుతున్న వారు, ఎలాగైనా జబ్బు తగ్గిపోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్న వారు దాదాపు ప్రతి వీధిలోనూ కనిపిస్తారు. కానీ వీరి ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదు. వీరి కన్నీరు సర్కారు పెద్దలకు కనిపించడం లేదు. కిడ్నీ రోగులకు రూ.2,500 పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి, ఆరో గ్యశాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా అదీ నామమాత్రమే అయ్యింది. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కింద ప్రతి నెల డయాలసిస్ చేయించుకుంటేనే ఆ డబ్బు అందుతుంది. అంటే డయాలసిస్ ఆపేస్తే పింఛను కూడా ఆగిపోతుం ది. ప్రభుత్వం స్పందించి తమకేదో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని కోటి ఆశలతో ఉన్న ఉద్దానం వాసుల కడగండ్లు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలు, హామీల ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఏదీ భరోసా? జిల్లాలో కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందించి, అవసరమైతే కిడ్నీ మార్పిడి చేయించి దీర్ఘాయుష్షుకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు మూడేళ్లకు మించి జీవితకాలాన్ని పెంచలేని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. అభివృద్ధిలో వెనుకబడిన సిక్కోలు జిల్లా ప్రజల ఆరోగ్యానికి వరప్రదాయినిలా ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానిక నాయకుడు ధర్మాన ప్రసాదరావు చొరవతో శ్రీకాకుళంలో ఏర్పాటు చేయించిన రాజీవ్‌గాంధీ బోధనాసుపత్రి (రిమ్స్)ని సద్వినియోగం చేసుకొనే విషయాన్నే నేటి ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన బాధితుల్లో కలుగుతోంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను అన్వేషించేలా పరిశోధన విభాగంతో పాటు అవయవదాతల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమర్చేలా ఒక ప్రత్యేక శస్త్రచికిత్స విభాగాన్నీ రిమ్స్‌లోనే ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవయవ దానానికి పలువురు ముందుకొస్తున్న దృష్ట్యా రిమ్స్‌లో జీవన్‌దాన్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ ప్రభుత్వం పక్కనపెట్టేయడం గమనార్హం. కిడ్నీ మార్పిడి కనాకష్టం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల్లో 90 శాతం మంది వారానికి రెండు రోజులు డయాలసిస్ కోసం విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్తున్నారు. అక్కడ కిడ్నీ మార్పిడికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కానీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 2015 సంవత్సరంలో ఐదు, గత ఏడాది రెండు మాత్రమే జరిగాయి. అదే విశాఖలోనే ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం నెలకు పది నుంచి 20 వరకూ జరుగుతుండటం గమనార్హం. ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవడానికే ఆర్థిక స్థోమత సరిపోని ఉద్దానం పేదలకు ఇక కిడ్నీ మార్పిడి అంటే తలకు మించిన భారమవుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్య శ్రీ కింద రూ.1.90 లక్షల వరకే సహాయం అందుతోంది. తర్వాత ఆర్నెళ్లకు రూ.80 వేల చొప్పున ఏడాది కాలానికి మందులకు ఇస్తున్నారు. కానీ శస్త్రచికిత్స తర్వాత రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖరీదు ఉండే ఇంజెక్షన్లు కనీసం రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత నెలకు రూ.2 వేలు మందులకు ఖర్చువుతోంది. అన్ని ఖర్చులు కలిపి రూ.5 లక్షల వరకూ చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి. నిబంధనలతో ఇబ్బందులు ఒకవేళ ఎవరైనా దాతలు కిడ్నీ దానానికి ముందుకొచ్చినా శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఇలా చేయించుకోవాలంటే ముందుగా బోధనాస్పత్రి సూపరింటెండెంట్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ అనుమతి పత్రం ఇవ్వాలి. ఇది కేజీహెచ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో రిమ్స్ బోధనాసుపత్రి అయినప్పటికీ ఆ సౌకర్యం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కేజీహెచ్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. అంతేకాదు దాత, గ్రహీత ఇద్దరూ పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలను కూడా బోధనాస్పత్రి కమిటీకి సమర్పించాల్సి ఉంది. మళ్లీ ఆ పత్రాలను కమిటీ తిరిగి పోలీసు, రెవెన్యూ అధికారులకు పంపించి పునఃపరిశీలన చేయిస్తుంది. ఇందంతా జరిగేటప్పటికీ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ‘రిమ్స్’ను విస్మరిస్తున్నారే... జిల్లాలో కిడ్నీ వ్యాధుల తీవ్రత దృష్ట్యా కనీసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి సాకారమైతే రిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీ సర్జన్లు, క్లినికల్ ల్యాబ్, ప్రత్యేక వార్డు, ప్రత్యేక శస్త్రచికిత్స విభాగం అందుబాటులోకి వస్తాయి. వీటన్నింటి కల్పనకు రూ.2 కోట్లకు మించి వ్యయం కాదని వైద్యనిపుణులే చెబుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్ బోధనాసుపత్రి అయినప్పటికీ ఇప్పటివరకూ నెఫ్రాలజీ విభాగానికి నోచుకోలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకొస్తే తప్ప ఉద్దానం కిడ్నీ రోగులకు జిల్లాలో తగిన వైద్యం అందే పరిస్థితి ఉండదు. రిమ్స్‌లో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి. అంతేకాదు రాష్ట్రంలో శ్రీకాకుళం రిమ్స్ తప్ప మిగతా జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాస్పత్రులన్నింటిలోనూ జీవన్‌దాన్ యూనిట్ ఉంది. దీనిద్వారా కిడ్నీలు, ఇతర అవయవాల మార్పిడి ప్రక్రియ సులభమవుతోంది. శరీరం, అవయవ దానాలకు ముందుకొచ్చే దాతల పేర్లను నమోదు చేసుకొని, వారి మరణానంతరం ఆయా అవయవాలను సేకరించి అవసరమైన వారికి సమకూర్చడంలో ఈ యూనిట్ సహకరిస్తోంది. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో మృతులు లేదా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి కిడ్నీలు సేకరించి రోగులకు మార్పిడి చేసే ప్రక్రియ జిల్లాలో అందుబాటులోకి వస్తుంది. కానీ ఇవన్నీ విస్మరించి ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతోంది. కిడ్నీ మార్పిడికి అవకాశం ఉంటే... ఎన్టీఆర్ వైద్య సేవ కింద కిడ్నీ మార్పిడికి అవకాశం లేకపోవడం వల్లే నేను భర్తను కోల్పోయాను. పేదరికం వల్ల అతనికి కిడ్నీ మార్పిడి చేయించలేకపోయాం. ఆ ఒక్క అవకాశం ఉంటే నా కిడ్నీ ఇచ్చి బతికించుకునేదాన్ని. – లొట్టి తేజావతి, రాజపురం, కవిటి మండలం -
విషానికి విషమే విరుగుడు
ఒంట్లో వేడి చేసినప్పుడు వేడి చేసే పదార్థాలను వాడటం ద్వారా రోగికి ఉపశమనం కలిగించవచ్చని పురాతన వైద్యులు నమ్మేవారు. ఆర్మీనియా మైనర్, పోంటుస్ రాజు ఆరవ మిత్రిడేట్స్‌కు ఎవరైనా ఈ సూత్రం చెప్పారో లేదో తెలీదు గాని, ఆయన ఇదే సూత్రాన్ని పాటించాడు. క్రీస్తుపూర్వం 134లో జన్మించిన ఆరవ మిత్రిడేట్స్ యవ్వనారంభంలోనే అధికారంలోకి వచ్చాడు. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన రాజరికం అనుదిన గండంగా ఉండేది. ఎవరైనా తనపై విషప్రయోగం చేస్తారేమోనని అనుమానం. విషానికి విషమే విరుగుడని భావించాడు. రకరకాల విషాలను కొద్ది మోతాదుల్లో తీసుకునేవాడు. ఏకంగా తన కోటలోని ఉద్యానవనంలో విషపు మొక్కల తోటనే పెంచాడు. భయంకరమైన విషసర్పాలు, తేళ్లు, విషపు పుట్టగొడుగులు, రకరకాల విష పదార్థాలను భారీగా నిల్వచేసేవాడు. రకరకాల విషాలు రకరకాల విరుగుడు సమ్మేళనాలను విష పదార్థాలతోనే తయారు చేసేవాడు. వాటిని స్వల్ప మోతాదుల్లో తీసుకుంటూ శరీరాన్ని విష దుర్భేద్యంగా చేసుకున్నాడు. తన సూత్రం విజయవంతమైన సంగతి మిత్రిడేట్స్‌కు అవసాన దశలో అవగతమైంది. మిత్రిడేట్స్ను అతడి కొడుకే గద్దెదించాడు. ఆ పరిస్థితిలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎలాంటి విషమూ అతడిపై పనిచేయలేదు. చివరకు తనను పొడిచి చంపేయాల్సిందిగా ఒక సైనికుడిని బతిమాలుకున్నాడు. అప్పటి నుంచి విషాలకు విరుగుడు పదార్థాలకు ‘మిత్రిడేట్స్’ అనే మాట వాడుకలోకి వచ్చింది. -
పేషెంట్‌కీ బాధ్యత ఉంటుంది?
