నిధులు పాతాళంలో.! | - | Sakshi
Sakshi News home page

నిధులు పాతాళంలో.!

Feb 17 2026 8:53 AM | Updated on Feb 17 2026 8:53 AM

నిధుల

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.! హామీలు ఆకాశంలో.. బాబాయ్‌లో కనిపించని సత్తా.. కొత్తగా ఏమీ చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను నీరు గార్చేస్తున్నారు.

కింజరాపు బాబాయ్‌ అబ్బాయ్‌ల తీరుపై తీవ్ర విమర్శలు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం సంస్థలు, నిధులు సాధించడంలో విఫలం కేంద్ర, రాష్ట్ర మంత్రులతో జిల్లాకు ఒరిగింది శూన్యమంటున్న జిల్లా వాసులు

అభివృద్ధిపై శ్రద్ధ ఏదీ..?

టీడీపీలో తానే కీలకం జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడైనా జిల్లాకు ఏదైనా చేశారంటే అదీ లేదు. జిల్లాలో మరో సామాజిక వర్గం నుంచి ఇంకో నేత ఎదగకూడదనే ధోరణిలో రాజకీయాలు నెరుపుతున్న అచ్చెన్న సొంత జిల్లాకు ఒక్క శాశ్వత ప్రాజెక్టును తీసుకు రాలేదు. రాష్ట్ర బడ్జెట్‌ను ఒక్కసారి చూస్తే పిక్చర్‌ కనబడుతుంది.

జిల్లాలో కీలకమైన వంశధార ప్రాజెక్టు స్టేజ్‌ 2 ఫేజ్‌2, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులకు నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వంశధార స్టేజ్‌–2 పనులకు బడ్జెట్‌లో కేటాయించిన డబ్బులు కూడా రప్పించుకోలేకపోయారు.

ఆఫ్‌షోర్‌ విషయంలోనూ అంతే. వంశధార స్టేజ్‌ –1 పనులకై తే అతీగతి లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం కనీసం పట్టించుకున్నట్టు లేదు. ఆమదాలవలస, టెక్కలిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ అలాగే ఉంది. శ్రీకాకుళం నగరంలో రింగ్‌ రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ఫ్లై ఓవర్లు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. జిల్లాలో జరిగే పండుగలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర ఉత్సవాలుగా జీవోలు జారీ చేయించడం తప్ప జిల్లాకు ఆయన చేసిందేమీ కనిపించడం లేదు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లా ప్రజల వేళ్లన్నీ కింజరాపు ఫ్యామిలీపైనే చూపిస్తున్నాయి. బాబాయ్‌ అబ్బాయ్‌లకు రాష్ట్ర, కేంద్రమంత్రి పదవులు వచ్చాయే తప్ప ఎన్నుకున్న ప్రజలకు మాత్రం మేలు జరగడం లేదు. తామే గొప్ప అని తరుచూ గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లాకు చేసిందేంటో కనిపించడం లేదు. సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం తప్ప జిల్లాకు ప్రత్యేకంగా తెచ్చిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లను చూస్తే వీరి అసమర్థత తేటతెల్లమవుతోంది. 2026–27 కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో జిల్లాకు మళ్లీ శూన్యహస్తమే మిగిలింది. మాటల డాబే తప్ప చేతల ప్రతిభ లేదని తేలిపోయింది.

మూడుసార్లు గెలిపించినా..

ఎంపీగా మూడు సార్లు ఎన్నుకున్న శ్రీకాకుళం జిల్లాకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నా యుడు చేసిందేంటంటే.. రైల్వే స్టేషన్‌లలో కుర్చీలు, బెంచీలు వేయడం మాత్రమే. ఇవి అన్ని రైల్వే స్టేషన్‌లకు వచ్చేవే. వాటిని తమ ఖాతాలో వేసుకున్నారే తప్ప జిల్లాకు ప్రత్యేకంగా సాధించిందేమీ లేదు. చిన్న వయస్సులో కేంద్రమంత్రి పదవిని అలంకరించామని పబ్లిసిటీ చేసుకోవడమే గానీ ఆ పదవి ద్వారా జిల్లాకు చేలు మేలు ఏదీ లేదు. పబ్లిసిటీ పీక్‌.. పర్ఫార్మెన్స్‌ వీక్‌లా తయారైంది. రీల్స్‌పై చూపించిన శ్రద్ధ జిల్లా అభివృద్ధికి చూపించడం లేదని వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కోతల రాయుడిగా మిగిలిపోతున్నారని జిల్లా వాసులు వాపోతున్నారు.

ఉద్దానంలో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా ప్రత్యేక క్లస్టర్లను ప్రకటించి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేలా రాయితీలు ఇప్పించాల్సి ఉంది. ఆ ప్రయత్నమే జరగలేదు.

ఉద్దానం ప్రజలను కబళిస్తున్న కిడ్నీ వ్యాధిని తరిమి కొట్టేలా కృషి చేయలేదు. కనీసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రిని, డయాలసిస్‌ సెంటర్లను సరిగా నడపలేకపోతున్నారు. వాటికి కావల్సిన సాయాన్ని కేంద్రం ద్వారా అందించడంలో విఫలమయ్యారు. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు ఐసీఎంఆర్‌ ద్వారా జాతీయ స్థాయిలో నిధులు కేటాయింపు చేయలేకపోయారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కాబోతున్నా జిల్లాకు అనుసంధానం చేసేలా రహదారి మంజూరు చేయలేకపోయారు.

పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయింపు జరగలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో కిసాన్‌ డ్రోన్‌ పథకం కింద రైతులకు ప్రోత్సాహం, మత్స్యకారులకు ఆధునిక జెట్టీలు, కోల్ట్‌ స్టోరేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయలేకపోయారు.

మూలపేట పోర్టుకు రైల్వే లైన్‌పై క్లారిటీ ఇవ్వలేకపోయారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద సాగునీటి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగలేదు.

నౌపడ–గుణుపూర్‌ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం రూ.900 కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ లైన్‌ వస్తే వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి. కానీ బడ్జెట్‌లో ఎక్కడా దీనిపై ప్రస్తావించలేదు.

పలాస ఫ్లై ఓవర్‌, నరసన్నపేట జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ పనులకు నిధులు కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. అమృత్‌ భారత్‌ పథం కింద శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కూడా నిధులు కేటాయింపుపై క్లారిటీ లేదు.

పలుచోట్ల రైల్వే అండర్‌ పాసేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వాటికి అతీగతి లేదు. ఈస్ట్‌కోస్టు రైల్వే లైన్‌తో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రైల్వే లైన్ల అభివృద్ధిపైనా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.

జిల్లాలో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రస్తుతం నాలుగులైన్ల జాతీయ రహదారి మాత్రమే ఉంది. దీన్ని ఆరు లైన్లుగా మార్పు చేయాల్సి ఉంది. ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పలు వంతెనల నిర్మాణాలు కూడా చేపట్టాలి. ఇవన్నీ పూర్తి చేయాలంటే రూ. వేల కోట్లలో అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రాష్ట్రంలో అన్ని జిల్లాల కు కలిపి సుమారు రూ. 800 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇవి ఒక్క జిల్లాకు కూడా సరిపోవు.

జిల్లాకు ఒక్క జాతీయ విద్యా సంస్థను తీసుకురాలేకపోయారు. జాతీయ స్థాయి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండేది. అది కూడా చేయలేదు.

వైఎస్సార్‌సీపీ హయాంలో బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌, జెట్టీ నిర్మాణాలు చేపట్టగా ఇప్పుడా పనులు పూర్తి చేసేందుకు కనీసం నిధులు కేటాయించలేకపోయారు.

జిల్లాలో అపారమైన అటవీ వనరులు ఉన్నా యి. ముఖ్యంగా ఔషధ మొక్కలు ఎక్కువగా ఉన్నా యి. సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌ (కేంద్రీయ ఔషధ మొక్కల పరిశోధన సంస్థ) వంటివి ఏర్పాటు చేస్తే ప్రపంచానికి కొత్త కొత్త ఔషధాలను పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. దాని కోసం కనీసం కృషి చేయలేదు.

నిధులు పాతాళంలో.!1
1/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!2
2/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!3
3/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!4
4/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!5
5/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!6
6/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!7
7/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!8
8/9

నిధులు పాతాళంలో.!

నిధులు పాతాళంలో.!9
9/9

నిధులు పాతాళంలో.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement