18 నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు 

Telangana: SCR To Run Special Trains To Sabarimala From Dec 18 - Sakshi

దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అయ్యప్పభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్‌–కొల్లాం (07133/07134) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 19వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

కాచిగూడ–కొల్లాం(07135/07136) ప్రత్యేక రైలు ఈ నెల 22వ తేదీ ఉదయం 5.30కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 23వ తేదీ సాయంత్రం 7.35కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.30కి కాచిగూడ చేరుకుంటుంది. నాందేడ్‌–కొల్లాం (07137) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.40 కి కొల్లాం చేరుకుంటుంది.

కొల్లాం–తిరుపతి (07506) ప్రత్యేక రైలు ఈ నెల 25న అర్ధరాత్రి 12.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.10కి కొల్లాం చేరుకుంటుంది. తిరుపతి–నాందేడ్‌ (07138) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 26వ తేదీ రాత్రి 8.15కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నాందేడ్‌ చేరుకుంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top