విషపూరితమైన నీరు తాగి 50 గొర్రెల మృతి | - | Sakshi
Sakshi News home page

విషపూరితమైన నీరు తాగి 50 గొర్రెల మృతి

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

కళ్యాణదుర్గం రూరల్‌: మండల పరిధిలోని మల్లికార్జునపల్లిలో ఆదివారం కలుషిత నీరు తాగి 50 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... మల్లికార్జునపల్లికి చెందిన గొర్రెల కాపరి కృష్టప్ప (దివ్యాంగుడు) గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులా ఆదివారం తన గొర్రెలను సమీప అడవిలోకి మోతకోసం తోలుకెళ్లాడు. అయితే అడవిలో విషపూరితమైన నీరుతాగి వెంటనే 50 గొర్రెలు చనిపోయాయి. దీంతో దాదాపుగా రూ. 5 లక్షపైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే అదుకోవాలని గొర్రెల కాపరి క్రిష్టప్ప కన్నీటి పర్యంతమయ్యారు.

కుటుంబ కలహాలతో కార్మికుడి ఆత్మహత్య

తాడిపత్రి రూరల్‌: పట్టణ సమీపంలోని చుక్కలూరు క్రాస్‌లో ఉన్న ఎమ్మెస్సార్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కుటుంబ కలహాలతో కార్మికుడు పన్నారామ్‌ (34) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్‌గ్రేడ్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి వివరాలమేరకు.. రాజస్థాన్‌కు చెందిన పన్నారామ్‌ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం తాడిపత్రికి వచ్చాడన్నారు. గ్రానైట్‌ ఫ్యాక్టరీలో బంధువులు ఉండటంతో వారి సాయంతో కార్మికునిగా పనిచేస్తున్నాడని చెప్పారు. కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడని, అక్కడ కుటుంబ సభ్యులతో గొడవపడి తాడిపత్రికి వచ్చాడన్నారు. మనస్తాపంతో శనివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు కిటికిలోనుంచి చూడగా పన్నారామ్‌ ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించిదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామన్నారు.

బెంగళూరులో యాడికి యువకుడు..

యాడికి: మండల కేంద్రానికి చెందిన వెంకటనారాయణరెడ్డి , అరుణ దంపతుల చిన్న కుమారుడు కిశాంత్‌శాడ్డి (24) బెంగళూరులో తాను నివసిస్తున్న గదిలోనే శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కిశాంత్‌రెడ్డి బెంగుళూరులోనే చదువుకొని అక్కడే ప్రైవేటు కంపెనీలో నెల క్రితం ఉద్యోగంలో చేరారు. జూన్‌ నెలలో జీతం కూడా పొందిన కిశాంత్‌రెడ్డి తన తల్లికి తన మొదటి జీతం ఇవ్వడానికి వారం క్రితం యాడికికి వచ్చాడు. మూడు రోజుల క్రితం మళ్లీ బెంగళూరు వెళ్లిన కిశాంత్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని యాడికికి తీసుకురాగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కిశాంత్‌రెడ్డి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement