ఒడిశాకు ఇసుక.. ఆగడం లేదుగా.. | - | Sakshi
Sakshi News home page

ఒడిశాకు ఇసుక.. ఆగడం లేదుగా..

Feb 17 2026 8:53 AM | Updated on Feb 17 2026 8:53 AM

ఒడిశా

ఒడిశాకు ఇసుక.. ఆగడం లేదుగా..

ఒడిశాకు ఇసుక.. ఆగడం లేదుగా.. ● పాతపట్నం, బైదలాపురం, ఎస్‌.ఎస్‌.మనుగు మీదుగా ట్రాక్టర్లు, టిప్పర్లు ద్వారా తరలిస్తున్న వైనం ● పట్టించుకోని అధికారులు

● పాతపట్నం, బైదలాపురం, ఎస్‌.ఎస్‌.మనుగు మీదుగా ట్రాక్టర్లు, టిప్పర్లు ద్వారా తరలిస్తున్న వైనం ● పట్టించుకోని అధికారులు

పాతపట్నం: ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు పట్టపగలే ఇసుక దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రా నుంచి ఒడిశాకు పట్టపగలే టాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా పాతపట్నం, బైదలాపురం మీదుగా పర్లాకిమిడి(ఒడిశా)లోకి తరలిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడంతో పాటు అవినీతికి పాల్పడుతూ అధికారులు పట్టించుకోవ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఎక్కువ శాతం టాక్టర్లు ద్వారా ప్రతి రోజు తెల్లవారు జాము న 5 గంటల నుంచి రాత్రి 8 గంటల అక్రమంగా తరలిస్తున్నారు. హిరమండలం మండలం భగీరథపురం, రుగడ, కొత్తూరు మండలం నివగాం, పొట్నూరు వంశధార నదిలో ఇసుకను ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒడిశాలో ఇసుక ట్రాక్టర్‌ రూ. 4 వేల నుంచి రూ.4,500 వేలు పలుకుతుంది. ఆంధ్రాలో ఇసుక ట్రాక్టర్‌ (పాతపట్నం)రూ.1,200 నుంచి రూ.2 వేలు ఉంది. పాతపట్నం జాతీయ రహదారి మీదుగా సరిహద్దు చెక్‌పోస్ట్‌ మీదుగా, రుగడ, బైదలాపురం, ఎస్‌.ఎస్‌.మనుగు మీదుగా పర్లాకిమిడిలోకి ఇసుక అక్రమంగా వెళుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో వి మర్శలకు తావిస్తుంది. ప్రతి రోజు సాయంత్రం వేళ ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ఎక్కువ టాక్టర్లు ఇసుక కోసం వస్తుంటాయని, అధికారికంగా ఇసుక రీచ్‌లు లేకపోయినప్పటికీ అక్రమంగా హిరమండ లం మండలంలోని భగీరథపురం, రుగడ, కొత్తూ రు మండలం పోంట్నూరు గ్రామ సమీపంలో వంశధార నదిలో తవ్వి రవాణా చేస్తుంటారు. అధికారు లు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఒడిశాకు ఇసుక.. ఆగడం లేదుగా.. 1
1/1

ఒడిశాకు ఇసుక.. ఆగడం లేదుగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement