ఈనెల 27 నుంచి చతుర
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 27వ తేదీ నుంచి 2 రోజుల పాటు జాతీయ స్థాయిలో చతుర–2026 సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. ఎంబీఏ, బీబీఏ విద్యార్థుల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగాధిపతి కె.ఎల్.శ్రీకాంత్, కన్వీనర్ డి.ప్రణయ, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, శివకుమార్, కె.వేణుగోపాల్, వి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


