మోసానికి కేరాఫ్‌ చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

మోసానికి కేరాఫ్‌ చంద్రబాబు

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

పెనుకొండ రూరల్‌: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు మోసానికి కేరాఫ్‌ అని, ప్రభుత్వ వైఫల్యాలను, మోసపు హమీలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేవలం అధికారం కోసమే కూటమి నాయకులు తప్పుడు హామీలతో గద్దెనెక్కారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ శాంతియుతంగా ర్యాలీ చేపట్టాలన్నారు. వెన్నుపోటుకు గురైన ప్రజలు, కార్మికులు, కర్షకులు ర్యాలీకి మద్దతు తెలపాలన్నారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాలు, వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు బోయ నరసింహా, సుధాకర్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు నాగళూరు బాబు, శ్రీకాంత్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు సల్లా సూర్యప్రకాశ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు సద్దాం, యాసిన్‌, శ్రీరాములు, కొండలరాయుడు, బోయ రాము, నారాయణ యాదవ్‌, చెన్నకేశవులు, మల్లిరెడ్డి, శివయ్య, పురుషోత్తంరెడ్డి, సుధాకర్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

విజయవంతం చేయాలన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement