వధూవరులకు పెట్రోలు బహుమానం

Couple Receives Petrol Bottles As Wedding Gift In Jangaon - Sakshi

సాక్షి, నర్మెట(జనగామ): పెట్రోల్‌ ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య చాలా వివాహ వేడుకలలో దీన్ని కూడా బహుమానంగా ఇస్తుండం ఒక ట్రెండ్‌గా మారింది. కాగా, పెళ్లి వేడుకలకు వచ్చిన బంధుమిత్రులు వధూవరులకు బహుమతిగా నగదు, నూతన వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు  ఇవ్వడం ఆనవాయితీ.

 అయితే నర్మెట మండల కేంద్రంలో శనివారం జరిగిన మహేష్‌–సుస్మిత వివాహానికి హాజరైన బాల్య మిత్రులు భాస్కర్, సతీష్, శివ, శ్రీనివాస్, నవీన్‌ లీటర్‌ పెట్రోలు అందజేసి ధరలు బాగా పెరిగాయి పొదుపుగా వాడుకోవాలని సలహా ఇచ్చారు.  

చదవండి: టీ సర్కార్‌ ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top