అందానికి ప్రాణంపోసే అదృశ్య శిల్పులు..!
జిల్లాలో రాణిస్తున్న మేకప్ ఆర్టిస్టులు
నటుల ఆహర్యం తీర్చిదిద్దడంలో
సిద్ధహస్తులు
శ్రీకాకుళం కల్చరల్:
ఒక సాదాసీదా మనిషిని రాజుగా మార్చాలన్నా, అందమైన ముఖాన్ని భయంకరమైన రాక్షసుడిలా తీర్చిదిద్దాలన్నా అది వారి చేతుల్లోనే ఉంటుంది. కేవలం రంగులు పూయడమే కాదు.. పాత్రలోని భావాన్ని ముఖంపై కనిపించేలా మ్యాజిక్ చేయగలరు. వారే నటుల రూపాన్ని మార్చే మేకప్ ఆర్టిస్టులు. వేదికపై పౌరాణికాలు, సాంఘిక నాటికలు ప్రదర్శించే నటులు ఎందరో సత్కారాలు, అవార్డులు పొందుతున్నారు. అలాగే సినిమాలు, టీవీ రంగాల్లోనూ ఎంతోమంది రాణిస్తున్నారు. అయితే వారు పొందుతున్న ప్రశంసలకు నటన ఒక ఎతైతే.. ఆ నటుడి ఆహార్యం(మేకప్) మరో ఎత్తుగా చెప్పవచ్చు. నటుడు ఎంత చక్కగా కనిపిస్తే వాళ్లకి అంత పేరు వస్తుంది. వారి విజయం వెనక మేకప్ ఆర్టిస్టుల కృషి ఎంతో ఉంటుంది. జిల్లాలో అలాంటి మేకప్ ఆర్టిస్టులు ఎంతోమంది వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. వారిలో సనపల వెంకటేశ్వరరావు, పైడి శ్రీధర్, ఎస్.రమణారావు, కేశిరెడ్డి శ్యాంకుమార్, నరసన్నపేటలో విష్ణు, వాసు, దండాసి, పలాసలో చిన్నకేశవ, బ్రాహ్మణతర్ల కాళిదాసు, రాపాకలో అప్పలనాయుడు, కింతలమిల్లు వెంకటరావు, లోలుగులో సీతన్న, శ్రీకూర్మంలో నాగభూషణం, పెంటూరులో నారాయణరావు తదితరులు ఉన్నారు. వారిలో కొంతమంది గురించి తెలుసుకుంటే..
రంగస్థల వేదికపై రూపశిల్పిగా ఎదుగుతున్న వ్యక్తి కింతలికి చెందిన పైడి శ్రీధర్. మేకప్ ఆర్టిస్టుగా పాత్రకు ఆయన కూర్చిన రూపం, నటుని ప్రతిభకు ప్రాణం పోస్తుంది. 1992 నుంచి ఈ రంగంలో ఉంటూ ఎన్నో నాటకాలకు మేకప్ వేయడంతో పాటుగా రంగాలంకరణ కూడా చేస్తున్నారు. ఎన్నో సత్కారాలు, అవార్డులు పొందారు.
50 ఏళ్లుగా రంగస్థలానికి సేవ చేస్తూ.. శ్రీకాకుళం నగరంలో ఎంతోమంది కళాకారులను తన మేకప్‌తో తీర్చిదిద్దిన మాంత్రికుడు కేశిరెడ్డి శ్యామ్‌కుమార్. ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులకు తాను రూపురేఖలు తీర్చిదిద్ది, వారి ఎదుగుదలకు, అవార్డులకు తెరవెనుక నుంచి కృషి చేస్తున్న వ్యక్తి. విశిష్టమైన కందుకూరి అవార్డుతో పాటు పలు అవార్డులు సత్కారాలు కై వసం చేసుకున్నారు. ఈయన భార్య కేశిరెడ్డి రాజేశ్వరి కూడా పౌరాణిక, సాంఘిక నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.
మేకప్, రంగాలంకరణ రంగంలో కళాసేవలో ఉంటూ ఎన్నో సత్కారాలు పొందారు సనపల వెంకటేశ్వరరావు. 1979లో ఈ రంగానికి వచ్చి మేకప్‌లోని మెలకువలు, కొంతకాలం సురభి నాటక సంస్థలో సెట్టింగుల్లో మెలకువలు నేర్చుకున్నారు. ఆయన వేసిన సెట్టింగులతో ఆయనను రంగస్థల విఠలాచార్యగా పిలుస్తారు. రాష్ట్రంలోనే కాకుండా ఖరగ్‌పూర్, బిలాయ్, ఢిల్లీ, బాంబే, పూణే, అహ్మదాబాద్, మద్రాసు, కోల్‌కతా నగరాల్లో ప్రదర్శనలకు వెళ్లి తన ప్రతిభను నిరూపించుకొని అనేక సత్కారాలు, కందుకూరి వీరేశలింగం పురస్కారం పొందారు.
ఈయన కింతలికి చెందిన కళాకారుడు. గత 40 ఏళ్లకు పైగా కళసేవలో తరిస్తున్నారు. ఎంతోమంది కళాకారులకు తన మేకప్‌తో అందమైన రంగులను అద్ది సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తన ప్రతిభను చాటే విధంగా పేరు సంపాదించి, సత్కారాలు, సన్మానాలు పొందారు.
కళ
అందానికి ప్రాణంపోసే అదృశ్య శిల్పులు..!
అందానికి ప్రాణంపోసే అదృశ్య శిల్పులు..!
అందానికి ప్రాణంపోసే అదృశ్య శిల్పులు..!
అందానికి ప్రాణంపోసే అదృశ్య శిల్పులు..!


