రీసర్వే భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రీసర్వే భూముల పరిశీలన

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

ముదిగుబ్బ: మండల పరిధిలోని మంగళమడక గ్రామంలోని సర్వే నంబర్‌ 44 భూములను గురువారం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భూమి సరిహద్దులను, ప్రస్తుత స్థితిగతులను అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి తప్పులకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. రికార్డుల ప్రకారం భూమి వివరాలను సరిచూసి నివేదికలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ముదిగుబ్బ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ హజివలి, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement