ఆర్టీసీ బస్సు, మ్యాజిక్‌ వ్యాన్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, మ్యాజిక్‌ వ్యాన్‌ ఢీ

Feb 18 2026 7:51 AM | Updated on Feb 18 2026 7:51 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సు, మ్యాజిక్‌ వ్యాన్‌ ఢీ

ఆరుగురికి గాయాలు

బొండపల్లి: ఆర్టీసీ బస్సు, మ్యాజిక్‌ వ్యాన్‌ ఢీకొని ఆరుగురు వ్యక్తులు గాయపడిన ఘటన మంగళవారం బొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై యు.మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోట్లాం సమీపంలో గజపతినగరం నుంచి విజయనగరం వైపు వస్తున్న బస్సు.. విజయనగరం నుంచి గజపతినగరం వైపు వెళుతున్న టాటా మ్యాజిక్‌ వ్యాన్‌ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మండలంలోని నెలివాడ గ్రామానికి చెందిన ఎన్‌.రమేష్‌, గజపతినగరం పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన కాళీలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆరుగురు క్షతగాత్రులను అంబులెన్సులో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యు.మహేష్‌ తెలిపారు.

ఆర్టీసీ బస్సు, మ్యాజిక్‌ వ్యాన్‌ ఢీ1
1/1

ఆర్టీసీ బస్సు, మ్యాజిక్‌ వ్యాన్‌ ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement