పుట్టపర్తి:బుక్కపట్నం మండల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. ప్రధాన రోడ్డులో నివాసం ఉన్న హేమలత గురువారం వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం ఇంటికొచ్చి చూడగా ఇంటి తాళం తీసి ఉంది..బీరువాలోని 5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.
20 క్వింటాళ్ల పత్తి అపహరణ
బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లులో రైతు పొలం వద్ద నిల్వ ఉంచిన పత్తిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు, గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురాకుల హనుమంతరాయుడు ఏడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఇటీవల పత్తి కోత పూర్తి చేసి దిగుబడిని పొలం వద్ద నిల్వ ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దాదాపు 20 క్వింటాళ్ల పత్తిని ఎత్తుకెళ్లారు. పత్తి విలువ రూ.2 లక్షలకు పైగా ఉంటుందని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


