జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం 17, 678 హెక్టార్లు సాగైన మినుము పంట విస్తీర్ణం 41,859 హెక్టార్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం 17, 678 హెక్టార్లు సాగైన మినుము పంట విస్తీర్ణం 41,859 హెక్టార్లు

Feb 17 2026 8:56 AM | Updated on Feb 17 2026 8:56 AM

జిల్ల

జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం 17, 678 హెక్టార్లు

ఇదీ పరిస్థితి...

రైతన్నకు నష్టం

విజయనగరం ఫోర్ట్‌:

రుగాలం శ్రమించి సాగుచేసిన పంటను అమ్ముకునేందుకు రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం రైతన్నకు శాపంగా మారింది. తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. మొన్న ధాన్యం.. నేడు అపరాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంపై రైతులు మండిపడుతున్నారు. పంట చేతికొచ్చినా అమ్ముకునేందుకు అవకాశం లేక క్వింటా వద్ద రూ.1000 నుంచి రూ.1800 తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతోందని, 19 నెలలుగా కష్టాలతో ముందుకు ‘సాగు’తున్నామని, విత్తు నుంచి పంట కొనుగోలు వరకు ఇబ్బందులు తప్పడంలేదని చెబుతున్నారు.

జిల్లాలో పెసర పంట 17,638 ఎకరాల్లోను, మినుము పంట 41,859 హెక్టార్లలో సాగైంది. చేను తీత, నూర్పిడి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పంటను విక్రయానికి సిద్ధం చేశారు. ఇప్పటికే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎక్కడా ఏర్పాటుచేయలేదు. దీంతో ఇప్పటికే 50 శాతం మంది రైతులు పంటను దళారులకు విక్రయించినట్టు సమాచారం. రైతులు పంటను విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి లాభం తప్ప తమకు ఒరిగిందేమీ ఉండదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కూడా చంద్రబాబు సర్కార్‌ ఇదే తరహాలో వ్యవహరించిందని, రైతులు పంటను విక్రయించిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాపారులకు లాభం చేకూర్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అపరాలు ( పెసర, మినుము ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వల్ల రైతులు తక్కువ ధరకే పంటను విక్రయించేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు పెసలు రూ.8,768, మినుములు రూ.7800లు. వ్యాపారులు మాత్రం క్వింటా పెసలు రూ.7 వేలు, మినుములు రూ.6,800కు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల క్వింటాకు పెసలైతే రూ.1800, మినుములు రూ.1000 వరకు నష్టపోతున్నారు. మూడు నాలుగు క్వింటాళ్లు పండించిన రైతులైతే పెసలు రూ.5,400, మినుములు రూ.3వేలు వరకు నష్టపోతున్నారు.

అనుమతి రాగానే ఏర్పాటు చేస్తాం

పెసర, మినుము పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

– ఎన్‌.వెంకటేశ్వరావు,

జిల్లా మేనేజర్‌, మార్క్‌ఫెడ్‌

పంట చేతికొచ్చినా ఏర్పాటుకాని

కొనుగోలు కేంద్రాలు

తక్కువ ధరకే దళారులకు

అమ్ముకుంటున్న రైతులు

క్వింటా వద్ద రూ.1000 నుంచి రూ.1800 నష్టపోతున్న వైనం

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై

మండిపడుతున్న రైతాంగం

జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం  17, 678 హెక్టార్లు 1
1/2

జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం 17, 678 హెక్టార్లు

జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం  17, 678 హెక్టార్లు 2
2/2

జిల్లాలో సాగైన పెసర పంట విస్తీర్ణం 17, 678 హెక్టార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement