నవ సమాజ నిర్మాణంలో యువత కీలకం | - | Sakshi
Sakshi News home page

నవ సమాజ నిర్మాణంలో యువత కీలకం

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

కనగానపల్లి:నవ సమాజ నిర్మాణం, దేశాభివృద్ధి లో యువత పాత్ర కీలకమని ఎస్పీ ఎస్‌. సతీష్‌కుమార్‌ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్‌ టోర్నమెంట్‌ మంగళవారం ముగిసింది. ఎస్పీ సతీష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో యువత ముందుకుపోతే దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలన్నారు. గ్రామాల్లో కలసిమెలసి ఉండాలన్న ఉద్దేశంతోనే రామగిరి సర్కిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించామన్నారు. ఇందులో రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 60 టీంలు పాల్గొనగా, మొదటి స్థానంలో నిలిచిన మేడాపురం టీంకు రూ.40 వేలు, రెండో స్థానంలో నిలిచిన చెన్నేకొత్తపల్లి టీంకు రూ.30 వేలు, మూడవ స్థానంలో నిలిచిన తూంచర్ల టీంకు రూ.20 వేల నగదు బహుమతులతో పాటు విజేతలకు ట్రోఫీలను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రామగిరి సీఐ మహమ్మద్‌ అలీ, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐలు మహమ్మద్‌ రిజ్వాన్‌, ప్రదీప్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎస్పీ సతీష్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement