
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి ఊరట లభించింది. ఆయనపై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. నాంపల్లి స్పెషల్ కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వాఖ్యలను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ క్వాష్ పిటిషన్ అనుమతిచ్చిన హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
కాగా, సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డికి ఊరట లభించింన సంగతి తెలిసిందే.. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం(గత నెల జులై 28) డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్‌లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.
పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు
