సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు 

Sabitha Indra Reddy Decided Awards To Teachers At Government Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే ప్రభుత్వ ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించారు. ఇలాంటి వారి పూర్తి వివరాలు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సోమవారం ఆమె ఆదేశించారు. ఈ ఏడాది జరిగే గురుపూజ దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించాలని సబిత భావిస్తున్నారు. ప్రస్తుతం చాలావరకు కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు.

అయితే దీనికి భిన్నంగా కొంతమంది మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉన్నతిని పెంచాలని తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారు. వారు ఆదర్శంగా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో ఇలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల ప్రభుత్వ బడుల ఉన్నతి మరింత పెరుగుతుందని సబిత భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top