బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు | - | Sakshi
Sakshi News home page

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు

Feb 17 2026 7:41 AM | Updated on Feb 17 2026 7:41 AM

బొత్స

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించారు ఎస్పీ గ్రీవెన్సుకు 39 అర్జీలు రహదారి నియమాలు పాటించాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీనియర్‌ నాయకుడు, వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి కిరాక్‌ ఆర్పీకి లేదని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్‌ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. విమర్శించే ముందు అతడి స్థాయి ఎంటో గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాలనుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందన్నారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ల ప్రోద్బలంతోనే ఇటువంటి దిగజారుడు కామెంట్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఒక బీసీ, కాపు నాయకుడి మీద చేస్తున్న దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర యాస, భాషపై ఈ రకంగా హేయంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆర్పీ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇచ్ఛాపురం రూరల్‌: రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగు ల సంక్షేమాన్ని విస్మరించారని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(ఆపస్‌) శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభ లో ఆర్థిక మంత్రి వయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ఉద్యోగులకు తీవ్ర నిరాశను మిగిల్చిందని విమర్శించారు. బడ్జెట్‌లో ఉద్యోగుల సంక్షేమంపై మొక్కుబడి మాటలతో సరిపెట్టారే తప్ప, ఆచరణాత్మకమైన నిధుల కేటాయింపులు లేకపోవడం శోచనీయమన్నారు. అత్యంత ప్రధానమైన 12వ పీఆర్‌సీ, డీఏ విడుదలపై బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల విడుదలకు ఎటువంటి రూట్‌ మ్యాప్‌ ప్రకటించలేదని విమర్శించారు.

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదు ల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (గ్రీవెన్సు)లో బాధితులు 39 ఫిర్యాదులు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

శ్రీకాకుళం క్రైమ్‌: యువత రహదారి భద్రతా నియమాలు పాటించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ కేవీ రమణ అన్నారు. డ్రగ్స్‌ వద్దు బ్రో అనే సందేశంతో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోస్టర్‌ ఆవిష్కరించారు. మత్తు పదార్థాల ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రామారావు, జిల్లా డీటీఆర్బీ విభాగం ఎస్‌ఐ సురేష్‌, సామాజిక కార్యకర్త వంగపండు రవికుమార్‌ పాల్గొన్నారు.

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు 1
1/2

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు 2
2/2

బొత్సను విమర్శించే స్థాయి ఆర్పీకి లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement