
సాధారణంగా పాము అన్న పదం వింటేనే ఆమడ ద�...
ఒక వయసు పెరిగిన తరువాత, ప్రస్తుతం ఆధు�...
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల�...
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రెండ�...
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్ రాజధాని బ్...
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి ...
అధిక బరువును తగ్గించుకుని ఫిట్‌గా ఉం...
ఢిల్లీ: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర...
యూపీ... బిహార్... ఒడిశా... జార్ఖండ్... వెస...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూ�...
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార...
బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోట...
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంద�...
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆ�...
Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశా�...
Feb 13 2022 2:36 PM | Updated on Feb 13 2022 8:16 PM
హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. కాగా ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆలయాలు, బృహన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజుల విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు. సమతా మూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి తలసాని స్వాగతం పలికారు.
Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వనం పలికారు. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్‌లో ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు.
మచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతోపాటు భద్రవేదిక దిగువ భాగంలో కొలువుదీరిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.