● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావతి ● సెలవు రోజున ఇష్టానుసారంగా పంపిణీ చేశారని నిర్ధారణ | - | Sakshi
Sakshi News home page

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావతి ● సెలవు రోజున ఇష్టానుసారంగా పంపిణీ చేశారని నిర్ధారణ

Feb 17 2026 8:53 AM | Updated on Feb 17 2026 8:53 AM

● యూర

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావతి ● సెలవు రోజున ఇష్టానుసారంగా పంపిణీ చేశారని నిర్ధారణ కంకర అక్రమ తవ్వకాలకు చెక్‌ పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పెంటి భద్ర రెవెన్యూ పరిధిలో ఒక రైతుకు చెందిన డీ పట్టా భూమిలో జరుగుతున్న కంకర అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు సోమవారం అడ్డుకున్నారు. ఈ అంశంపై సాక్షిలో సోమవారం ‘యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు’ శీర్షికన వార్త వెలువడింది. దీనికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తిని పరిశీలించమని ఆదేశించగా ఆయన కాశీబుగ్గ ఆర్‌ఐ మన్మధరావు, వీఆర్‌ఓ ఖగేశ్వరరావు వెళ్లి పరిశీలించారు. పెంటిభద్ర రెవెన్యూ పరిధిలోని 410 సర్వే నంబర్‌లో గల ఆ భూమిని పరిశీలించగా అది అనేక చేతులు మారి చివరికి కాశీబుగ్గలోని ఒక ప్ర ముఖ వ్యాపారిదని తేలింది. అతను బొడ్డపాడు రెవెన్యూలోని ఎంఐజీ లేఅవుట్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కంకరను తరలిస్తున్నట్టు స్పష్టమైంది. ఈ సైట్‌పై కోర్టు లో కేసు కూడా ఉండటం గమనార్హం. కంకర తవ్వకాలను నిలుపు చేయడంతో ఆ వ్యాపారిని తీసుకొని ఎంఐజీ ప్రాజెక్టు సూపర్‌వైజర్‌ భాషా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అ నుమతి కోరడం విశేషం. దీనిపై తహసీల్దార్‌ మాట్లాడుతూ ఆ డీపట్టా భూమి సమస్య ప్ర స్తుతం కోర్టులో ఉందని, అనుమతి ఇవ్వా లా లేదా అన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందన్నా రు. ఏదైనా అనుమతి లేకుండా కంకర తవ్వడం సరికాదన్నారు. 375 బస్తాల యూరియా పక్కదోవ పట్టింది

గార: వమరవల్లి సచివాలయం వద్దకు వచ్చిన యూరియా పక్కదోవ పట్టినట్టు స్పష్టమైంది. ఆదివారం, మహాశివరాత్రి రోజున స్థానిక టీడీపీ నాయకుడి ఆదేశాలతో వమరవల్లి సచివాలయంలోని యూరియాను తూలుగు పీఏసీఎస్‌ సిబ్బంది టీడీపీ నాయకులకు ఇష్టానుసారం పంపిణీ చేయడం, దీనిపై స్థానిక రైతులు నిలదీసిన ఘటన అందరికీ తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం గార మండల వ్యవసాయాధికారి దుంపల పద్మావతి వమరవల్లి సచివాలయంలోని గోడౌన్‌ను తనిఖీ చేశారు. యూరియా బస్తాలను లెక్కించగా 181 బస్తాలు మాత్రమే ఉండటాన్ని గుర్తించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియలో ఉండటం, వమరవల్లి తదితర ప్రాంతంలో వరి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు ఉండటంతో తూలుగు పీఏసీఎస్‌కు 25 టన్నులు ( 556 బస్తాలు) కేటాయించారు. స్థానిక టీడీపీ నాయకుని ఆదేశాలతో ఆదివారం సాయంత్రం వేళ రైతులు, వ్యాపారులు ఇలా ఇష్టానుసారంగా 375 బస్తాలను ఇచ్చేశారు. స్థానిక సర్పంచ్‌ రఘునాథ రెడ్డి, స్థానిక రైతుల సమక్షంలో పీఏసీఎస్‌ సిబ్బంది రాసిన రికార్డు కూడా తప్పుల తడకగా ఉండటం, చనిపోయిన రైతుల పేర్లు కూడా నమో దు కావడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన కుర్మాన రాజశేఖర్‌, సోమేష్‌ తదితర రైతుల నుంచి సమాచారం సేకరించారు. తూలుగు పీఏసీఎస్‌కు యూ రియా పంపిణీపై షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నామని, సర్పంచ్‌ వినతి మేరకు మరో 10 టన్ను ల యూరియా ఉన్నతాధికారులు మంజూరు చేశారని ఏఓ పద్మావతి తెలిపారు.

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ1
1/2

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ2
2/2

● యూరియా స్టాకును తనిఖీ చేసిన గార వ్యవసాయాధికారి పద్మావ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement