పెనుకొండ: పట్టణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ మండలాల నుంచి వేలాది మంది భక్తులు, మహిళలు భారీ తరలివచ్చారు. స్థానిక 44వ జాతీయ రహదారి నుంచి అశేష భక్త జనుల మధ్య ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఊరేగించారు. జైశ్రీరాం అన్న నినాదాలతో పెనుకొండ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. హనుమత్ జయంతి కమిటీ పెద్దలు భక్తులకు తాగునీరు, భోజన సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్ నేతృత్వంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.


