వ్యాక్సిన్‌ వేసుకుంటే రిస్క్‌ 0.5 శాతమే!

Vaccinations Reduce Chance Of Covid Death In India To 0.5 Percent - Sakshi

కోవిడ్‌ వ్యాప్తిపై ఐసీఎంఆర్‌ 

మార్చి నుంచి జూన్‌ వరకు.. 17 రాష్ట్రాల్లో అధ్యయనం

జనం జాగ్రత్తలు పాటించకనే ఇన్ఫెక్షన్‌

లక్షణాలు సాధారణం.. ప్రమాదం తక్కువే..

దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మాత్రం కాస్త ప్రమాదకరమేనని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశం ఉంటుందని, అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అతితక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్‌ (భారత వైద్య పరిశోధన మండలి) వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో మాత్రం సమస్యలు తలెత్తి, ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చే అవకాశముందని హెచ్చరించింది. చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకున్నామన్న ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కరోనా సోకుతోందని పేర్కొంది. కోవిడ్‌ టీకాలు తీసుకున్న తర్వాత వైరస్‌ సోకిన వారిపై ఐసీఎంఆర్‌ ఇటీవల అధ్యయనం చేసింది.

మార్చి నుంచి జూన్‌ మధ్య దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వెయ్యి మంది పేషెంట్ల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించింది. ఈ వివరాలతో రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకున్న తర్వాత కరోనా ఇన్ఫెక్షన్‌ సోకినా.. చాలా మందిలో పెద్దగా అనారోగ్య సమస్యలేవీ తలెత్తలేదని తెలిపింది. కేవలం సాధారణ లక్షణాలైన జలుబు, జ్వరం, దగ్గు వంటివే కనిపించాయని.. మామూలు మందులతోనే ఈ లక్షణాలు తగ్గిపోయాయని వెల్లడించింది.

ప్రాణాపాయం తగ్గింది..
వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో రిస్క్‌ రేటు బాగా తక్కువగా ఉంటోందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇలాంటివారికి కరోనా సోకినా.. 99.5శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారని, 0.5 శాతం మందికి మాత్రమే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతోందని తెలిపింది.
వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి సగటున 39 రోజుల తర్వాత కరోనా ఇన్ఫెక్షన్‌ సోకినట్టు ఐసీఎంఆర్‌ పేర్కొంది. 70 శాతం మందిలో లక్షణాలు కనిపించకపోగా, మిగతావారిలో సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు వస్తున్నాయని వివరించింది.
తాము పరిశీలించిన బాధితుల్లో 85 శాతం మందికి డెల్టా (బి.1.617) వేరియంట్‌ సోకినట్టుగా గుర్తించామని పేర్కొంది.
వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కరోనా బారినపడ్డ వారిలో 22 శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోందని.. అయితే వీరిలో చాలావరకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారేనని పేర్కొంది. 78 శాతం హోం ఐసోలేషన్, సాధారణ మందులతోనే రికవరీ అవుతున్నారని తెలిపింది.
దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో 43 శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని పేర్కొంది. అందువల్ల వారు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్‌ వంటివి తప్పనిసరిగా పాటించాలని.. వీలైనంత జన సమూహాలున్న చోటికి వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేసింది.
ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్టు వెల్లడించింది.

వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి
కోవిడ్‌ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవడం తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా చేసిన వివిధ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ఇన్పెక్షన్‌ రావచ్చు. కానీ అనారోగ్యానికి గురై మరణించే అవకాశాలు తక్కువ. దీర్ఘకాలిక జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
-కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-07-2021
Jul 18, 2021, 04:22 IST
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.....
18-07-2021
Jul 18, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఇది ఎక్కువ మంది బాధితులు చెప్పే మాట. ఇంతకాలం...
18-07-2021
Jul 18, 2021, 00:00 IST
కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధిని కోవిడ్‌–19 అంటారన్నది తెలిసిందే. ఈ ఇంగ్లిష్‌ పదంలో తొలి రెండు అక్షరాలు ‘సీఓ’ అన్నవి...
17-07-2021
Jul 17, 2021, 08:45 IST
కర్ణాటక వార్తలు
17-07-2021
Jul 17, 2021, 07:58 IST
లాక్‌డౌన్‌ పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం
17-07-2021
Jul 17, 2021, 02:44 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది....
17-07-2021
Jul 17, 2021, 02:17 IST
వాషింగ్టన్‌: అమెరికాతోపాటు భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులు సుమారు 10 మంది కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, ఈ...
16-07-2021
Jul 16, 2021, 19:56 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 715 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది...
16-07-2021
Jul 16, 2021, 17:49 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,345 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 3,001 మంది కరోనా బాధితులు కోలుకుని...
16-07-2021
Jul 16, 2021, 15:41 IST
భోపాల్‌: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ తాజాగా మరో వివాదంలో...
15-07-2021
Jul 15, 2021, 20:39 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది...
15-07-2021
Jul 15, 2021, 17:46 IST
దురదృష్టం కొద్ది ప్రపంచం ఇప్పుడు థర్డ్‌వేవ్‌ ప్రారంభ దశలో ఉంది
15-07-2021
Jul 15, 2021, 17:16 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 93,785 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 2,526 కరోనా...
15-07-2021
Jul 15, 2021, 09:56 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కరోనా కేసులు నమోదవ్వగా...
15-07-2021
Jul 15, 2021, 07:31 IST
యశవంతపుర: కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. పూణె నుంచి హుబ్లీకి బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే ప్రయాణికుల వద్ద కరోనా...
14-07-2021
Jul 14, 2021, 17:11 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,591 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 15 మంది మృతి చెందారు. తాజాగా 3,329 మంది కరోనా బాధితులు...
13-07-2021
Jul 13, 2021, 18:35 IST
దంతేవాడ (చత్తీస్‌ఘడ్‌) : మావో​యిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్‌ మృతి చెందారు. ఇన్ఫెక్షన్...
13-07-2021
Jul 13, 2021, 17:27 IST
తిరువనంతపురం: దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌ మరో సారి వైరస్‌ బారిన పడ్డారు. ఇండియాలో కేరళకు...
13-07-2021
Jul 13, 2021, 17:07 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 81,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 2,567 కరోనా కేసులు...
13-07-2021
Jul 13, 2021, 15:20 IST
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top