సెల్ఫ్‌చెక్ ఆరోగ్యంగా కనిపిస్తూనే సడెన్‌గా ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతుంటాం. హాస్పిటల్‌కు వెళ్లడంతో మన బాధ్యత అయిపోయిందనుకుంటుంటాం. కానీ... మన బాధ్యత చాలా ఉంటుంది. మరి... అదేమిటి? 1. డాక్టర్ని కలిసే ముందే మీ మెడికల్ హిస్టరీ, ప్రస్తుతం బాధపడుతున్న సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కోసం తీసుకున్న మందుల వివరాలను రాసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. డాక్టరు సూచించిన మందులను వాడే ముందు మీకు ఏదైనా మందులు అలర్జీ, రియాక్షన్ కలిగిస్తుంటే తెలియచేస్తారు. ఎ. అవును బి. కాదు 3. ప్రస్తుతం మీరు బాధపడుతున్న వ్యాధి లక్షణాలను, ఎంత కాలం నుంచి ఉంది, ఎలా మొదలైంది... వంటివన్నీ ముందుగానే మననం చేసుకుని డాక్టరుకు పూర్తి వివరాలను ఇస్తారు. ఎ. అవును బి. కాదు 4. పరీక్ష కోసం రక్తం, మూత్రాన్ని సేకరించిన కంటెయినర్ మీద వివరాలు çకరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. డాక్టరు రాసిన మందుల పేర్లు అర్థం కాకపోతే మందులు తీసుకున్న తర్వాత వాటిని ప్రిస్కిప్షన్‌తో సరిచూసుకోవాలనుకోరు. ఎ. అవును బి. కాదు 6. ట్రీట్మెంట్ సమయంలో డాక్టరు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఫాలోఅప్ ట్రీట్మెంట్ను నిర్లక్ష్యం చేయరు. ఎ. అవును బి. కాదు 7. ఆనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులతో సన్నిహితంగా మెలగకూడదన్న నియమాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయరు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఐదు అంత కంటే ఎక్కువ వస్తే అస్వస్థత నుంచి కోలుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే... అనారోగ్యానికి గురైన మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మార్చే బాధ్యత పూర్తిగా డాక్టరుదే... అన్నట్లు ఉంటారు. అలా కాకుండా పేషెంటుగా మీ బాధ్యతకు న్యాయం చేయండి. -
'గాంధీ'లో ఎమ్మెల్యే భార్యకు షాక్
- తీరు మారని గాంధీ సిబ్బంది వైఖరి హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి సిబ్బంది తీరు మరోసారి వివాదస్పదమైంది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా వారు మారడం లేదు. తాజాగా చికిత్స నిమిత్తం గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే భార్యను సైతం సిబ్బంది లంచం అడగటం కలకలం రేపుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత మంగళవారం తమ సమీప బంధువు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కు వచ్చారు. అయితే ఆమెను అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆమే స్వయంగా వీల్‌ఛైర్ తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆస్పత్రిలోపలికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వీల్ ఛైర్ వార్డులోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే భార్యను సిబ్బంది లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒక ఎమ్మెల్యే భార్య పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా గాంధీ సూపరిండెంట్ కానీ , అధికారులు కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
గాంధీ ఆస్పత్రి పైనుంచి దూకి రోగి ఆత్మహత్య
సికింద్రాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనంపై నుండి దూకి ఓ రోగి ఆదివారం ఉదయం ఆత్మ హత్య చేసుకున్నాడు. న్యూరాలాజి వార్డు లో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ కు చెందిన గిరి ఆదివారం ఉదయం ఆస్పత్రి భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మానసికస్థితి సరిగాలేనందువల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ని అని మహిళను మభ్యపెట్టి..
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో గర్భాశయ వ్యాధితో చేరిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును వైద్యుడి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మౌలాలీకి చెందిన రమా అనే మహిళ గర్భాశయ వ్యాధితో గురువారం గాంధీ అస్పత్రిలో చేరింది. చికిత్స నిమిత్తం ఆమెకు ఇంజెక్షన్ చేయాలని, మంగళసూత్రం అడ్డుగా ఉందని, ఆ గొలుసును తీయాలని వైద్యుడి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఆమెను మభ్యపెట్టాడు. కొద్ది నిమిషాల్లోనే ఆ నాలుగు తులాల బంగారు గొలుసును కాజేసి ఆ అగంతకుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రమా... చిలకలగూడ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకున్న ఔదార్యం
రోడ్డున పడ్డ కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత ఆత్రేయపురం (కొత్తపేట) : కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భర్త చనిపోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని ప్రవాసాంధ్రుడు డాక్టర్ వేగేశ్న వెంకట రామకృష్ణంరాజు ఆదుకున్నారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లికి చెందిన సాగి శ్రీనివాసరాజుకు ఇటీవల కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న అతనికి పలు స్వచ్చంద సంస్థలు చేయూతను అందించాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి, క్షత్రియ ఫౌండేషన్, వసుధ ఫౌండేష¯ŒS వైద్యం నిమిత్తం రూ.7లక్షల సాయం అందించాయి. భార్య సునీత తన కిడ్నీని ఇచ్చినప్పటికీ భర్తను బతికించుకోలేక పోవడంతో కుటుంబానికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ పరిస్థితిలో ఆత్రేయపురానికి చెందిన ప్రవాసాంధ్రుడు డాక్టర్ వేగేశ్న చారిటబుల్ ట్రస్టు అధినేత వేగేశ్న వెంకట రామకృష్ణంరాజు వైద్యం నిమిత్తం రూ.40 వేలు హెల్పింగ్ హ్యాండ్్సకు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. దీనికితోడు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ కుటుంబాన్ని అదుకోవడానికి రూ.2.86 లక్షల చెక్కును మంగళవారం అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో మృతుడు భార్య సునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి పెన్మెత్స ఫణీంద్రకుమార్ (ఆమెరికా) కోనసీమ క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్ డీఎస్ఎ¯ŒSరాజు, ఉపాధ్యక్షుడు కేవీ రామరాజు, ట్రెజరర్ ఎం.రంగరాజు పాల్గొన్నారు. -
రోగి బంధువుపై సెక్యూరిటీ సిబ్బంది దాడి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సొంతూరి మహిళను పరామర్శించేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా చావబాదారు. బాధితుని కథనం మేరకు.. కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన మోహన్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరింది. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు మోహన్‌గౌడ్ వచ్చాడు. ఆమె పరిస్థితి విషమంగా కనిపించడంతో చికిత్స చేయాలని వైద్యులను బతిమిలాడాడు. దీంతో వైద్యసిబ్బందికి, అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మోహన్‌గౌడ్‌ను అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో మోహన్‌గౌడ్ చెవి కొద్దిగా తెగిపోయింది. దీంతో ఆగ్రహించిన మోహన్‌గౌడ్ కుటుంబసభ్యులు క్యాజువాలిటి బయట ధర్నా చేశారు. బాధితుడు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో సెక్యూరిటీ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఎదురుగానే తనను తీవ్రంగా కొట్టారని, కొట్టిన వారిని శిక్షించాలని కోరారు.