సీబీఎస్సీ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో సీబీఎస్సీ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈమేరకు పదో తరగతి విద్యార్థులు 56 మంది, ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ విద్యార్థులు 71 మంది పరీక్షలకు హాజరైనట్లు ప్రిన్సిపాల్ వీర్ సింగ్ తెలిపారు. పరీక్షకు ముందే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందించినట్లు వివరించారు. విద్యార్తులకు నిత్యజీవితంలో పరీక్షలు సహజమని, ఇవి వారిలో విలువలు, విద్యానైపుణ్యాన్ని బహిర్గతం చేస్తాయన్నారు. ధైర్యంగా, సానుకూల దృక్పదంతో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.


