పైపులైన్ పనుల పరిశీలన
హిరమండలం: హిరమండలం ఎత్తిపోతల పథకం పైపులైన్‌ను గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లతో పాటు వంశధార ఇంజినీర్ సోమవారం పరిశీలించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులకు ఉద్దానం మెగా రక్షిత నీటి పథకానికి సంబంధించిన పైపులైన్ అడ్డుగా ఉందని, ఇక్కడ పనులు సున్నితంగా చేపట్టాలని నీటి సరఫరా ఇంజనీర్లు సూచించారు. పైపులైన్ మరమ్మతులకు గురైతే దాదాపు 800 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎత్తుపోతల పథకం పైప్‌లైన్ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. కార్యక్రమంలో వంశధార, నీటి సరఫరా ఇంజినీర్లు ఎస్‌ఈ రామచంద్రరావు, శంకర్‌బాబు, ఈఈ రవీంద్ర, డీఈఈ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.


