రూ.36 వేలు
రూ.1.785.60 కోట్లు
4.96 లక్షలు
జిల్లాలో 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలు
కదిరి: ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు మహిళలు కనపడగానే ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా ప్రతి సంవత్సరం..నీకు రూ.18 వేలు..నీకు రూ.18 వేలు..నీకు రూ.18 వేలు’ అని ఊదరగొట్టారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేర్చలేదు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇలాగే ‘మహిళలు బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు ఇంటికి రావాలంటే బాబు అధికారంలోకి రావాలి’..అన్నారు. ఒక్క నగ కూడా ఇంటికి రాలేదు. ఇక డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. తాజాగా ‘సూపర్ సిక్స్–సూపర్ సక్సెస్’ అంటూ చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలందరూ చెప్పుకుంటుండగా... ‘ఆడబిడ్డ నిధి ఏదీ బాబు’ అని జిల్లా మహిళలు ప్రశ్నిస్తున్నారు.
మహిళలకు రూ.1785.6 కోట్లు బాకీ
‘ఆడబిడ్డ నిధి’ ద్వారా ఒక్కో మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. ఈ క్రమంలో రెండేళ్లకు కలిపి ఒక్కో మహిళకు రూ.36 వేల చొప్పున చంద్రబాబు సర్కారు ఇవ్వాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు 4.96 లక్షల మంది ఉన్నారని అంచనా. ఈ లెక్కన ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ద్వారా రెండేళ్లకు రూ.1,785.60 కోట్లు చెల్లించాల్సి ఉంది.
మహిళలకు ఇచ్చిన హామీలు కొన్ని ఇలా..
● ‘ఆడబిడ్డ నిధి’ పేరుతో 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం.
● ‘తల్లికి వందనం’ పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15,000 చొప్పున అందజేస్తాం.
● వంటింట్లో మహిళలు గ్యాస్‌బండ కోసం ఇబ్బంది పడకుండా ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున ఉచితంగా ఇస్తాం.
● డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలిస్తాం.
● ఆడపడుచులకు నీళ్లు మోసే బాధ లేకుండా ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇప్పిస్తాం.
● ఉద్యోగాలు చేసే మహిళలకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తాం.
● ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా విద్యార్థినులకు రుణాలు ఇప్పిస్తాం
● పండుగ, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాం.
● పీ–4 ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
... ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బాబు...మహిళలను పూర్తిగా విస్మరించారు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఆడబిడ్డ నిధి’ కింద ఒక్కో మహిళకు ఏటా అందించాల్సిన సాయం
ఒక్కో మహిళకు చంద్రబాబు బాకీ పడిన మొత్తం
జిల్లా మహిళలకు అందాల్సిన మొత్తం
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు అందజేస్తాం
–ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది.
....చంద్రబాబు పాలన వగ్గాలు తీసుకుని రెండేళ్లు గడిచినా.. ఆడబిడ్డ నిధి గురించి ప్రస్తావించడం లేదు. ఎవరైనా గుర్తు చేసినా హామీలన్నీ అమలు చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే ఈ పాపం ఊరికే పోదంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.
‘సూపర్ సిక్స్’ పేరుతో నిండా ముంచిన చంద్రబాబు
హామీలన్నీ అమలు చేశామంటూ గొప్పలు
‘ఆడబిడ్డ నిధి’ ఏదీ బాబు అని ప్రశ్నిస్తున్న మహిళలు


