కష్టంగా జీవనం | - | Sakshi
Sakshi News home page

కష్టంగా జీవనం

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

ఆర్టీసీలో 30 ఏళ్లు డ్రైవర్‌గా పని చేశా. పెరాలసిస్‌ రావడంతో రిటైర్‌మెంట్‌ తీసుకున్నా. అదనపు ప్రయోజనాల కింద రూ.8 లక్షలు రావాల్సి ఉంది. నాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదాయం లేకపోవడంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది.

– హనుమంతరెడ్డి,

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి, కదిరి

చేతిలో చిల్లిగవ్వ లేదు

కదిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా 14 ఏళ్లు పని చేశా. రెండుసార్లు బ్రెయిన్‌ ఆపరేషన్‌ జరిగింది. 2021లో రిటైర్‌మెంట్‌ పొందా. నాకు భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేయాల్సి ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. వైద్య ఖర్చులకు ప్రతినెలా రూ.5 వేలు ఖర్చవుతోంది. రూ.11 లక్షల అదనపు మానిటరింగ్‌ బెనిఫిట్స్‌ అందజేయాలి.

– ఆంజనేయులు, ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement