పెనుకొండలోని దర్గా సర్కిల్‌లో
పడిపోయిన భారీ వృక్షం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. గాలివానతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పెనుకొండ, సోమందేపల్లిలో వర్షం దంచికొట్టింది. పుట్టపర్తి, బుక్కపట్నం, గోరంట్ల, కొత్తచెరువు, మడకశిర, అమరాపురం, అగళి, గుడిబండ, రొళ్ల తుంపర్లు పడ్డాయి. పెనుకొండలో దర్గా సర్కిల్‌లో భారీ వృక్షం కూలడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. – పుట్టపర్తి అర్బన్


