
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎస్‌ఏలోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో కొచ్చి వెళ్లకుండా ఆగిపోయారు.. దీంతో అమిత్ షా ప్రయాణం వాయిదా పడింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు.
కాగా హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్‌ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు, సీఐఎస్‌ఎఫ్‌కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు.