నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు | - | Sakshi
Sakshi News home page

నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

ధర్మవరం అర్బన్‌: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగు నింపారని యువర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు తెలిపారు. ధర్మవరం పట్టణం యంబావీధికి చెందిన యంబా పోతలయ్య (85) మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ డాక్టర్‌ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్‌ సెంటర్‌ టెక్నీషియన్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ బీవీ సుబ్బారావులు మృతుని కంటి కార్నియాను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారులు యంబా చంద్రమోహన్‌, జయసింహ, ఆదిశేషు, అంజనప్రసాద్‌లకు యువర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేత్రాలు మరో ఇద్దరికి చూపును అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్స్‌ ఫౌండేషన్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్‌ వైకే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement