పట్టించుకోరు.. పరిష్కరించరు! | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోరు.. పరిష్కరించరు!

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

పుట్టపర్తి అర్బన్‌: చంద్రబాబు పాలన ప్రారంభం అయిన 2024 జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకూ కలెక్టరేట్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 43,239 అర్జీలు వచ్చాయి. ఇందులో 7,008 అర్జీలు రీ ఓపెన్‌ అయ్యాయంటే అధికారులు ఏ మాత్రం పరిష్కారం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 2,380 అర్జీలు పరిష్కార దశలో ఉన్నట్లు తెలిసింది. అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్‌, సర్వే, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీలకు సంబంధించినవే ఉంటున్నాయి. రెవెన్యూకు సంబంధించి 20,510 అర్జీలు రాగా 1,210 పరిష్కారమైనట్లు చూపుతు న్నారు. 3,101 అర్జీలు రీ ఓపెన్‌ అయ్యాయి. పోలీస్‌ శాఖకు సంబంధించి అందిన 6,383 అర్జీల్లో 1,557 రీ ఓపెన్‌ కాగా, 205 పరిష్కరించారు. ఇక.. సర్వే శాఖలో డబ్బు లేనిదే ఏ పనీ కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖకు 6,329 అర్జీలు రాగా 730 రీ ఓపెన్‌ అయ్యాయి. 219 పరిష్కారం కాలేదు. విద్యుత్‌ శాఖకు 842 అర్జీలు అందగా, 228 రీపెన్‌, 97 పరిష్కారమైనట్లు చూపారు.

తిరిగి తిరిగి వేసారి..

పీజీఆర్‌ఎస్‌లో అందజేసే ప్రతి అర్జీ తిరిగి కింది స్థాయి సిబ్బందికే చేరుతుండడంతో పెండింగ్‌ పెడుతున్నారు. ఒక్కోసారి సమస్యను పరిష్కరించకుండానే సంతకం చేయించుకొని తిప్పి పంపుతున్నారని అర్జీదారులు వాపోతున్నారు. మండల కేంద్రాల్లో పరిష్కారం చూపకపోవడంతోనే బాధితులు జిల్లాస్థాయికి వస్తున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా, మండల కేంద్రాలకు వెళ్లినప్పుడు అర్జీలపై ఆరా తీయకపోవడం బాధితులకు శాపంలా మారుతోంది. ఈ క్రమంలో మళ్లీ అర్జీలు రీ ఓపెన్‌ అవుతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. ఇటీవల కొంత మంది అర్జీదారులు ఆత్మహత్యకు యత్నించారంటే ఎంతలా మానసిక వేదన అనుభవించారో అర్థమవుతోంది.

ప్రజా ‘ప్రదక్షిణ’ వేదికలా

మారిన ‘పీజీఆర్‌ఎస్‌’

అర్జీలపై అర్జీలిస్తున్నా ఫలితం సున్నా

కనీసం ఆరా తీయని ఉన్నతాధికారులు

బాధితులకు తప్పని అవస్థలు

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ప్రహసనంలా మారింది. కార్యక్రమం కాస్తా ‘ప్రదక్షిణ’ వేదికగా మారింది. దూర ప్రాంతాల నుంచి బాధితులు వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని వచ్చి అర్జీలు సమర్పిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement