ముస్లీం మతపెద్దలతో వైఎస్ షర్మిల సమావేశం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం ఓల్డ్ సిటీలోని మదర్స దరూల్ ఉలూమ్ రహ్మనియా తలాబ్ కట్ట వద్ద జమియతే ఉలేమయే హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తి ఘయస్ రహమాని సహబ్‌ని, జనరల్ సెక్రటరీ ముఫ్తి జుబేర్ ఖాస్మి సహబ్‌తో సమావేశమయ్యారు. వీరితో పాటు అన్ని జిల్లాల మత పెద్దల ఈ సమావేశానికి హాజరయ్యారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ సయ్యద్ ముజ్తాబా అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ మహ్మద్ ఆయూబ్‌ఖాన్, యూత్ కోఆర్డినేటర్ సయ్యద్ అజీమ్ మొహియోద్దీన్, భువనగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ మహ్మద్ అథర్, యూత్ స్టేట్ ఈసీ మెంబర్ అర్బాజ్ ఖాన్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.