కష్టానికి ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

కష్టానికి ఫలితాలు

Feb 17 2026 8:53 AM | Updated on Feb 17 2026 8:53 AM

కష్టా

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు

●జేఈఈ మెయిన్స్‌లో సత్తా

చాటిన సిక్కోలు విద్యార్థులు

కంచిలి: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో కంచిలికి చెందిన గుడ్ల సాహితి 99.6 పర్సంటైల్‌ సాధించింది. ఈమె తండ్రి పైడిరాజు వ్యాపారం చేస్తుండగా, తల్లి శైలజ గృహిణి. ఇదే గ్రామానికి చెందిన బత్తుల వంశీకృష్ణ 99.414 పర్సంటైల్‌ సాధించారు. ఇతని తండ్రి రమేష్‌ కవిటి మండలం సిలగాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణితం స్కూల్‌ అసిస్టెంట్‌గా, తల్లి గాయత్రి మఠం సరియాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కంచిలి గ్రామానికి చెందిన ఇప్పిలి రాహుల్‌కు 98.5 పర్సంటైల్‌ వచ్చింది. ఇతని తండ్రి ప్రవీణ్‌ కంచిలిలో హార్డ్‌వేర్‌ వ్యాపారి, తల్లి శ్రీలక్ష్మి గృహిణి.

నరసన్నపేట: జేఈఈ మెయిన్స్‌లో స్థానిక శ్రీరాంనగర్‌కు చెందిన అల్లు రోహిత్‌ 99.97, మండలం తండ్యాలవానిపేటకు చెందిన తండ్యాల పవన్‌ సాయి 99.95 శాతం మార్కులు సాధించారు. రోహిత్‌ తండ్రి షణ్ముఖరావు ప్రైవేట్‌ డైట్‌కళాశాల్లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. తండ్యాల పవన్‌సాయి తల్లిదండ్రులు జనార్దనరావు, పద్మావతిలు ఉపాధ్యాయులు.

నందిగాం: కాపుతెంబూరుకు చెందిన పోలాకి అభిలాష్‌ 99.667 పర్సంటైల్‌ సాధించాడు. అభిలాష్‌ తండ్రి రామారావు టీచర్‌ కాగా తల్లి వాగ్ధేవి గృహిణి.

వజ్రపుకొత్తూరు రూరల్‌: పలాస–కాశీబుగ్గకు చెందిన విద్యార్థి మెట్ట వెంకట సాయి సరాగ్‌ 99.59 శాతం మార్కులు సాధించాడు. విద్యార్థి తల్లి మెట్ట పద్మావతి పోలాకి ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌లో ప్రిన్సిపాల్‌. మెట్ట పాపారావు పశు వైద్యాధికారి.

సారవకోట: అలుదుకు చెందిన పాగోటి సాత్విక్‌ 99.4164 పర్సంటైల్‌ సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు పాగోటి వాసుదేవరావు, ఝాన్సీ టీచర్లు.

బత్తుల వంశీక్రిష్ణ

గుడ్ల సాహితి

కష్టానికి ఫలితాలు1
1/7

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు2
2/7

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు3
3/7

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు4
4/7

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు5
5/7

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు6
6/7

కష్టానికి ఫలితాలు

కష్టానికి ఫలితాలు7
7/7

కష్టానికి ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement