అక్రమ మద్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం స్వాధీనం

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

హిందూపురం టౌన్‌: హిందూపురం ఎకై ్సజ్‌స్టేషన్‌ పరిధిలోని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి, 350 మద్యం ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య పేర్కొన్నారు. శనివారం పరిగి మండలం గణపతిపల్లికి చెందిన మారెప్ప ద్విచక్ర వాహనంలో 240 ప్యాకెట్ల కర్ణాటక మద్యంను తరలిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నామన్నారు. అలాగే చిలమత్తూరు మండలం సోమగట్ల గ్రామ పరిసరాల్లో సుధాకర్‌, సోమశేఖర్‌ ద్విచక్ర వాహనంలో 110 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌ విధించినట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో వివిధ ఎకై ్సజ్‌ నేరాల్లో పట్టుబడిన ముగ్గురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో డీటీఎఫ్‌ సీఐ హరికృష్ణ, ఎస్‌ఐలు పృథ్వీ, నారాయణస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

108లో ప్రసవం

ఓడీచెరువు: మండల పరిధిలోని సున్నంపల్లికి చెందిన అశ్విని (20) రెండో కాన్పు నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి శనివారం తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు కాల్‌ చేయడంతో కదిరి 108 సిబ్బంది కదిరి ఏరియా ఆస్పత్రి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో అశ్విని నొప్పులు అధికం కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి వైద్యుల సూచన మేరకు కాన్పు చేశారు. ప్రసవానంతరం వైద్యపరీక్షలు చేసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలపడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.

నారసింహా నమోస్తుతే

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement