నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
కొత్తూరు: మండలంలోని పనిచేస్తున్న వీఆర్వో లు, గ్రామ సర్వేయర్లు, వీఆర్‌ఏలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్‌ఓల జిల్లా సంఘం నాయకులు గిరీష్ కుమార్ పట్నాయిక్‌తో పాటు పలువురు మాట్లాడారు. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వైఖరి వల్ల ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు ఇప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశిస్తుండడంతో ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని, 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భోజన సమయంలో నిరసన నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్‌కు విన్నవించారు.
బూర్జ: భర్త మద్యానికి బానిసైపోవడంతో భార్య మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నా రు. బూర్జ మండలంలోని లంకాం గ్రామానికి చెందిన కొయ్యాన స్రవంతి(39) సోమవా రం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె భర్త హరికృష్ణ తాగుడుకు బానిసైపోయారు. పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. ఎంత చెప్పినా పనికి వెళ్లడం లేదని మనస్తాపం చెందిన స్రవంతి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటిలోని గడ్డి మందు తాగేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు కవలలు ఉన్నారు. మృతురాలి అన్నయ్య నక్క వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న నేస్తం హామీలను వెంటనే అమలుచేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ డిమాండ్ చేశారు. సోమవారం లావేరులో చలో మంగళగిరి చేనేత గర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తర్వా త అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. అలాగే అర్హులైన వారందరికీ నేతన్న నేస్తాన్ని అమలు చేయాలని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ అమలు చేయాలని కోరారు. బడ్జెట్‌లో కూడా చేనేతకు కేవలం రూ.115 కోట్లు మాత్రమే ప్రకటించారని ఇందులో జీతా లు, ఆఫీస్ మెయింటెనెన్సులు ఇతర అంశాల ను వదిలేస్తే పథకాలకు రూ.29 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, సహకార సంఘాలకు ఉన్న రుణాలు రద్దు చేయాలని, చేనేతలకు ముడి సరకు జరీ పట్టు రసాయ నాలు సబ్సిడీపై సప్లై చేయాలని, చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన


