విదేశీ అతిథులకు అవస్థల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

విదేశీ అతిథులకు అవస్థల స్వాగతం

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

చిలమత్తూరు: సుదూరంలోని దేశం నుంచి వేల మైళ్లు ఎగిరొస్తాయి. స్థానికులకు కనువిందు కలిగిస్తాయి. అలాంటి విదేశీ అతిథులకు కష్టాలే స్వాగతం పలుకుతుండడం కలచివేస్తోంది. ఈ సారి మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు కళతప్పాయి. నీటి కోసం పశువులు, జంతువులు, పక్షులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సంతానోత్పత్తి కోసం వచ్చిన సైబీరియన్‌ కొంగలపై కూడా ఈ ప్రభావం పడింది. వర్షాభావంతో ఆయా చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో విదేశీ పక్షులు ఆహారం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్‌ మొదలు కిందిస్థాయి అధికారులు వీరాపురం వస్తున్నా కానీ సైబీరియన్‌ కొంగల పరిరక్షణకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement