పంచాయతీ కార్యాలయ భవనం కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యాలయ భవనం కూల్చివేత

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

బ్రహ్మసముద్రం: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ నేతల అక్రమాలకు , ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గ్రామస్థాయిలో ముఖ్యంగా స్వపరి పాలనా వ్యవస్థలో అతి కీలకమైనది గ్రామ పంచాయితీ భవనం. టీడీపీ నేతలే దగ్గరుండి జేసీబీ యంత్రాలతో పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. వివరాలు... బ్రహ్మసముద్రం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలోని పంచాయతీ భవనాన్ని టీడీపీ నేతలు ఆదివారం ఉదయం కూల్చి వేసేందుకు జేసీబీ యంత్రాలతో అక్కడి వచ్చారు. అయితే పంచాయతీ భవనాన్ని కూల్చివేయడం ఏమిటని టీడీపీ మాజీ సర్పంచ్‌ కురుబ సందీప్‌ కుమార్‌తో పాటు టీడీపీ నేతలను గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్‌ నాకే అడ్డు చెబుతారా.. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం.. కూల్చండి అంటూ.. రకెంలేశాడు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్పారంటూ జేసీబీతో పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. బాగున్న భవనాన్ని కూల్చివేయడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఘటనపై ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్య వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఎమ్మెల్యే అమిలినేని చెప్పారని

రెచ్చిపోయిన టీడీపీ నేతలు

బాగున్న భవనం కూల్చివేయడమేంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement