బాల్య వివాహాల రహిత సమాజమే లక్ష్యం
కురుపాం: బాల్య వివాహాల రహిత సమాజ లక్ష్యం మనందరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ కం ప్రొబిషన్ అధికారి పి.శ్రీధర్ అన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. మంగళవారం శివ్వన్నపేట వద్ద ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ టచ్..బ్యాడ్ టచ్‌లపై వివరించారు. నెయ్యిల వీధిలో కమ్యూనిటీ పీపుల్‌కి చైల్డ్ మ్యారేజ్ కోసం అవగాహన కల్పించారు. కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి రజని దుర్గా, జిల్లా బాలల విభాగం ఔట్రిచ్ వర్కర్ ఆర్.హరికృష్ణ, మహిళా సంరక్షణ కార్యదర్శి స్వప్న, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


