50 అడుగుల లోయలోకి పడిన ఐచర్‌ | - | Sakshi
Sakshi News home page

50 అడుగుల లోయలోకి పడిన ఐచర్‌

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

క్లీనర్‌ మృతి, డ్రైవర్‌ ఆచూకీ గల్లంతు

ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు సమీపంలోని పులివెందుల ఘాట్‌లో ఆదివారం సాయంత్రం ఐచర్‌ వాహనం అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన క్లీనర్‌ నవేంద్ర (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్‌ వెంకటరమణారెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. టమాట మొక్కలకు కట్టే కట్టెల లోడుతో పులివెందుల వైపు నుంచి ముదిగుబ్బ వైపునకు వస్తున్న ఐచర్‌ వాహనం ఘాట్‌ రోడ్‌లో రెండో క్రాస్‌ వద్ద అదుపు తప్పి 50 అడుగుల లోతులోకి పడిపోయిందని పోలీసులు తెలిపారు. కట్టెల కింద పడి క్లీనర్‌ మృతి చెందగా డ్రైవర్‌ ఆచూకీ లభ్యం కాలేదు. స్థానికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అంగన్‌వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలోని కదిరి, ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లలో ఖాళీగా ఉన్న 230 అంగన్‌వాడీ ఆయా (సహాయకురాలు) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పీడీ ప్రమీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, సీకేపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి 18వ తేదీలోపు సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకొని గడువు లోపు అక్కడే సమర్పించాలన్నారు. కదిరి మండలంలో 70, నల్లచెరువులో 51, ధర్మవరంలో 21, బత్తలపల్లిలో 63, సీకే పల్లిలో 25 మొత్తం కలిపి 230 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

లోయలోకి పడిన ఐచర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement